కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ (𝐊𝐚ṭ𝐡ō𝐩𝐚𝐧𝐢ṣ𝐚d‌ 𝐕𝐢𝐯𝐚𝐫𝐚ṇ𝐚 – 𝐊𝐚𝐥ā𝐤𝐚𝐥𝐚𝐛𝐡ō𝐝𝐡𝐚)

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 1 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఉపోద్ఘాతము 🌻

ఉపనిషత్‌ అంటే ఉప+నిషత్‌ గురువుకు సమీపముగా నుండి విచారించుట – అని అర్థము.

ఉపనిషత్‌ విచారణ క్రమంలో ప్రధానం ఏమిటంటే గురువుగారు చెప్పినదానిని చెప్పినట్లుగా ఆచరించటం.

శరణాగతులైనటువంటి శిష్యులకు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సాధ్యం. మిగిలినటువంటి వారికి అనుసరణీయులు అయినటువంటి వారికి, ఈ ఉపనిషత్‌ విచారణ పెద్దగా ఫలవంతం కాదు.

కాబట్టి మీలో కూడా ఆ విధమైనటువంటి శరణాగత లక్షణం నూటికి నూరుపాళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే ఉపనిషత్‌ విచారణ సక్రమంగా సాగుతుంది. సరైనటువంటి సందేహాలు కలుగుతాయి. సరైనటువంటి పరిష్కారాలు సూచించబడుతాయి.

శిష్యుని యొక్క అధికారిత్వం బట్టి ఉపనిషత్ యొక్క ప్రయోజనం. ఈ ప్రయోజనం మాత్రం అన్నింటికి సమానమే. ఏమిటంటే, పరబ్రహ్మ నిర్ణయమే ప్రయోజనం. వేదము యొక్క యథార్థ లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయము. జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ – ఈ నాలుగు స్థితులని, కర్మ-భక్తి-యోగ-జ్ఞాన మార్గముల ద్వారా నిర్ణయం చేయడమైనది.

ఈ నాలుగు మార్గముల ద్వారా సుస్పష్టమైనటువంటి విధి విధానాన్ని, జీవనాన్ని అందించినటువంటి గొప్పశాస్త్రం వేదము. ఈ మానవజాతికి ఉత్తమమైనటువంటి ప్రసాదం. ‘వ్యాసోచ్ఛిష్టము’. వేదము అంతా కూడా వ్యాసోచ్ఛిష్టము’ అంటే అర్థం ఏమిటంటే వేదము వ్యాసుని చేత బోధించబడింది.

వేదాంత శ్రవణం అంటే ఏమిటి? వేదాంతం అంటే, వేదముల యొక్క అంత్యమునందు బోధించబడినటువంటి ఉపనిషత్‌ వాక్యములు ఏవైతే ఉన్నాయో, అట్టి ఉపనిషత్తులకే వేదాంతం అని పేరు.

ఈ వేదాంతమైనటువంటి ఉపనిషత్తు వాక్యములందు ప్రధానము తత్వజ్ఞానము .తత్‌, త్వం అని విచారణ ద్వారానే ఈ నడక అంతా సాగుతుంది. ఈ తత్వమసి మహావాక్యోపదేశం క్రమంగా చెప్పబడినటువంటి ఉపనిషత్‌ వాక్య విచారణని ఆశ్రయించి ఎవరైతే ఉపనిషత్తుని అధ్యయనం చేస్తారో, వారికి తప్పక జ్ఞానసిద్ధి కలుగుతుంది.

మృత్యుదేవత అయినటువంటి యమునకు, ఆశ్రయించినటువంటి నచికేతునకు మధ్య జరిగినటువంటి సంవాద రూపమే ఈ కఠోపనిషత్తు.

నచికేతుడు యమధర్మరాజు తనకిచ్చెదనన్న మూడు వరములలో, మూడవ వరముగా మనష్యుడు మరణించిన తర్వాత అతడు ఉండునని కొందరు, ఉండడని కొందరు చెప్పుచున్నారు. ఉన్న ఎడల ఆ తత్త్వమును గురించి చెప్పవలసినదిగా కోరినాడు.

దీనికి సమాధానముగానే అనేక ఉపమానములతో ఈ ఉపనిషత్‌ చెప్పబడినది. యమధర్మరాజు నచికేతుడు అడుగగానే ఆత్మతత్వమును బోధింపక అతనిని ధన కనక వస్తు వాహనాదుల నిచ్చెదనని అనేక ప్రలోభములకు గురిచేసి అతని అర్హతను గుర్తించిన తర్వాతనే ఆత్మను గురించి బోధించెను. వైరాగ్యము మొదలగు అర్హతులున్నవారే బ్రహ్మజ్ఞానమునకు అర్హులని స్పష్టమగుచున్నది.

జీవునిగా ఏ రకమైనటువంటి ప్రలోభాలు ఉంటాయో, ఆ ప్రలోభాలన్నింటినీ నీకు అసలు ఉన్నాయా? లేదా? అని పరీక్షించిన తరువాతనే నీకు ఆత్మవిద్యను ఉపదేశించడం జరుగుతుంది. ఎవరైతే జీవభావంలో ఉన్న ప్రలోభాలకు లొంగనివారు ఉంటారో, వాళ్ళు మాత్రమె ఆత్మవిద్యకు అర్హులు.

అటువంటి ధన, కనక, వస్తు, వాహన, జగత్‌ సంబంధమైనటువంటి, సంసార సంబంధమైనటువంటి, పుత్ర, పౌత్ర, ధన, ధారాదులను అనుగ్రహించగలిగే సమర్థుడైనటువంటి యమదేవత అవన్నీ ఇస్తానంటాడు.

అవన్నీ ఇస్తానంటే, సంతృప్తి చెందిన వాడవైతే, నీవు ఆత్మవిద్యకు పనికిరావు. దీనిని బట్టి సూచన ఏమి తెలుసుకోవాలి? మనలో ఇప్పుడు వింటున్న వారిలో జగత్‌ సంబంధమైనటువంటి కామ్యకర్మల ద్వారా సంతృప్తి, భోగి భోగ్య భావన ద్వారా ఎవరైతే భోక్తగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారో, వీరు ఈ రకమైనటువంటి ఆత్మవిద్యను గ్రహింప జాలరు.

సతి, సుత, ధార, మోహములు ఎవరికైతే బలంగా ఉన్నాయో, ఎవరికైతే ధన కనక వస్తు వాహనాది ప్రాప్తి యందు ఆసక్తి కలిగియున్నారో, వారు ఆత్మవిద్యను గ్రహించడానికి అధికారిత్వము లేనటువంటివారు.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

 
15.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 2 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

మోహత్యాగము ఎవరైతే చేశారో, వారు మాత్రమే ఆత్మవిద్యను పొందగలుగుతారు. ఆత్మవిద్యను తెలుసుకుంటే మోహం పోతుందా? మోహం విడిచిన వాడికి ఆత్మవిద్య వస్తుందా?

చీకటి ఎప్పుడు పోయింది? వెలుతురూ ఎప్పుడు వచ్చింది? వెలుతురు వస్తే చీకటి పోయింది. చీకటి వస్తే వెలుతురు పోయింది. రెండింటిలో ఏది కరెక్టు? చీకటి తనంతట తానుగా పోదు. వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి .

కాబట్టి, మోహం తనంతట తానుగా విడువదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం చేతనే, మోహం నుంచి విడువడుతావు. కాబట్టి, అట్టి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్న శీలురై ఉండాలి. ఇది లక్ష్యము.

సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను గుర్తించవలెనన్న ఇంద్రియములను బాహ్యవృత్తులనుండి మరలించి, మనస్సును ఏకాగ్రము చేసి విచారణ ద్వారా, ధ్యానము ద్వారా ఆత్మను గుర్తించవలెను. సూక్ష్మము అంటే ఏమిటి? కనిపించనది సూక్ష్మము. కనబడేది అంతా స్థూలము, అంటే ఇంద్రియ గోచరమయ్యేది అంతా. కనబడేది అంతా అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియముల ద్వారా తెలియబడేది అంతా స్థూలమే!

కర్మేంద్రియములు అన్నీ కలిపి ఒకటే మూట. కర్మేంద్రియముల సంఘాతము ఒక మూట, జ్ఞానేంద్రియ సంఘాతము ఒక మూట. ఈ రెండూ కలిపితే ఇంద్రియ సమూహము. ఈ రెండింటి ద్వారా నీకు సంవేదనల రూపంలో తెలియబడుతున్నదంతా స్థూలమే.

మరి సూక్ష్మమనగా ఏమి? ఆహార ప్రాణ మనస్సుల యొక్క సమాహారమైన శక్తి ఏదైతే ఉందో అది సూక్ష్మము. ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి ఆత్మను గ్రహించాలి అంటే, సశక్తమైనటువంటి ఇంద్రియం బుద్ధి ఒక్కటే! మిగిలినవి ఏవీ సశక్తమైనవి కావు.

ఎవరిలో అయితే ఈ బుద్ధి వికాసం పూర్ణంగా వికసిస్తుందో, అది మాత్రమే తన బింబమైనటువంటి చైతన్యమునందు సంయమించడానికి అర్హమైనటువంటి ఇంద్రియము.

సత్వగుణ ప్రధానంగా ఉండేటటువంటి సూక్ష్మబుద్ధి ఎవరికైతే ఉందో, వారు మాత్రమే ఆత్మ విద్యను గ్రహించగలుగుతారు. ఎవరెవరికైతే ఇంద్రియోపలబ్దమైనటువంటి జగద్భావనలయందు ఆసక్తి ఉన్నదో, వారు స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉంటారు.

కాబట్టి, అటువంటి స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆత్మ విద్యను తెలుసుకోవడానికి వీలుకాదు. సూక్ష్మబుద్దే సాధ్యం కానటువంటివారికి, బుద్ధి గ్రాహ్యమతీంద్రియం – అనేటటువంటి స్థితి అసాధ్యం.

కాబట్టి మానవులు మొట్టమొదట ఏ స్థితికి ఎదగాలి? సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితికి ఎదగాలి.

స్థూలగతమైనటువంటి ఇంద్రియోపలబ్ధి చేత పొందేటటువంటి సుఖ దుఃఖ సమావిష్టమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి వాటి వెనుక ఆసక్తిని, భోగ్య భావనని నీవు జయించినప్పుడు మాత్రమే, బుద్ధి అంతర్ముఖమై సూక్ష్మస్థితిని పొందుతుందన్నమాట.

కాబట్టి, సాధన ప్రతి ఒక్కరూ ఏ దిశగా చేయాలి? బుద్ధి తన బింబమైనటువంటి చైతన్యము నందు సంయమింప చేసేటటువంటి జ్ఞానపద్ధతిని ఆశ్రయించాలి. అందరూ ధ్యానం ధ్యానం అని అంటూ ఉంటారు. ఏమిటి ధ్యానం అంటే? బుద్ధిని తన మూలమైనటువంటి చైతన్యమందు సంయమింప చేయడమే ధ్యానం అంటే!
🌹 🌹 🌹 🌹 🌹

 
16.Jul.2020

———————————— x ————————————


 
🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 3 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
ఆత్మ సాక్షాత్కారమైనవారికి పునర్జన్మ లేదని, మోక్షము పొందుదురని, ఆత్మసాక్షాత్కారము కాని వారు వారి కర్మననుసరించి మరల మరల జన్మించుదురని చెప్పబడినది. ఏమిటి ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే? మోక్షానికి అధికారిత్వమే ఆత్మసాక్షాత్కార జ్ఞానం.
 
ముక్తి మోక్షము అన్న రెండు స్థితులని కూడా ఆత్మసాక్షాత్కారం లేనిదే నీకు అధికారిత్వము రాదు. ఏమిటయ్యా? ఇందులో ఉన్న విశేషము అంటే, జనన మరణ చక్రములోనుంచి నిన్ను బయట పడవేయగలిగినటువంటి సమర్థనీయములు ఇవి.
 
ఇది సృష్టి లక్షణమైనటువంటి జనన మరణ చక్రం ఏదైతే ఉందో, ఈ జనన మరణ చక్రానికి కారణమైనటువంటి అవిద్యను పోగొట్టుకోగలిగినటువంటి సామర్ధ్యము కలిగి యున్నది.
 
🌻. మోక్షప్రాప్తికి సాధనములు ఏమిటట ? శ్రద్ధ, పట్టుదల. 🌻
 
మానవునికి ప్రతీక్షణము లోపించేటటువంటివి రెండు. అయితే శ్రద్ధైనా లోపిస్తుంది, లేకపోతే పట్టుదలైనా లోపిస్తుంది. బుద్ధి యొక్క వైక్లబ్యానికి, విపరీతజ్ఞానానికి ఇవి రెండే మూలకారణము. ఎప్పటికప్పుడు మానవుడు పరీక్షించుకోవాలన్నమాట.
 
నేను లక్ష్యశుద్ధిలో ఉన్నానా? లేదా? లక్ష్యసిద్ధి కొరకై ప్రయత్నిస్తున్నానా? లేదా? లక్ష్యశుద్దేమో శ్రద్ధ, పట్టుదల. లక్ష్యసిద్ధి ఏమో ప్రయత్న పూర్వకము.
 
కఠోపనిషత్తును వల్లులుగా తీర్చిదిద్దడమైనది. ప్రథమవల్లి, ద్వితీయవల్లి, తృతీయవల్లి, చతుర్థ వల్లి, పంచమ వల్లి – ఇలా వల్లులుగా తీర్చిదిద్దడమైనది.
 
వల్లి అంటే అర్థం ఏమిటంటే లత. ఏదైన లత అల్లుకోవాలంటే దానికి ఆధారంగా స్థిరమైనుటువంటి ఒక ఆధారాన్ని పెట్టాలి. ఒక కర్రో, ఒక శూలమో ఏదైతే కదలకుండా, స్థిరంగా, స్థాణువుగా ఉంటుందో, దానిని అశ్రయించి అల్లుకునేది ఏదైతే ఉందో, దానిని వల్లి అంటారు.
 
ఈ వల్లి అనేటటువంటిది ఎందుకు పెట్టారయ్యా అంటే, కొంతకాలం తరువాత ఏమైపోతుందంటే, ఆ మధ్యలో ఏదైతే ఆధారంగా పెట్టబడినటువంటి కర్ర ఉన్నదో, ఆ కర్ర కనబడదు. అంతగా ఈ వల్లి దాని చుట్టూ అల్లుకుంటుందన్నమాట. మొత్తం ఆ శిష్యుని యొక్క సాధికారత వల్ల, శిష్యుడే గురువై శోభిస్తాడు అని అర్థం.
 
ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావో, ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రభావం చేత, గురుశిష్యుల మధ్య అభేద సిద్ధి కలుగుతుంది.
 
ఇట్టి అభేద సిద్ధి వల్ల, శిష్యుడికి ఈ గురువుకి మానసికమైనటువంటి అభేదం ఏర్పడుట వల్ల దేశకాలమానములు అనేటటువంటి భేదములు వారిద్దరి మధ్య ఎక్కడ కూడా పొడసూపవు. ఈ ఐక్యతాసిద్ధిని పొందవలసినటువంటి అవసరం సాధకులందరికీ ఉన్నదన్నమాట.
 
కాబట్టి దీనిని వల్లులుగా తీర్చిదిద్దడం వెనుక ఉన్నటువంటి గొప్ప రహస్యం ఇదన్నమాట. అట్టి ఐక్యత సిద్ధిని పొందాలి అనేటటువంటి సూచన అందులో ఉందన్నమాట.
🌹 🌹 🌹 🌹 🌹
 
17.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 4 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
గురువుగారి అనుమతి తీసుకుని శిష్యుడు వెళ్ళాలి. తండ్రి యొక్క అనుమతి తీసుకుని పిల్లవాడు వెళ్ళాలి.
 
ఈ “అనుమతి” – అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ్టి రోజున అనుమతితో పనిలేకుండా మనం అందరం జీవిస్తున్నాము, ఒకరి అనుమతితో మరొకరికి పనిలేదు.
 
ఏ మానవ సంబంధాలలో అయితే ఈ అనుమతి అన్నటువంటి దానికి లోబడి జీవించడం అనేటటువంటి విధానం వుంటుందో అక్కడ అతి గొప్పదైనటువంటి నియమం ‘శరణాగతి’ అమలపరచ బడుతుంది. నీలో ఉన్నటువంటి దివ్యత్వానికి నేను దాసోహం.
 
నీలో ఉన్నటువంటి చైతన్యానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి వివేకానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి విజ్ఞానానికి నేను దాసోహం. దాసోహం అంటే అర్థం ఇది.
 
ఈ రకంగా ఎదుటి వ్యక్తిలో వున్నటువంటి వివేక, విజ్ఞానాలకు, దివ్యత్వానికి నువ్వు ఎప్పుడైతే శరణాగతుడవు అవుతావో, అప్పుడు ఆ ‘అనుమతి’ అనేటటువంటి విధానం నీలో ఏర్పడుతుంది. అట్లా ఎవరిలో అయితే వీటిని గుర్తించగలిగేటటువంటి లక్షణం వస్తుందో, వారిలో భక్తి, ప్రపత్తులు పెరుగుతాయి.
 
ఎవరైతే వివేకానికి, విజ్ఞానానికి, విచారణకి, వస్తునిశ్చయ జ్ఞానానికి ప్రాధాన్యతను ఇచ్చి, దివ్యత్వ ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచియుంటారో, వారు ఆ అనుమతి ఇవ్వడం చేతనే వారి బలమంతా కూడా వీరికి సంక్రమిస్తుంది.
 
           అష్ట దిక్పాలకులలో ఒకడైనటువంటి యమధర్మరాజు బాలుడైనటువంటి నచికేతుడిని ‘అపరాధ క్షమాపణ’ అడుగుతున్నాడు.
 
మనం జీవితంలో ఎప్పుడైనా క్షమించమని ఎవరినైనా అడిగామా? అడగాలంటే మన కిరీటం పోయినట్లు, మన సింహాసనం పోయినట్లు, లేకపోతే మన రాజ్యం అంతా విడిచి వెళ్ళిపోయినట్లు బాధపడిపోతూ వుంటాము, కదా!
 
ఎవరినైనా క్షమించమని అడగాలంటే, మనకు చాలా బాధ కలుగుతుంది. చాలామంది క్షమాపణ అడుగుతారు, ఎట్లా అడుగుతారంటే? డిమాండ్‌ గా అడుగుతారు.
 
పశ్చాత్తాప భావన లేదనుకోండి అదే పొరపాటుని మరల మరల మరల మరల పునః పునః చేస్తూ వుంటాం అన్నమాట. ఒక్కసారి పశ్చాత్‌ తాప పడినట్లయితే, మరలా ఆ పనిని తిరిగి చేయకుండా వుంటాం అన్నమాట.
 
కాబట్టి, యమధర్మరాజు ఈ రీతిగా మనకి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. తన అపరాధమునకు, తెలియక జరిగినటువంటి అపరాధమునకు క్షమాపణ వేడుతున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
 
18.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 5 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
  నచికేతుడు ఏం చేశాడు? మొదటి వరం అడిగాడు. ఓ వైవస్వతా! నా తండ్రి నన్ను మీ ఇంటికి పంపిన తరువాత నన్ను గురించి చింతించు చుండును.
 
కావున నా తండ్రి ఎటువంటి చింతన లేక, ప్రసన్న చిత్తంతో ఉండునటుల అనుగ్రహింపుము. మరియు మీరు నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు, నా తండ్రి నన్ను బాగుగా గుర్తించి, ప్రేమతో మాట్లాడునట్లు అనుగ్రహింపుము…
 
ఎవరైనా మనల్ని వరం కోరుకోమంటే మనం ఏం అడుగుతాం? ముందు నా సంగతి ఏంటో చూడండి బాబూ అంటాం. అంతేనా కాదా? సర్వజీవులు అన్నీ కూడా స్వసుఖం అనేటువంటి దానిచేత ప్రేరేపితమై మాట్లాడుతూ వుంటాయి.
 
ఇక్కడ ఓ జ్ఞానీ! అని ఈ నచికేతుడిని ఎందుకు సంబోధించారో ఇప్పుడు ఈ మొదటి వరం అడగడంలోనే మనం తెలుసుకోవాలి. తను నిజానికి తండ్రి చేత బాధించబడి పంపబడ్డాడు. కానీ తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షించాడు మొట్టమొదట.
 
తనకు ఆయన గురువుగారు. తండ్రి మాత్రమే కాకుండా తపస్వి, గురువుగారు. ఆయన యొక్క అనుమతి వల్లనే ఆ యమాలయమునకు రాగలిగాడు.
 
ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నచికేతుడు మొట్టమొదట వరాన్ని ఏ దిశగా కోరాడు? అంటే, తన గురువుగారు సంతోషంగా వుండాలి. అంతే కాకుండా తన యెడల వ్యగ్రత భావాన్ని లేకుండా తనను చూడాలి.
 
ఆ వరం కోరే విధానం కూడా ఎలా అడిగాడో చూడండి. ఆయన అభ్యర్థించాడు వరములు కోరుకోమని, ఈయన కోరికలు కూడా ఎంతో వినయశీలియై అభ్యర్థించాడు. ఇది చాలా ముఖ్యం.
 
            మనం పిల్లల్ని ఏమైనా నీకేమి కావాలో కోరుకోరా అని అడిగేప్పడు కూడా మనలో అహం వ్యక్తమౌతుంది. ఇచ్చేచేయి నాదనేటటువంటి అహం పనిచేస్తుంది.
 
అడిగేవాడు కూడా అధికారంతోటి అడుగుతున్నాను. హక్కుగా అడుగుతున్నాను అనుకుంటాడు. కానీ, ఇచ్చేవారిలోనూ వినయశీలత, పుచ్చుకునే వారిలోనూ వినయశీలత ఎప్పుడైతే వుంటుందో ఇద్దరిలోనూ దివ్యత్వం రాణిస్తుంది.
 
      మీరందరూ ఇంట్లో గృహస్థుగా మీరు సాధారణంగా రోజూ చేసే పని ఏమిటీ అనంటే, అన్నం వండుతారు, మీ భార్య పిల్లలు మీ భర్త గారు అందరూ కలిసి భోజనం చేసే ప్రయత్నం చేస్తారు.
 
సాధారణంగా గృహిణి స్థానంలో వున్నటువంటి భార్యగారు అందరికీ ఆహర సేవలను అందిస్తూ, వారికి అన్నీ వడ్డిస్తారన్నమాట! వడ్డించేటప్పడు ఎలా వడ్డించాలి? తినేటప్పుడు ఎలా వుండాలి? ఒక సేవను అందించేటప్పుడు ఎలా అందించాలి? అనేది చాలా ముఖ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ‘ఇచ్చే చేయి నాది’ అనే అహం ఉండకూడదు. ‘చేసేవాడను నేను, నేనే చేస్తున్నాను’ అనే అహంతో చేయకూడదు.
 
అలా గనుక చేశావనుకో అప్పుడు ఈశ్వరానుగ్రహానికి దూరం అవుతావు. పొందేవారు కూడా, సేవలను పొందేవారు కూడా ఈశ్వర ప్రసాదంగా ఆ సేవలను పొందాలి.
 
కానీ భౌతికమైన, ఐహికమైన, సుఖభోగ ఇంద్రియ లాలసతో ఆ ఇంద్రియ విషయార్థములుగా వాటిని స్వీకరించకూడదు. ఈ రకంగా ఒకరి యెడల మరొకరు మానవ సంబంధాలలో దివ్యత్వాన్ని అనుగమించేటటువంటి ప్రతిక్షేపణ చేసుకోవాలి.
 
       ఆ దివ్యత్వాన్ని ఎప్పుడైతే మనం అనుభూతం ఒనర్చుకునేటటువంటి పద్ధతిగా ఈ మానవసంబంధాలని కలిగివుంటావో అప్పుడు ప్రతి చోట మానవుడు దైవీ స్వరూపుడిగా మారిపోతాడు. నువ్వు దైవీభావనలోకి మారిపోతావు. ప్రతి చోట ‘నేను’ అన్న స్థానంలో ఆ ‘ఈశ్వరుడు’ వచ్చి కూర్చొంటాడు.
 
ప్రతీ చోట ‘నేను’ అన్న స్థానంలో ‘నేను’ను తొలగించి, ఆ ఈశ్వరుడిని ప్రత్యక్షంగా అందులో ప్రతిపాదించాలన్నమాట. అంతేకాకుండా, ప్రతిక్షేపించాలి. ‘నేను’ అన్న ప్రతీ చోట ‘ఈశ్వరుడు’ని పెట్టడం అభ్యాసం చేయాలి.
🌹 🌹 🌹 🌹 🌹
 
19.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 6 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

నిద్రాదేవత ఈ మృత్యు దేవత ఆధీనంలో వుంటుంది. నిద్ర పట్టని వారు కొంతమంది వున్నారు. ఊరకూరికే లేచికూర్చొంటుంటారు, ఊరుకూరికే కలత నిద్ర పోతూ వుంటారు. కారణం ఏమిటి? అంటే, మరణభయ సమానమైనటువంటి కలలు వస్తుంటాయి.

ఆ మరణ భయ సమానమైనటువంటి కలలు ఎప్పుడైతే ప్రస్ఫటమైనటువంటి, బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధులమీద చూపిస్తాయో, అప్పుడు నీ నిద్ర భంగమై పోతుంది.

కారణమేమంటే, మేల్కొంటే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, పూర్తిగా ఎఱుకను పొందితే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, ఒక్కొక్కప్పుడు పోదు కూడా, మేల్కొన్నా కూడా ఆ కల యొక్క ప్రభావం పోదు. కారణం మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు ఈ నాలుగు అవస్థలు ఒకదానికి ఒకటి సంబంధపడి వుంటాయన్నమాట.

కాబట్టే, మనం నిద్రావస్థలో మనం మన ఎఱుకను మనం పూర్తిగా కోల్పోతున్నాము. మరణములో కూడా ‘నేను’ అనే ఎఱుకని కోల్పోతున్నాము.

ఎవరైతే, ఈ నాలుగు అవస్థలలో ‘నేను’ అనే ఎఱుకను నిలబెట్టుకున్నారో, వారు ఆత్మనిష్ఠులు అనేటటువంటి నిర్ణయాన్ని సూచన ప్రాయంగా చెప్తున్నారు.

చాలామంది తామసికమైన అజ్ఞానభూయిష్టమైనటువంటి నిద్ర పోయి, ఆహా! చాలా బాగా నిద్రపట్టిందండీ, ఒళ్ళు మరచిపోయి, ఒడలు మరచిపోయి నిద్రించాను అని ఆనందిస్తూ వుంటారు. ఇదో రకమైన ఆనందము. ఇది తామసిక గరిష్ఠమైనటువంటి నిద్ర. కానీ… ఇది శాంత చిత్తమైన నిద్ర కాదన్నమాట.

ఎవరైతే తన ప్రజ్ఞను తాను గుర్తిస్తూ, తన ఎఱుకను తాను గుర్తిస్తూ, స్వస్థితిని గుర్తిస్తూ, ‘స్వీయ నేను’ ని గుర్తిస్తూ, ‘సెల్ఫ్‌ రియలైజ్‌డ్‌ స్టేటస్‌’ [self realized status] లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో, వాళ్ళు శాంత చిత్తులై నిద్రిస్తారని అర్థం.

ఎప్పుడైతే ఆ శాంత చిత్తంతో నిద్రించాడో, అతనిలో ప్రజ్ఞ మేల్కొంటుంది. మనమందరం కూడా రోజువారీ నిద్రని ఇలా శాంత చిత్తంతో ఆచరించడం నేర్చుకోవాలి.

నీలో ప్రజ్ఞ మేల్కొన్నవాడవై, స్వప్రకాశ స్థితిలో వుండి, నిద్రలో మనం విశ్రాంతి తీసుకోవడం అభ్యాసం చెయ్యాలి. ఆ రకమైన మెలకువను కలిగి వున్నటువంటి నిద్రగా మనం నిద్రను స్వీకరించాలి. ఆ రకంగా మీరు తురీయంలో ప్రవేశిస్తారన్నమాట!

అటువంటి నిర్వాణానుభవం ద్వారా తాను తురీయస్థితిలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి శాంత చిత్తుడై నిద్రించడం అన్నటువంటి దాంట్లో, సూచన ప్రాయంగా నిర్వాణానుభవ స్థితిని సూచిస్తున్నాడు.

ఎప్పుడైతే ఒకసారి నీకు నిర్వాణ సుఖం లభించిందో, నువ్వు వాటిని మెలకువలోనూ, స్వప్నంలోనూ పోగొట్టుకోవడానికి ఇష్టపడవు ఇక. ఎలాగో చెప్పనా?

ఎవరైనా తమ తలకాయిని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎవరైనా సిద్ధపడుతారా? ఎవ్వరూ సిద్ధపడరు. ఎందుకని? తల లేకపోతే జీవితం లేదు కాబట్టి. అంత ముఖ్యమైనటువంటిది. అట్లాగే, నీ జీవితానుభవాల మొత్తం మీద, అత్యంత విలువైన అనుభూతి ఏదైన ఒకటి ఉందంటే అది నిర్వాణం.

ఒక్కసారి నిర్వాణ సుఖాన్ని అనుభూతి పొందినటువంటివాడు మరలా ఎట్టి కష్ట పరంపర వచ్చినప్పటికీ కూడా, ఎట్టి సుఖదుఃఖ పరంపర ఏర్పడినప్పటికీ కూడా, ఎట్టి ద్వంద్వానుభూతులు ఏర్పడుతున్నప్పటికీ కూడా, ఈ నిర్వాణ సుఖాన్ని పోగొట్టుకోరు.

జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో ప్రయత్న పూర్వకముగా నిర్వాణ సుఖాన్ని నిలబెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అన్ని సాధనలలో కెల్లా ముఖ్య సాధనమిదే!

ఈ శాంత చిత్తం ఎప్పుడైతే వచ్చేస్తుందో, నీలో నిర్వాణ సుఖం ఏర్పడుతుంది. అట్టి నిర్వాణ సుఖమే, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి పునాది. ఆధారభూతమైనటువంటి పునాది స్థితి అన్నమాట!
🌹 🌹 🌹 🌹 🌹

 
20.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 7 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
కామమునకు అధిపతి మన్మథుడు. ఈ మన్మథుని చేతిలో ఐదు బాణములు వుంటాయి. పంచపుష్పబాణుడు అంటారు వీటినే. పంచచామరములు.
 
ఆ పంచపుష్పబాణుడు ఏం చేస్తాడంటే, ఆ పుష్పబాణాలను ప్రయోగిస్తాడు. అవి కామప్రేరణ కలుగుతుంది. కోర్కె కలుగుతుందన్నమాట! ఆ కోర్కె ప్రభావం చేత, గుణ ధర్మాలు కలుగుతాయి.
 
గుణ ధర్మాల చేత విషయవాసనలు ప్రకోపిస్తాయి, ఆ ప్రలోభం చేత సుఖదుఃఖ ప్రలోభితులు కలుగుతుంది. ఆ సుఖదుఃఖ స్మృతుల ప్రభావం చేత, వాసనాబలం ప్రేరితమై తత్ రీతిగా మానవుడు జీవిస్తూ వుంటాడు.
 
ఇది జీవభావంలో వున్నటువంటి ప్రతిబంధకం. ఈ ప్రతిబంధకాన్ని పోగొట్టాలి అంటే, అనురాగం అనేటటువంటి స్థితినుంచీ ప్రేమ అనేటటువంటి స్థితికి మారాలి.
 
            ఈశ్వరానుగ్రహం లేకుండా ఏ మానవుడు ఈ ప్రేమ అన్న స్థితిని తెలుసుకోలేడు. ఎవరికైతే ఈ నిర్వాణానుభవం లేదో, వారికి ప్రేమ మృగతృష్ణ వంటిది. అంటే అర్థం ఏమిటి?
 
ఎండమావిలో నీరు ఎంత సత్యమో, జీవభావంలో ప్రేమ అంత సత్యము. ఆత్మభావనలో, నిర్వాణ సుఖంలో, నిర్వాణానందంలో ఏ స్థితి అయితే కదలక, మెదలక స్థిరంగా, సమంగా ద్వంద్వ ప్రవృత్తులకు లోబడకుండా వుంటుందో, దాని పేరే ‘ప్రేమ’. ఈ ‘ప్రేమ’ చాలా విలువైనది. ఈ ప్రేమ చాలా రకాల విశాల భావనలతో, విస్తృత అర్థంతో ప్రయోగించబడుతోంది ఈ తత్త్వజ్ఞానంలో. ఈ ‘ప్రేమ’ అనేటటువంటి లక్షణమే లేకుండా నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరగలేవు.
 
ఈ సౌర కుటంబం విశ్వంలో… తన స్థానంలో తాను నిలబడలేదు. విశ్వమంతా వ్యాపకమై దాని దాని స్థానములలో, వాటి వాటి పనులను నిర్వహించే కూడా ఈ ప్రేమ వల్లనే!! కాబట్టి ఈ ప్రేమ విశ్వజనీనమైనది, విశ్వవ్యాపకమైనది.
 
         వ్యాపక ధర్మంతో కూడినటువంటి ‘ప్రేమ’ అనేటువంటి లక్షణాన్ని జీవభావంలోకి వచ్చేటప్పటికి ‘నేనొక వస్తువును ప్రేమించాను’ అనే అభిమానయుతమైనటవంటి అహంకార మమకార మిశ్రితంగా మానవుడు వినియోగించుకుంటున్నాడు. తత్‌ ప్రభావం చేత అది ప్రతిబంధకమై, అనురాగమై మమకారాన్ని బలవత్తరంగా ప్రేరేపిస్తుంది.
 
తత్‌ ప్రభావం చేత ఆ వస్తువు కనబడకపోయినా, ఆ మనిషి కనబడకపోయినా, లేదా తత్‌ స్మృతి ప్రభావం చేత అయినా సరే, నీవు దుఃఖాన్ని పొందుతావు. ఈ రకంగా ప్రతిబంధకమై కూర్చొంటుంది అనురాగము. కాబట్టి మానవులందరూ తప్పక ప్రయత్నించి ఈ అనురాగ బంధ విముక్తులవ్వాలి.
 
తప్పనిసరిగా ప్రేమ భావంతో మానవులందరూ సమత్వభావంతో వ్యవహరించాలి. వైరం లేకుండా వుండాలి, ద్వేషం లేకుండా వుండాలి. రాగద్వేషాలు అనే ద్వంద్వ ప్రకృతి నుంచీ విముక్తులవ్వాలి. ఈ ప్రేమ రాగద్వేషములకు అతీతమై వుంటుంది.
 
సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
 
21.Jul.2020
 

———————————— x ————————————


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 8 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
నచికేతుడు మూడవ వరముగా ‘ఆత్మతత్వము’ను గురించి అడుగగా, యముడు నచికేతునకుగల యోగ్యతను తెలుసుకొనుటకున్నూ, వాని దృఢత్వమును ఎఱుగ గోరియూ, యముడు ఈ విధముగా అనుచున్నాడు
నూరు సంవత్సరములు జీవించునట్టి, పుత్ర పౌత్రులను అడుగుము.
 
వారితో కూడా సుఖముగా జీవించుటకు వీలగునట్లు ఆలమందలను, ఏనుగులను, గుర్రములను, బంగారము మొదలగువానిని కోరుకొనుము. విశాలమైన ఈ భూభాగమును లేక మాండలిక రాజ్యమును కోరుకొనుము.
 
ఈ సంపదలన్ని ఉన్నప్పటికిని నేను అల్పాయిష్కడనైతినే అని, వీని వలన కలుగు ఫలమేమని నీవు తలంచినచో, ఈ సంపదల వలన కలుగు సుఖమును అనుభవించుటకు, నీవు ఎంతకాలము జీవింప తలంతువో, అంతకాలము సుఖముగా జీవించి యుండు నటుల, వరమును కోరుకొనుము. విస్తారమైన ధనమును, దివ్యములు మానుషములు అగు, ఏ యే కామములు కలవో, వానిని అన్నింటిని కోరుకొనుము.
 
ఈ లోకమున మానవులకందని కోరికలు ఎన్నియో కలవు. ఆ కోరికలన్నింటిని నీవు స్వేచ్ఛగా అడుగుము. రథములతోను, వాద్యములతోను కూడినట్టి స్త్రీలను, నీకు ఒసంగు చున్నాను. ఈ స్త్రీలచే అన్ని విధములైన సేవలు చేయించుకొనుము. అన్ని సుఖములను అనుభవింపుము. అంతేకానీ, మరణానంతర విషయము నన్ను అడుగకుము అని యముడు చెప్పెను.
 
         ఇక్కడ మనందరి విశేషాలను చెబుతున్నారన్నమాట. మనమందరం కామ్యక కర్మలుగా పూజలు చేసేటప్పడు రోజువారి నిత్యజీవితంలో కూడా, నిత్యపూజలు చేసేటప్పుడు, అనేక రకములైనటువంటి కోర్కెలను మనం అడుగుతూ ఉంటాము.
 
ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాది సిద్ధ్యర్థం, ఇలా ‘ధం’ అని చెప్పేటటువంటి ఎన్ని మంత్రాలు శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో, విధుల రూపంలో ఏవైతే మనం రోజువారీ అడుగుతున్నామో, అవన్నీ కూడా మనకి ఇప్పుడిక్కడ బోధిస్తున్నారన్నమాట.
 
మానవులందరూ సాధారణంగా అడిగేవి ఏమిటి? అంటే, నా మనవళ్ళు, ముని మనవళ్ళని చూచేంత వరకూ నేను బ్రతికి ఉండుట. మునిమనుమడికి మునిమనుమడు పుట్టేవరకూ అనుగ్రహించా పో! అన్నాడాయన.
 
పూజలు జరిపేటప్పుడు మనం గుడికెళ్ళి పూజించారనుకోండి, ఏం చెబుతారు? ధన వస్తు వాహన కనక పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అంటాడాయన, ఒకేసారి అన్నీ కలిపి కోరేశాడన్నమాట.
 
ఒక్కోసారి ఒక్కొక్కటి అడిగితే కష్టమని. ధన, వస్తు, వాహన, కనక మళ్ళా వస్తువులలో, వాహనాలలో కనకం ఉంటుందో లేదో అని, మళ్ళా కనకం వేరుగా ధన, వస్తు, వాహన, కనక ఇంకేమిటి? రధ, గజ, తురగ ‘రధ గజ తురగ’ – అంటే, ఏనుగులు, గుర్రాలు, రధాలు. ఇంకేం కావాలట? ఇవన్నీ ఉన్నాయండీ మరి సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కావలసినటువంటి కుటుంబ సౌఖ్యం అమరేటటువంటివన్నీ కూడా కావాలా? వద్దా? అవి కూడా ఇచ్చారు.
 
ఇవన్నీ కలిపి ఏక మొత్తంగా ఒక్కొక్కటి విడివిడిగా అడగాల్సిన పనిలేకుండా, నీకు మొత్తం ఒకసారే ఇచ్చేశాను అనుకో, అవన్నీ తీసేసుకోవయ్యా, ఈ ఆత్మతత్వాన్ని విడిచిపెట్టు అన్నాడు.
 
ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని బోధిస్తున్నారు. ఏమిటంటే, మానవులెవరైతే, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని, తీవ్రమైనటువంటి తపన చెందుతూ ఉంటారో, తీవ్రమోక్షేచ్ఛను పొందాలనే ప్రయత్నం చేస్తారో, తీవ్ర వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ప్రకృతి వీటన్నింటినీ అనుగ్రహించడం మొదలుపెడుతుంది. అనుకున్నదే తడవుగా అయిపోవడంతో మొదలౌతుంది. ఇప్పుడు ఏదన్నా వర్షం ఆగిపోతే బాగుండు, అనుకుంటాడు. వర్షం ఆగిపోతుంది.
 
ఇప్పుడు ఏదన్నా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అనుకుంటాడు. ఎవరో వస్తారు, టక్కుమని ఎక్కమంటారు, ఎక్కించుకుని తీసుకువెళ్ళి చేరవలసిన గమ్యస్థానంలోకి దించేస్తారు.
 
ఇప్పుడు నన్ను ఎవరైనా కీర్తిస్తే బాగుండు అనుకుంటాడు, వెంటనే ఆ సమయం సందర్భం ఒనగూడి, ఆయన్ని అద్భుతంగా ఇంద్రుడని, చంద్రుడని, సూర్యుడని వాళ్ళకంటే గొప్పవాడని, ఇంకా అంతకంటే రాజరాజని, చక్రవర్తి అని ఈ రకంగా పొగిడేస్తారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు.
 
వెంటనే మండలాధిపత్యమో, లేకపోతే సామ్రాజ్యాధిపత్యమో ఇంకా మరీ అయితే చతుర్దశ భువన భాండములందు ఆయన కోరినటువంటి లోకానికి అధిపతిగానో, వెంటనే చేయబడుతాడు.
 
ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ, ప్రేరణ నీలో కలుగుతుంది. కలగగానే నీవు సరే అంటే చాలు అంతే, ఇంకేమి ఎక్కువ అననవసరం లేదు. ఓకే అంటే చాలు, రెండు అక్షరాల పదం, సరే అంటే చాలు. ఔను అంటే చాలు. తల పంకించినా చాలట, దానికి ఎక్కువ అవసరం లేదు, ఔను అని తల ఊపినా చాలట. అంతే, అది అయిపోతావు అంతే వెంటనే.
 
ఆ రకంగా నీవు ఈ రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి, భోగ భాగ్య సంపదలతో కూడిన సమస్తము నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందేలోగానే వస్తుంది. వాటన్నింటి యందు నీవు విరక్తుడవై, పూర్ణవైరాగ్యమును పూని ఉన్నవాడవైతేనే నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు.
🌹 🌹 🌹 🌹 🌹
 
23.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 9 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
మా అమ్మాయికి జ్వరం వచ్చింది. మా అమ్మాయికి ఏదో అయ్యింది. లేదూ మా అబ్బాయికి ఏదో అయ్యింది. లేదూ మా ఆయనకి ఏదో అయ్యింది, లేదూ మా ఇంకొకరికి ఏదో అయ్యింది, మా సంబంధీకులకు ఏదో అయ్యింది, ఏ సంబంధమూ లేనివారికి ఏదో అయ్యింది, అనేటటువంటి సంకల్పం నీలో ప్రవేశించింది.
 
ప్రవేశించగానే ఏమౌతుందంటే, తత్‌ కారణ రీత్యా, ఆ బలం రీత్యా, ఆ తపస్సు రీత్యా, ఆ జ్ఞానబలం రీత్యా, ఆ వైరాగ్య బలం రీత్యా, ఆ సమర్థనీయమైనటు వంటి శక్తి ద్వారా. ఇదంతా శక్తితో కూడుకున్నటువంటి వ్యవహారమన్నమాట. పదార్థగతంగా ఇవన్నీ సాధ్యం కావు. కానీ, శక్తిగతంగా ఇవన్నీ సాధ్యమే. తపఃశక్తి వలన ఇవన్నీ సాధ్యమే. కర్మఉపాసన వలన ఇవన్నీ సాధ్యమే.
 
ఆయా ఉపాసన బలముల యొక్క సమర్థత వలన నీవు అలా అవుతావు. తత్‌ ప్రభావ రీత్యా, ప్రేరేపించబడి, ఆ సంకల్పమునకు నీవు లోబడి, నీవు ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే ప్రవర్తించావో, తత్‌ ప్రభావ రీత్యా నీకా మాలిన్యం అంటుకోక తప్పదు.
 
మాలిన్యం అంటుకోగానే శుద్ధ చైతన్యంగా ఉండవలసిన నీవు మలిన చైతన్యమై, మిశ్రమ రూపమైనటువంటి కర్మయందు ప్రవేశించి, నీవు జీవుడవైపోతావు.
 
 ఆత్మసాక్షాత్కార జ్ఞానమే నాకు ప్రధానమైనటువంటి లక్ష్యము అనేటటువంటిది మరపుకు వస్తుంది. “మరుపే జీవుడు. ఎఱుకయే ఆత్మ” – ఈ సత్యమును తెలుసుకోవాలి.
 
      రోజూ కాబట్టి, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనుకున్నవారు, కామమును లవలేశమైననూ మిగుల్చుకోకుండా పోగొట్టుకోవాలి.
 
జనన మరణముల మధ్యలో దేనిని నేను ఆశ్రయించను, అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి, అట్టి వాగ్దాన భంగం కలుగకుండా నీవు నిలబెట్టుకోవాలి. అనేక రకములైనటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్షగా వస్తూ ఉంటాయి.
 
వచ్చినప్పుడు ఆ పరీక్షలో వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ఠ చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత, నీవు ఎదురించాలి. అంతేగానీ, ఆయా చిన్న చిన్న సమస్యలను గురించి, నీవు ప్రభావితం కాకూడదు.
 
       పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడినది అంతా కామమని పేరు. ఇది పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా? లేదా? అన్న ప్రశ్న వేసుకున్నావనుకో అది కామము అవునో కాదో అర్థమైపోతుంది. వెంటనే ఆ కామమును నిర్జించాలి. వైరాగ్యముతో కామము యొక్క మూలమును నిర్జించాలి.
 
అలా ఎప్పుడైతే నిర్జించిన వాడివి అవుతావో, నీవు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడవు అవుతావు. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్రవైరాగ్యము చాలా అవసరము.
 
ఈ రకంగా ఈ యొక్క ప్రేరణకి నచికేతుడు లొంగుతాడా? లేదా? అనేటటువంటి ప్రాధమ్యాలని సరిగ్గా ఆయన ముందు ఉంచి, ఆయా కామము యొక్క ప్రేరణ ఆయనలో కలుగుతోందా? లేదా? అనేటటువంటి సాధారణంగా ఎలా ఉంటుందంటే, పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకూ కూడా నీలో ఆ కామము యొక్క ప్రభావము ఉండదు. సాధారణంగా అందరూ ఇవేవీ నాకు అక్కర్లేదండి అనే అంటూ ఉంటారు.
 
కానీ, సమయ సందర్భోచితమై అవి నీ ముందు ప్రత్యక్షమై, అనుభోక్త మయ్యేటటుంవంటి స్థితి ఏర్పడినప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యం, నీలో ఉన్నటువంటి తీవ్ర మోక్షేచ్ఛ, అప్పుడు కదా వాటి యొక్క నిరూపణము అయ్యేది?
 
        కాబట్టి, మానవుడు ఆ జీవన పర్యంతము వీటియందు మెలకువ వహించి ఉండాలి. ‘స్త్రీ బాలాంధ జడోప మాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః’ అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం.
 
కాబట్టి, ఇవన్నీ కూడా ఏదో ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడుతుంది. అంతా బానే ఉంటుంది. ఒక్క రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది. లేదా ఒకటి పొందడం జరుగుతుంది.
 
ఒకటి పొందకపోవడం వలన కానీ, ఒకటి పొందడం వలన కానీ, నీలో ఏమైనా మార్పు గనుక సంభవించినట్లయితే తత్‌ ప్రభావం చేత, నీవు ఆత్మసాక్షాత్కార ఆత్మానుభూతి అనేటటువంటి స్థితి నుంచీ జీవుడుగా పతనం అవుతావు. అట్లా పతనం అవ్వకుండా స్థిరముగా ఉండేటటువంటి పద్ధతిని నీవు ఆశ్రయించాలి.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
24.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 10 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. 🌻
 
ఈ రెండింటి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి “నాన్యః బంధాయ విద్యతే వాసుదేవాయ ధీమహి”. అటువంటి వాసుదేవుణ్ణి ఆశ్రయించాలి అంటే అన్యమైనటువంటి మార్గం లేదు.
 
 ఏమిటీ? ఒకటి ఇంద్రియజయము. రెండు భక్తి. ఈ రెండింటి ద్వారా జ్ఞానసిద్ధికి అధికారిత్వాన్ని పొందాలి. “భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు లేరు” అని కూడా నిర్ణయంగా చెప్తున్నాడు.
 
అంటే అర్ధ ఏమిటటా? “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే?” అనేటటువంటి పద్యాన్ని గనుక, మనం భాగవత పద్యాన్ని గనుక గుర్తిస్తే – “కారే రాజులు? రాజ్యముల్ గలుగవే?” – ఎంతోమంది రాజులు ఈ భూమిని పరిపాలించారు. ఎంతోమంది చక్రవర్తులు పరిపాలించారు. ఎంతోమంది మహనీయులైనటువంటి వాళ్ళు, ఎంతోమంది చరిత్ర కలిగినటువంటి వాళ్ళు,
 
యశఃకాములైనటువంటి వాళ్ళు ఎంతోమంది పృధ్విలో వచ్చారూ, పోయారు. కానీ వారేమైనా సిరి మూటకట్టుకుపోయారా? వారేమైనా తృప్తిని పొందారా? అంటే వారెటువంటి నిత్యతృప్తిని పొందలేదు. ఒక్క జ్ఞానం వల్ల మాత్రమే, అది కూడా ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే నిత్య సంతృప్తతని పొందగలుగుతాడు మానవుడు.
 
         అటువంటి ఆత్మజ్ఞాన సముపార్జనకై జీవితంలో సమయాన్ని, శ్రమని, శ్రద్ధని, ఆసక్తిని, తహని, నిశ్చయాన్ని, లక్ష్యాన్ని మనం సాధించాలి.
 
అలాంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి అంటే తప్పక భోగమార్గమై వున్నటువంటి జగత్ వ్యాపార విషయములందు అనురక్తి కలిగి వుండరాదు. విరక్తి వుండటం అవసరం కాని అనురక్తి లేకుండా చూసుకోవడం ముఖ్య అవసరం. ఈ రెండింటి మధ్య బేధాన్ని కొద్దిగా మనం గుర్తించాలనమాట.
 
మానవుడు ప్రతిరోజూ తన శరీర అవసర నిమిత్తమై భోజనం చెయ్యాలా? వద్దా? చెయ్యాలి. అనురక్తి లేక చెయ్యాలి. వైరాగ్య భావంతో చెయ్యాలి. ఈశ్వర ప్రసాద భావంతో చెయ్యాలి. అట్లాంటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలా గనుక ఆచరించకపోయినట్లయితే అది సాధ్యపడదు.
 
ఇట్లా గమనించుకోవాలన్నమాట. ప్రతిదీ ఈశ్వర ప్రసాదంగా చూసేటటువంటి ఉత్తమ లక్షణాన్ని మానవులందరు కూడానూ చక్కగా సంపాదించాలి. అలా సంపాదించకపోయినట్లయితే నువ్వు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా అది అసాధ్యం.
 
అందుకని అనురక్తి దేంట్లో వుంది, ప్రియాప్రియాలు దేంట్లో వున్నాయి అనేటటువంటి జాబితా సాధకులందరూ తప్పక తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని వాటియందున్నటువంటి అనురక్తిని పోగొట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
26.Jul.2020
 

———————————— x ————————————


 
🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 11 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. – 2 🌻
 
అయితే ప్రణాళికాబద్ధమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం వుండాలా వద్దా అంటే తప్పక వుండాలి. యమ నియమాలు లేనటువంటి జీవితం ఎప్పటికీ కూడా సాధ్యపడదు.
 
గృహిణి తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవలచినటువంటి అవసరం వుందా లేదా? చాలా అవసరం వుంది. ఆ పనిని అనురక్తి లేకుండా చేయవలసిన అవసరం వుంది. వైరాగ్య భావంతో చేస్తే ప్రతిదీ సమర్ధవంతంగా చేయగలిగేటటువంటి శక్తి లభిస్తుంది.
 
అంతేగాని చిందరవందరగా ఇల్లంతా అన్ని వస్తువులూ పడవేసుకుని వుండి, నేను జ్ఞానంలో వున్నానండీ, నేను వైరాగ్యంలో వున్నానండీ, నాకేం పట్టదండీ అనేటటువంటి విధానం సరియైనటువంటి జీవితం కాదనమాట.
 
భౌతికంలో సమర్ధవంతంగా సామాన్యమైనటువంటి జీవితాన్ని, విశేషణములు లేనటువంటి జీవితాన్ని, అహం ప్రతిపాదించేటటువంటి- అహం బలపడేటటువంటి జీవితాన్ని జీవించకుండా, వైరాగ్య భావంతో జీవించవలసినటువంటి అవసరం చాలా వున్నదనమాట సాధకులందరికీ కూడా. ఈ వైరాగ్య లక్షణాన్ని మోక్షప్రాప్తి వరకూ నిలబెట్టుకోవాలి. ఈ తరువాత అది సహజమైపోతుంది.
 
ఇది చాలా ముఖ్యం. జ్ఞానం లభించాలి అంటే తప్పక వైరాగ్య భావన బలవత్తరమైనటువంటిదిగా వుండాలి. అదేకాక, భక్తి విశ్వాసాలు కూడా వైరాగ్యంతో పాటు చాలా ముఖ్యమైనటువంటివి.
 
ఈ మూడూ కలిసి జ్ఞానానికి అధికారిత్వాన్ని ప్రసాదిస్తాయి. వినయము, విధేయత వస్తాయనమాట భక్తి విశ్వాసాల వలన. అలా ప్రతి ఒక్క మానవుడు తనని తాను ఈ రకమైనటువంటి భోగలాలసత నుంచి విరమింపచేసుకునేటటువంటి పద్ధతిగా జీవనాన్ని సాగించాలి.
 
సకల జీవరాశి కూడా స్త్రీపురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ వున్నాయి కదా. ఏ కొత్త సుఖమున్నది ఇందులో? అనేక జన్మలయందు తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? కొత్త సుఖమేమున్నది? అనేటటువంటి విజ్ఞానదృష్టి కలిగినటువంటివాడికి స్త్రీపురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశమున్నదా? రమించే అవకాశం వున్నదా అంటే లేదు అంటున్నాడు.
 
కారణమేమిటట? అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని, ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీపురుషులు ఇరువురూ కూడా అనుభవిస్తూ వున్నారు. దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమున్నదీ? సర్వ జీవులు వాటివాటి సంసార చక్రబంధమునందు నలిగి పోవుచునే వున్నవి కదా! జననమరణ కారణమగుచున్నది కదా.
 
 కాబట్టి అట్టి అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు, ఓ పదివేలేళ్ళు, ఓ లక్షేళ్ళు, ఓ కోటి సంత్సరాలు, కల్పాంతము వరకూ జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అజ్ఞానం కదా. అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు.
 
 ఇంకేమడుగుతున్నారూ? అసలు ప్రధానమైన సంశయం ఏమిటీ అంటే వివేకవంతమైనటువంటి, బుద్ధి సంఘతమైనటువంటి మానవులకు విచారణా జ్ఞానము వున్నది కదా. అట్టి విచారణా జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే – అసలు మరణానతరం జీవితం వుందా లేదా?
 
కాబట్టి అటువంటి జీవితాన్ని గురించి మనకి చెప్పగలిగేటటువంటి సమర్ధవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకి మాత్రమే వున్నదని, ఇటువంటి సంశయం దేవతలకి కూడా వున్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తీర్చుకోలేకపోతున్నారని, కాబట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే వుందో, ఆ జ్ఞానం ఏదైతే వుందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు.
 
అంటే ఒకసారి ఈ ఆత్మవిచారణ గనక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకు సంబంధించినటువంటి మరే విషయములకూ ప్రాధాన్యత ఇవ్వజాలరు.
 
కారణమేమిటీ అంటే అన్నిటికంటే ఉత్తమమైన వివేకాన్ని, ఉత్తమమైనటువంటి విషయజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకుని, నిర్ణయించి, సాధన ద్వారా సిద్ధింపజేసుకుని ప్రయత్నించి అట్టి బ్రహ్మానందపూర్వకమైనటువంటి స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా నీ ప్రయాణం సాగుతూ వున్నప్పుడు, నీవు ఇతరములైనటువంటి, నశ్వరములైనటువంటి, హీనములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి, నిరసించదగినటువంటి భోగభాగ్యములయందు దృష్టి కలుగదు అనేటటువంటి స్పష్టతని అందిస్తూ వున్నారు.
 
నేను ఇంక ఏ వరమునూ కోరను, ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటు వంటి బోధ గురించి తప్ప. కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని నిర్ణయముగా అడుగుతున్నాడు నచికేతుడు.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
27.Jul.2020
 

———————————— x ————————————


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 12 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. – 3 🌻
 
సకల జీవరాశి కూడా స్త్రీపురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ వున్నాయి కదా.
 
ఏ కొత్త సుఖమున్నది ఇందులో? అనేక జన్మలయందు తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? కొత్త సుఖమేమున్నది? అనేటటువంటి విజ్ఞానదృష్టి కలిగినటువంటివాడికి స్త్రీపురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశమున్నదా? రమించే అవకాశం వున్నదా అంటే లేదు అంటున్నాడు. కారణమేమిటట? అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని, ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీపురుషులు ఇరువురూ కూడా అనుభవిస్తూ వున్నారు.
 
దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమున్నదీ? సర్వ జీవులు వాటివాటి సంసార చక్రబంధమునందు నలిగి పోవుచునే వున్నవి కదా! జననమరణ కారణమగుచున్నది కదా.
 
 కాబట్టి అట్టి అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు, ఓ పదివేలేళ్ళు, ఓ లక్షేళ్ళు, ఓ కోటి సంత్సరాలు, కల్పాంతము వరకూ జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అజ్ఞానం కదా. అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు.
 
 ఇంకేమడుగుతున్నారూ? అసలు ప్రధానమైన సంశయం ఏమిటీ అంటే వివేకవంతమైనటువంటి, బుద్ధి సంఘతమైనటువంటి మానవులకు విచారణా జ్ఞానము వున్నది కదా.
 
అట్టి విచారణా జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే – అసలు మరణానతరం జీవితం వుందా లేదా? కాబట్టి అటువంటి జీవితాన్ని గురించి మనకి చెప్పగలిగేటటువంటి సమర్ధవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకి మాత్రమే వున్నదని, ఇటువంటి సంశయం దేవతలకి కూడా వున్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తీర్చుకోలేకపోతున్నారని, కాబట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే వుందో, ఆ జ్ఞానం ఏదైతే వుందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు. అంటే ఒకసారి ఈ ఆత్మవిచారణ గనక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకు సంబంధించినటువంటి మరే విషయములకూ ప్రాధాన్యత ఇవ్వజాలరు.
 
కారణమేమిటీ అంటే అన్నిటికంటే ఉత్తమమైన వివేకాన్ని, ఉత్తమమైనటువంటి విషయజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకుని, నిర్ణయించి, సాధన ద్వారా సిద్ధింపజేసుకుని ప్రయత్నించి అట్టి బ్రహ్మానందపూర్వకమైనటువంటి స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా నీ ప్రయాణం సాగుతూ వున్నప్పుడు, నీవు ఇతరములైనటువంటి, నశ్వరములైనటువంటి, హీనములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి, నిరసించదగినటువంటి భోగభాగ్యములయందు దృష్టి కలుగదు అనేటటువంటి స్పష్టతని అందిస్తూ వున్నారు. నేను ఇంక ఏ వరమునూ కోరను, ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటువంటి బోధ గురించి తప్ప. కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని నిర్ణయముగా అడుగుతున్నాడు నచికేతుడు.
 
సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
 
28.Jul.2020
 

———————————— x ————————————


 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 13 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻.. జ్ఞానోపదేశము 🌻
 
ఇంతవరకు యముడు నచికేతునకు అనేక విధములగు సంపదలనిచ్చెదనని ప్రలోభపెట్టినను వానిని సరకుగొనక మరణాంతర విషయమునే దృఢముగా కోరుట చేత వాని యోగ్యతను గుర్తించి యమధర్మరాజు వానికి జ్ఞానోపదేశము చేయనారంభించుచున్నాడు:
 
చాలా ముఖ్యమైనటువంటి అధికారిత్వాన్ని ఇక్కడ నిరూపించారనమాట. ముందు ఆచార్యవర్యులెవరైనా సరే ప్రలోభాలకు గురి అవుతాడా లేదా, అహంకారానికి గురి అవుతాడా లేదా, అజ్ఞానానికి గురి అవుతాడా లేదా, ఎంతవరకు ఇతని స్థాయిలో అతనికి బోధించడానికి తగినటువంటి అధికారిత్వం వున్నది అనేటటువంటి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు.
 
అలా పరిశీలన చేసిన తరువాత మాత్రమే వారికి ఆత్మవిషయమును గురించినటువంటి బోధని పూర్తిచేయాలి. అంతేగానీ, వచ్చినవారందరికీ తగినవారందరికీ చెప్పాలా వద్దా అంటే వారి అధికారిత్వాన్ని అనుసరించి చెప్పాలి.
 
ఎవరికి ఏ స్థాయిలో వున్నటువంటి వివేకము, విచారణ వుంటయ్యో, వారివారి స్థాయికి బుద్ధిగత వికాసాన్ని బట్టి , వారి వివేకాన్ని అనుసరించి వారికి మనం బోధించాలే గానీ , కనబడ్డవారందరికీ “నువ్వు ఆత్మ స్వరూపుడివి! నువ్వు బ్రహ్మస్వరూపుడివి ! నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి! నువ్వు ఇక తెలుసుకొనవలసినది ఏమీ లేదు! చెయ్యవలసింది ఏమీలేదు! పొందవలసినది ఏమీలేదు!” అనేటటువంటి అంశాలను చెప్పామనుకోండీ, రెంటికీ చెడ్డ రేవడిగా అయ్యేటటువంటి అవకాశం వున్నది.
 
🌻. శ్రేయో మార్గము – ప్రేయో మార్గము స్వధర్మము-పరధర్మము 🌻
 
ఈ ప్రపంచములో మానవులు నడచుకొనుటకు రెండు మార్గములు కలవు. ఒకటి శ్రేయోమార్గము. రెండవది ప్రేయోమార్గము.
 
ఈ రెండును విభిన్న ప్రయోజనములు కలవియై మానవుని బంధించుచున్నవి. కాబట్టి జీవులందరి ముందు ప్రతిచోట, ప్రతి క్షణం, ప్రతి తలపులో కూదా రెండు రకములైనటువంటి అవకాశాలను ఈ ప్రకృతి కల్పిస్తుంది.
 
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
 
    అంటుంది భగవద్గీత. అంటే అర్ధం ఏమిటీ? శ్రేయము-ప్రేయము, స్వధర్మము-పరధర్మము. ఈ రెండు అంశాలు ఒకచోటే వుంటాయి. నీవు ఆచరణశీలమై చూసేటప్పుడు నా స్వధర్మమేది? అని చక్కగా విచారణ చేయాలి. పరధర్మమేది? అనేది విచారణ చెయ్యాలి.
 
ఎంతగా నీకు సుఖాన్ని ఇచ్చేది అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. ఎంత దగ్గరిదారి అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది.
 
ఎంత ధర్మసంకటమై తోస్తూ నిన్ను వెంటనే సుఖాన్ని పొందింపచేయడానికి సిద్ధంగా వున్నప్పటికీ నీవు దానిని – పరధర్మాన్ని – ఆచరించకూడదు. కారణమేమిటంటే శ్రేయము-ప్రేయము అనే విభజన స్పష్టముగా చెప్తున్నాడు జీవితంలో.
 
దేనిని ఆచరిస్తే అత్మానుభూతికి దగ్గరవుతావో, ఏ తీరుగా జీవిస్తే ఆత్మానుభూతిలో నిలకడ చెందుతావో, ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీవు స్వయముగా ఆత్మానుభూతియందు నిలకడ కలిగివుంటావో అటువంటిది శ్రేయము. శ్రేయస్సును కలిగించేది.
 
ఎన్ని జన్మలకైననూ నిన్ను విడువనటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అసలు జన్మే లేకుండా చేసేటటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అటువంటి శ్రేయోమార్గమును నువ్వు ఆశ్రయించాలి.
 
సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
 
29.Jul.2020
 
———————————— x ————————————

 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 14 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. శ్రేయో మార్గము – ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము – 2 🌻
 
ప్రేయోమార్గమని మరొక మార్గముంది. అందులో ప్రధానమైన సమస్య ఏమిటంటే సుఖానికి దగ్గరిదారిగా కనబడుతుంది, కానీ శాశ్వతముగా దుఃఖాన్ని అందిస్తుంది. ఇంకేమిటట అందులో దోషం? జననమరణ చక్రంలో పడేట్లుగా చేస్తుంది. కర్మచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. కాలచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. ద్వంద్వానుభూతులయందు మరిగిపోయేట్లుగా చేస్తుంది. తనని తాను మరచిపోయేటట్లుగా చేస్తుంది.
 
స్వయం స్థితిని మరచిపోయేట్లుగా చేస్తుంది. హృదయస్థానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. స్వీయజ్ఞానాన్ని, స్వరూపజ్ఞానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. ఇన్ని దోషములు వున్నాయి కాబట్టి పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది.
 
   శ్రేయోమార్గంలో ఇవన్నీ వ్యతిరేకం. అంటే నీ హృదయస్థానంలో నువ్వు నిలబడి వుంటావు. నీ స్వరూప జ్ఞానంలో నువ్వు నిలబడి ఉంటావు.
 
స్వాత్మానుభూతి యందు నిలకడ కలిగి వుంటావు. స్వాత్మనిష్ఠుడవై వుంటావు. సర్వవ్యాపక లక్షణాన్ని కలిగివుంటావు. పరిమితమైనటువంటి అజ్ఞానము , అవిద్యకు దూరంగా వుంటావు. జననమరణ చక్రాలలో నుంచి బయటపడతావు. కర్మచక్రానికి అంటకుండా వుంటావు. ద్వంద్వానుభూతులకి విలక్షణుడవై వుంటావు.
 
కాబట్టి శ్రేయోమార్గము ఉత్తమమైనటువంటిది. కాబట్టి అట్టి శ్రేయోమార్గమునే మానవులందరూ కూడా ఆశ్రయించాలి. అదే మానవుని యొక్క స్వధర్మము.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
Date: 30/Jul/2020
 

———————————— x ————————————



🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 15 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. శ్రేయో మార్గము – ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము – 3 🌻
 
శుభము కల్గించుచు మోక్షమును కలుగజేయునది శ్రేయోమార్గమనబడును. లౌకిక సుఖములను కలిగించు స్త్రీ ధనాదులను అనుభవింపజేయునది ప్రేయోమార్గము.
 
విషయాదుల ననుభవించు సుఖముగానున్నట్లు తోచి చివరకు దుఃఖమును కలుగజేయునది ప్రేయోమార్గము. మొదట కష్టముగ నున్నట్లుండి చివరకు శాశ్వత సుఖమును కలుగజేయునది శ్రేయోమార్గము.
 
కనుక శ్రేయోమార్గము ననుసరించువారికి శాశ్వత సుఖము లభించును. ప్రేయోమార్గము ననుసరించువారు శాశ్వత సుఖమునకు దూరులై దుఃఖముల పాలగుదురు. కావున విజ్ఞులగువారు శ్రేయోమార్గమునే అనుసరించెదరు.
 
    ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలనే మరల పునరుద్ఘాటించారు. ఈ శ్రేయోమార్గములో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమధి అనే అష్టాంగ విధి ఇమిడ్చి వుంటుంది.
 
నాయనా! నువ్వు రోజులొ నాలుగు సంధ్యలలో తప్పక ఉపాసనా మార్గమును, తప్పక జపాన్ని, తప్పక తపస్సుని, తప్పక ధ్యానాన్ని, తప్పక నువ్వు ఆచరించాలి అనే నియమము విధి ఏర్పాటుచేయబడింది.
 
అదే ప్రేయోమార్గమనుకోండి హాయిగా ఎనిమిదింటిదాకా పడుకోవచ్చు అన్నారనుకోండి ఏమైందప్పుడు? ఈ రెండింటిలో దేనికి మనస్సు మొగ్గు చూపుతుంది?
 
తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి, ఐదుగంటలకల్లా సిద్ధమయ్యి, షోడశోపచారపూజ పూర్తిచేసుకుని సూర్యోదయాత్ పూర్వమే కర్మసాక్షి అయినటువంటి సూర్యుని ఆశ్రయించి, సాక్షిత్వ భావాన్ని అందుకోవడానికి ఆ సంధ్యాసమయాన్ని, ఆ ప్రదోషకాలాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, వారికి మహేశ్వరుని గణములందరూ కూడా సహాయము చేస్తారు. ఏకాదశరుద్రులు సహాయం చేస్తారు. ద్వాదశ ఆదిత్యులు సహాయంచేస్తారు. మరి అశ్వనీదేవతలు సహాయం చేస్తారు.
 
ఇంతమంది ఇంద్రియాధిష్ఠాన దేవతలందరూ కూడా ఆయా సంధ్యా సమయములందు ఎవరైతే పూజిస్తూ వుంటారో, దైవీభావనతో జీవిస్తూ వుంటారో, తపస్సుయందు నిమగ్నమై వుంటారో, ఆంతరిక సాధనలయందు నిమగ్నమై వుంటారో, అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధులై వుంటారో, అధికారిత్వాన్ని కలిగి వుంటారో, ఆ రకమైన వారందరినీ గమనిస్తూ వారియందు సద్భుద్ధిని ప్రేరేపించి, చిత్తశుద్ధిని కలిగించి స్వీయ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందించడానికి కావలసినటువంటి నైర్మాలిన్యాన్ని, నిర్మలత్వాన్ని నీకు అందిస్తారు. ఆ సంధ్యాకాలంలో అంత విశేషమున్నది.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
Date: 31/Jul/2020
 

———————————— x ————————————


 
Image may contain: 1 person, standing and shoes
🌹. కఠోపనిషత్‌ వివరణ  – చలాచలభోధ  – 16 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. శ్రేయో మార్గము – ప్రేయో మార్గములు  స్వధర్మము-పరధర్మము – 4 🌻
 
మరి అటువంటి సంధ్యాకాలమును మనం ఇవాళ సద్వినియోగ పరచుకుంటున్నామా అంటే ఈ ప్రేయోమార్గమును ఆశ్రయించడం ద్వారా ఆయా సంధ్యాకాలములందు ఒకసారి గమనిస్తే ఉదయం ఆరుగంటలకి అవకాశం వున్నంతవరకు నిద్రావస్థలో గడుపుతూవుంటారు.
 
మధ్యాహ్నం పన్నెండు గంటలకి అవకాశం వున్నంతవరకూ ధనార్జనలో గడుపుతూ వుంటారు. సాయంత్రం ఆరుగంటలకి విషయ సుఖాపేక్షలో అది తిందామా ఇది తాగుదామా అనే భావనతో గడుపుతూ వుంటాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలకి కామోపభోగములందు మునిగిపోయి వుంటాడు.
 
మరి ఇప్పుడు నాలుగు సంధ్యలలో జీవుడు ఈరకంగా తన ఆయుక్షీణం అయిపోతున్నటువంటి పద్ధతిని అయినటువంటి ప్రేయోమార్గమును ఆశ్రయించి, తత్ కాల సుఖమును అనుభవిస్తూ శాశ్వత దుఃఖములోపలికి, శాశ్వత దుఃఖకారణమైన జననమరణ చక్రంలో బంధింపబడేటటువంటి, కర్మచక్రంలో బంధింపబడేటటువంటి, ద్వంద్వానుభవములలో బంధింపబడేటటువంటి, విధానమును ఆశ్రయించడం వలన నిరంతరాయముగా చనిపోతున్నప్పటికీ, అంటే అర్ధం ఏమిటి? జీవుడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు.
 
ఎప్పుడో 100 సంవత్సరాలకి ఒకసారి చనిపోవడంలా.  కేవలం ప్రతిరోజూ గాఢనిద్రావస్థలో తనని తాను మర్చిపోవడం ద్వారా , తనను తాను ఎఱుక లేకుండా జీవించడం ద్వారా, తాను ఏ స్థితిలో వున్నాడో తెలియకుండా జీవించడం ద్వారా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ, గాఢ సుషుప్తియందు మరణిస్తూ మరల మేల్కొనేటప్పటికీ ఆ తెలివిని పొంది సజీవుడై మెలకువలో వ్యవహరిస్తున్నాడు.
 
 కాబట్టి జ్ఞానపద్ధతిగా వివేకము రీత్యా, విజ్ఞానము దృష్ట్యా గమనించినట్లయితే జీవుడు ప్రతిరోజూ చనిపోతున్నాడు. ప్రతిరోజూ మరణమునే పొందుతున్నాడు.
 
కాబట్టి అట్టి నిత్యప్రళయాన్ని పొందేటటువంటి ప్రేయోమార్గము దూరముగా పెట్టవలసినటువంటి జీవన విధానము. మానవులందరూ ఈ సత్యాన్ని తప్పక గ్రహించాలి.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
Date: 01/Aug/2020
 

———————————— x ————————————


 
Image may contain: 1 person, standing and shoes
🌹. కఠోపనిషత్‌ వివరణ  – చలాచలభోధ  – 17 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. శ్రేయో మార్గము – ప్రేయో మార్గములు  స్వధర్మము-పరధర్మము – 5 🌻
 
మానవులకు శ్రేయోమార్గము, ప్రేయోమార్గము అను ఈ రెండును అనుసరింపదగినవిగానే తోచును. ఈ రెంటిలో కల భేదమును సామాన్య మానవుడు గుర్తింపలేకున్నాడు.
 
 ధీరుడగు విద్వాంసుడు ప్రేయస్సుకంటే శ్రేయస్సే శ్రేష్టమైనదని తలంచి దానినే అనుసరించును. మందబుద్ధికలవాడు ధనమును, గృహారామ క్షేత్రాదులను సంపాదించి వానిని కాపాడుట యనెడి యోగక్షేమాత్మకమైన ప్రేయోమార్గమునే శ్రేష్టమైనదానినిగా తలంచి ఆ మార్గమునే అనుసరించును.
 
 సాధారణముగా మానవులలో అధికసంఖ్యాకులు ధనసంపాదనకు దాని రక్షణను గొప్పగా భావించి తమ జీవితములను గడుపుచున్నారు. వారు పరమును గురించి ఆలోచింపరు. వారు శాశ్వత సుఖమునిచ్చు శ్రేయోమార్గమునకు దూరముగా నుందురు.
 
   మన గురించి బాగా చెప్పాడు ఇక్కడ. చూడండి. కృతయుగకాలంలోనే జీవులందరూ కలియుగంలో ఎలా వుంటారనేది ఈ ఉపనిషత్తులో చక్కగా బోధించాడు.
 
ఇవ్వాళ మనందరి జీవితాలను గమనిస్తే వెనక్కి తిరిగి ఏం కనబడుతున్నదీ అంటే ఐహికమైనటువంటి, ఇహలోక సంబంధమైనటువంటి, పరిణామము చెందేటటువంటివి, వాటిని మాత్రమే శాశ్వతమని తలంచుచున్నాము. మనం ఎవరినైనా ఒక ప్రశ్న వేశామనుకోండి , నాయనా! నువ్వు నీ జీవితంలో ఎప్పటికి స్థిరపడతావు? అని అడుగుతాం. యవ్వనంలోకి ప్రవేశించిన వారందరినీ కూడా మనం అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పటికి స్థిరపడతావు?
 
 ఏమిటి స్థిరపడటమంటే అని తిరిగి ప్రశ్నిస్తే వివాహం చేసుకోవడం, రెండు ఇల్లు కట్టడం, మూడు పిల్లల్ని కనడం, నాలుగు వస్తు సముదాయాన్ని సమీకరించుకోవడం , అయిదు వారసులందరికీ , వచ్చే మూడు నాలుగు తరాలకు సరిపడా ధనార్జన చేయడం – ఇవన్నీ కలిపి మనం స్థిరపడటం క్రింద లెక్కేసుకోవడం మొదలుపెట్టాం. ఇదంతా ప్రేయోమార్గము.
 
మానవుడికి ఎన్ని చెప్పుల జతలు వుండాలి అసలు అని ఆలోచిస్తే ఒక జత సరిపోతుంది కదా. మహా అయితే రెండు జతలు సరిపోతాయి కదా. కాని ఇవ్వాళ ఎవరింట్లో చూసినా కూడా ఒక చెప్పుల షాపు వుంటుంది.
 
 ప్రయోజనమేముంది? ప్రయోజనం లేదు కదా. అలాగే ప్రతి వస్తు సముదాయమునకు ఒక పేద్ద షాపు maintain చేయడం అలవాటు చేసుకున్నాం.
 
తద్వారా ఏమైంది? ఆ యా వస్తువులను సరియైనటువంటి పద్ధతిలో వుంచలేము, క్రమమైన మార్గములో వాటిని శుద్ధి చేయలేము, శుద్ధి చేసిన వాటిని మరల తిరిగి వుంచలేము, వాటిని సరిగా సర్దుకోలేము, వాటిని సరిగా ఏర్పాటు చేసుకోలేము, ఆ వస్తువులని ఏర్పాటు చేసుకోలేక, ఆ వస్తువులను సరిగా సరిదిద్దుకోలేక సతమతమైపోతూ వాటిల్లో సుఖంగా వున్నానని భ్రమ చెందుతున్నాడనమాట.
 
సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
 
Date: 03/Aug/2020
 

———————————— x ————————————


 
Image may contain: 1 person, standing and shoes
🌹కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 18 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. శ్రేయో మార్గము – ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము – 6 🌻
 
ఈ రకంగా వస్తు సముదాయ భ్రాంతి ఎందువల్ల ఏర్పడింది అంటే ఆ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. ఈ వస్తువు సుఖాన్ని ఇస్తుంది. నా సుఖమునకు ఈ వస్తువు చాలా అవసరం అనేటటువంటి పరుగులాట బాగా బలంగా వుంది.
 
ఇంకేమున్నదీ అంటే ఆ వస్తు సముదాయాన్ని పొందటానికై ధన సముపార్జన, ధన సేకరణ, ధనమును దాచుకొనుట, ధనమును దోచుకొనుట. ఈ రకంగా క్రమాంతరమున గుణధర్మంలో పతనం చెందుతూ వస్తాడు.
 
ఎంతగా ధనము దాచుకోవాలని ప్రయత్నిస్తావో, అంతగా ధనమును దోచుకొనాలనేటటువంటి ప్రయత్నం కూడా దాని వెనకనే నీడవలె బలపడిపోతూ వుంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే!
 
“శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం”. అసలు ఈ శరీరమే ఒక వస్త్రము. ఇది ధర్మమార్గంలో నడవడం కోసం, జీవనాన్ని నడపడం కోసం, ధర్మమునకు లక్ష్యమైనటువంటి పరము ఏదైతే వుందో ఆ మోక్ష మార్గంలో ప్రవేశించడంకోసం ఈ శరీరమనేటటువంటి పనిముట్టుని వాడుకోవాలి.
ఐహికమైనటువంటి అంశాలయందు ఎవరికైతే విరమణ వుంటుందో ఎవరికైతే ఉపరతి వుంటుందో ఎవరికైతే తితీక్ష వుంటుందో ఎవరికైతే ఉదాసీనత వుంటుందో వారు మాత్రమే శ్రేయోమార్గమైనటువంటి ఆత్మజ్ఞాన విచారణలో పరమును సాధించేటటువంటి పద్ధతిగా తీవ్ర మోక్షాపేక్షతో తీవ్ర వైరాగ్యంతో అధికారిత్వాన్ని సాధిస్తారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి జీవన విధానం. జ్ఞానమార్గంలో ప్రవేశించాలి అంటే తప్పక ప్రతిఒక్కరూ కూడా తీవ్ర వైరాగ్యనిష్ఠని కలిగివుండాలి.
 
జ్ఞానమార్గంతో నాకు పనిలేదండి, నాకు కర్మమార్గంతోనే పని అన్నావనుకో ఇహపరములు రెండింటినీ ఒక్కసారే సాధించాలనేటటువంటి భ్రమ భ్రాంతిలో పడతావు.
 
దేనికి ఎప్పుడు అవకాశం వస్తుందో, దేనికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో, దేనిని ఎప్పుడు తగ్గించుకోవాలో, దేనిని ఎప్పుడు ఆశ్రయించాలో – సరియైన జ్ఞానం ఆ కర్మ మార్గంలో వుండదు. ప్రతిచోటా రెండు రెండు మార్గాలని కర్మమార్గం చూపిస్తుంది.
 
వాటిలో ప్రతిఒక్కరూ తప్పక ఆ ప్రేయోమార్గంలోనే పడిపోతాడు. ఎట్లా అయితే మిడత దీపాన్ని చూసి, శలభము దీపాన్ని చూసి ఆహారమని భ్రమశి, భ్రమశి ఏమి చేస్తుంది? దగ్గరికి వెళ్ళి ఆ మంటమీద పడుతుంది. పడగానే దాని రెక్కలు కాలిపోతాయి. కాలిపోగానే అక్కడే విరిగి పడిపోతుంది. తన జీవితాన్ని ముగిస్తుంది.
 
మానవుడు కూడా ఇటువంటి విషయసక్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, అట్టి విషయములే సుఖమునిస్తాయనే భ్రాంతికి గురవుతూ అట్టి శలభము వలే మిడతవంటి జీవితాన్ని మానవుడు జీవిస్తున్నాడు.
 

———————————— x ————————————


 
Image may contain: one or more people and people standing
🌹. కఠోపనిషత్‌ వివరణ  – చలాచలభోధ  – 19 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 7 🌻
 
ఈ ప్రేయోమార్గంలో జీవించే వారందరిలో కూడా వాళ్ళు దేహరూపానికి మానవులే గానీ బుద్ధియందు మిడతల వంటి వారు అనమాట. అట్టి మిడతల వంటి బుద్ధి కలిగినటువంటి వాడికి ఆత్మజ్ఞాన విచారణ అబ్బదు అని స్పష్టంగా చెప్తున్నాడు.
 
నచికేతా! ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని.
 
అధిక సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి వ్యామోహములో పడి దుఃఖములపా లగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.
 
ఎక్కువమంది ఆకర్షించబడేది అంటే నూటికి 90 శాతం మంది ఈ ప్రేయోమార్గంలోనే వుంటారు.
 
 ఏమిటయ్యా నీ జీవిత లక్ష్యము అనగా పుత్రులను పొందుట, పౌత్రులను పొందుట, ప్రియమైనవారిని పొందుట, బంధువులను కలిగివుండుట, అందరికీ ఇష్టులుగా జీవించుట, ఆ ఇష్టము అనేటటువంటి ప్రియాప్రియములతో ఏ రకమైన వస్తుసంచయము “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతా భృశంవాదినః “ అనేటటుంటి పద్ధతిగా ధన కనక వస్తు వాహన స్త్రీ ప్రియత్వము చేత ప్రేరణ పొందుతూ ప్రేరేపించబడుతూ ప్రేరేపిస్తూ పునః పునః పునః కర్మచక్రమునందు తగులుకొని, కర్మబంధము చేత బాధించబడుతూ, అజ్ఞానబంధము చేత బాధించబడుతూ “నేనెవరు?” అనేటటువంటి ప్రశ్నను ఆశ్రయించక కేవలము బాహ్యజీవనమునే జీవనముగా భావించి, అట్టి జీవనమును ఎప్పుడైతే నీవు పొందుతూ వున్నావో, ఆ జీవనము నీకు వృధా అయినటువంటి జీవనము.
 
అటువంటి వృధా అయినటువంటి ఈ మానవ జన్మ తిరిగి పునః నువ్వు మానవ జన్మనే పొందుతావా అంటే సృష్టిధర్మములో అలాంటి అవకాశాలు చాలా తక్కువ వున్నాయి.
 
కాబట్టి మానవుడవై పుట్టిన తరువాత మానవబుద్ధితో కాకుండా ఎనుబదినాలుగు లక్షల జీవరాశులకు సంబంధించినటువంటి బుద్ధిరూపమైనటువంటి జ్ఞానమును నీవు సముపార్జించి వున్నప్పటికీ ఆ యా జీవులయొక్క ప్రభావం నీలో బలంగా వుంది. కొంతమందికి ఊ అంటే కోపం వస్తుంది, ఆ అంటే కోపం వస్తుంది.
 
కస్సుబుస్సులాడుతూ వుంటారు. వాళ్లలో పాములకి సంబంధించినటువంటి వాసనాబలం మిగిలివుంటుందనమాట. కొంతమందిలో వ్యాఘ్రము వలే గాండ్రిస్తూ వుంటారు. పులులవలే గాండ్రిస్తూ వుంటారనమాట.
 
వాళ్ళలో ఆ రకమైన వాసనాబలం మిగిలి వుంటుంది. కొంతమందిలో ఏనుగువలే ఘీంకరిస్తూ వుంటారు. ఆవేశం వస్తే వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఆ మదం చాలా బలంగా వుంటుందనమాట.
 
ఆ ధన మదం గానీ, విద్యామదం గానీ, రూపమదం గానీ, అష్టవిధమదములు ఏవైతే వున్నాయో ఆ మదములన్నీ బలంగా పనిచేసినప్పుడు, ప్రపంచమునే లెక్కచేయనటువంటి పద్ధతిగా మారతారనమాట.
 
అటువంటివారు ప్రపంచ యుద్దాలకి కూడా కారణమైన సందర్భాలు వున్నాయనమాట. అలాంటివారందరిలో ఆ మదపుటేనుగు లక్షణం వుంటుందనమాట.
 
వారిలో, ఆ మానవులై వున్నప్పటికీ కూడా, వారిలో ఆ అహంకారము, ఆ మదము అతితీవ్రమైనటువంటి వేగంతో సంచరిస్తూ సమాజానికి కూడా మానవజాతికి కూడా నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ వుంటాయ్. మరి ఇటువంటి ప్రలోభాలు ఎన్నో మానవజన్మలో వున్నాయి.
 
సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹
 
05/Aug/2020
———————————— x ————————————

 
🌹 . కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 20 🌹
. సద్గురు శ్రీ విద్యాసాగర్
. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 8 🌻నచికేతా! ప్రపంచములో ఎక్కువమందిని ఆకర్షించునటువంటిన్ని, ఎక్కువమంది కోరుకొనునటువంటిన్ని పుత్ర-పౌత్రులను, ప్రియమును కలుగజేయు స్త్రీలను, ధన కనక వస్తు వాహనములను, ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికి ప్రలోభపెట్టినను నీవు వాటినన్నిటిని వదలిపెట్టితివి. నీ బుద్ధి చాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని.
అధిక సంఖ్యాకులగు సామాన్య మానవులు ధన కనక వస్తు వాహనములను సంపాదించవలెననెడి వ్యామోహములో పడి దుఃఖముల పాలగుచున్నారు. నీవు వానిని కోరవైతివి. వానిలోనుండు దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము. సంసారిక సుఖములకు లోబడని నీ వంటివారే ఆత్మ జ్ఞానమునకు అర్హులు.ఇతరత్రములైనటువంటి జగద్వ్యాపారములకు సంబంధించినటువంటి వాటి యందు ఆసక్తి ఎవరికైతే వుందో, ఆ మోహం ఎవరికైతే వుందో వారికి ఈ ఆత్మ విషయైక జ్ఞానమునందు ఆసక్తి కలుగదు. అంటే అర్ధం ఏమిటటా? ప్రతి జీవికి కూడా, జీవులందరికీ కూడా, సామాన్యధర్మం ఏమిటంటే వారివారి ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ఆసక్తి కలిగి ప్రవర్తించుట. ఇది సామాన్య విషయం.కాని మానవుడికి ఒక్కడికే ఈ ఇంద్రియాలను జయించ గలిగేటటువంటి సమర్ధత ఉంది. ఎట్లా? అంటే అవి కోరినటువంటివాటిని వాటికి అందివ్వనివ్వకుండా, అందనీయకుండా, అందించకుండా, నిరసిస్తూ తగుమాత్రముగా – దీనికి ఒక ఉపమానం చెప్తారు.
ఒక సింహాన్ని స్వాధీనపరచు కోవాలనుకోండి. ఎట్లా స్వాధీనపరచుకుంటావు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ ఇంద్రియములు ఎటువంటివట? ఆ సింహము వంటివట. వాటిని స్వాధీనపరచుకోవాలి అంటే ఒక జూలో గానీ, ఒక సర్కస్ లో గానీ వాటిని స్వాధీనపరచుకుంటారు.
సింహాలని, పులులని ఇలాంటి క్రూరమృగాలని కూడా స్వాధీనపరచుకుంటారు. ఎట్లా స్వాధీనపరచుకుంటారట? వాటిని పూర్తిగా ఆకలికి గురిచేస్తారు. అవి ఆకలితో నకనకనకలాడేట్లు చేస్తారు. చేసి, కొద్దిపాటి ఆహారాన్ని పెడతారు. ఎందుకనిట అంటే పూర్తిగా ఆహారం పెట్టకపోతే చనిపోతాయి.కాబట్టి కొద్దిపాటి ఆహారం పెడతారు. ఆ కొద్దిపాటి ఆహారంతో వాటికి సంతృప్తి కలుగదు. తీవ్రమైన అసంతృప్తి కూడా కలుగుతుంది. అట్లా తీవ్రమైన అసంతృప్తికి లోనైనప్పుడు వాటికి శిక్షణనిస్తారు. అంటే ఒక స్టూల్ ఎక్కి ఏనుగు కూర్చోవాలి. ఒక స్టూల్ ఎక్కి సింహం కూర్చోవాలి. ఒక రింగ్ లో నించి పులి దూకాలి. అట్లా దూకేటట్లుగా వాటిని కొడతారు.

వాటికి సంజ్ఞారూపకంగా సూచిస్తాడు. వాటికి మార్గ నిర్దేశం చేస్తాడు. అట్లా శిక్షణకి అవి లొంగితేనే వాటికి ఆహారం పెడుతాడు.

ఈ రకంగా ఒక యమనియమాదులతో కూడినటువంటి శిక్షణకు లోనయ్యేట్లుగా ఇంద్రియములను మనం స్వాధీనపరచుకోవాలి. అందువల్లనే యమనియమాలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.

ఆ రకంగా ఇంద్రియాలను స్వాధీనపరచుకోవాల్సిన అవసరం వుంది. అట్లా ఎవరైతే ఇంద్రియములను స్వాధీనపరచుకున్నారో, ఆ ఇంద్రియ జయం, జితేంద్రియత్వం కలిగిందో, వాళ్ళు సంసారసుఖము నుంచి బయటపడతారు.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹 🌹

 
06/Aug/2020
 
———————————— x ————————————

 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 21 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 9 🌻

సంసార సుఖమంటే అర్ధం ఏమిటీ అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారూ? స్త్రీ పురుష బాంధవ్యంలో వున్నటువంటి గృహస్థాశ్రమ సౌఖ్యమే సంసారమని అనుకుంటుంటారు. కాని సత్యానికది కాదు.

సమస్త మానవ సంబంధాల మధ్యలో మనస్సుతో కూడుకుని ప్రవర్తించేటటువంటి ఇంద్రియ సంబంధ వ్యవహారమంతా సంసారమే. మనసు పనిచేయడం, రజో గుణ ధర్మంతో ప్రారంభించగానే గుణ ధర్మం ప్రేరేపించబడగానే నీవు సంసారంలో పడతావు.

ఎప్పుడైతే నీవు గుణాతీతంగా వుంటావో వ్యవహారంలో సత్త్వగుణాన్ని పరిమితంగా అనుమతిస్తూ వాస్తవస్థితిలో నువ్వు గుణాతీతంగా సాక్షిగా నిలబడి వుంటూ ఎప్పుడైతే మోహాన్ని నిర్జిస్తావో, మోహాన్ని నిరసిస్తావో, మోహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావో, నిర్మోహత్వాన్ని సాధిస్తావో – దీనికి అందరికీ తెలిసినటువంటి సూత్రం వుంది.

“సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే”.

ఎవరైతే ఈ మోహపాశములతో బంధించబడతారో బాధించబడతారో వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొంటారు. మోహముద్గరం. ఈ భజగోవింద స్తోత్రానికే మోహముద్గరం అనిపేరు.

కాబట్టి ఎవరెవరికైతే ఆ యా సంసారలంపటం బలవత్తరంగా పనిచేస్తుందో ఆ ప్రారబ్దవశాత్తు ఏర్పడుతున్నటువంటి సంఘటనలు అభేద్యమై, అచేద్యమై నీవు స్వాధీనపరచుకోవడానికి సాత్త్వికమైనటువంటి జీవితం జీవించడానికి, గుణాతీతమైనటువంటి సాక్షిత్వంలో నిలబడి ఉండటానికి, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే సాధన. అలా అననుకూల పరిస్థితులు ఏర్పరచడమే ప్రకృతి.

నీలోపల వున్నటువంటి సూక్ష్మశరీరంలో వున్నటువంటి గుణధర్మాలననుసరించే నీ బయట వున్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తారు. వారలా ప్రవర్తించారని వాళ్ళ యెడల నువ్వే రాగద్వేషాలని పొందకూడదు. అలా పొందావనుకో నీలో ఆ గుణధర్మం ఇంకా శేషించిపోతుంది. బలపడిపోతుంది.

కాబట్టి నీ లోపలున్నటువంటి రజో గుణ ధర్మం తమోగుణ సత్త్వగుణ ధర్మాలని ఎత్తి చూపడానికే నీ చుట్టు ప్రక్కల నువ్వు జీవిస్తున్నటువంటి మానవ సంబంధాలన్నీ ఏర్పడ్డాయి. నీ చుట్టుప్రక్కల వున్న ప్రకృతి యొక్క ప్రాధమికమైనటువంటి నియమం, ప్రాధమికమైనటువంటి ధర్మం ఏమిటంటే నీలోపల వున్నటువంటి గుణమాలిన్యాన్ని ఎత్తిచూపుట. దాని పని అదే.

ఏమండీ, నేను ఫలానా ఆశ్రమానికెళ్ళి ఫలానా స్వామీజీని చూసివస్తానండి. ఫలానా తత్త్వప్రవచనం చెప్తారట, వెళ్ళొస్తానండి. కుదరదు. అక్కడికెళ్ళి ఏంచేస్తావు? ఇంట్లోనే వుండు. ఇంట్లో చేసుకోలేవా అదేదో.ఆ కృష్ణ రామ ఏదో ఇంట్లోనే చేసుకో. ఆ నామస్మరణ నీకెందుకు. అక్కడికెళ్ళి ఇప్పుడు చేసేదేముంది. నువ్వు కొత్తగా నేర్చుకునేది ఏముంది.

మమ్మల్నందరినీ విడిచిపెట్టి సన్యాసులలో కలిసిపోతావా. ఈ రకమైనటువంటి పద్ధతులతో నీ చుట్టుప్రక్కలున్న మానవ సంబంధాలు నీతో రియాక్ట్ అవుతున్నాయంటే, ఆ రకమైన ప్రతిస్పందనని తెలియజేస్తున్నాయంటే దీనికి కారణం ఏమిటి?

నీ సూక్ష్మ శరీరంలో వున్నటువంటి రాజసిక, తామసిక ధర్మాలు వాళ్ళలో వున్న గుణధర్మాలని ప్రేరేపించి నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించవేమో అనేటటువంటి భయాన్ని వాళ్ళలో కలుగచేసి నీ కర్తవ్యతా విముఖతను వాళ్ళు నిరోధించాలనే ప్రయత్నంలో నీతో వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు.

కాబట్టి అటువంటి సాంసారిక బంధమును కలుగజేసేటటువంటి ధర్మమంతా గుణమాలిన్యంతో వుంది కాబట్టి – సంసారమంటే మూడు గుణములే. వేరే ఇంకేం లేదు. మనస్సే. ఇంతకుమించి వేరే ఇంకేమీ లేదు.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

 
07.Aug.2020
 

———————————— x ————————————


Image may contain: outdoor

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 22 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 10 🌻

ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా వుంటావో, ఎప్పుడైతే మిగిలిన 24, పిండాండ పంచీకరణలో చెప్పబడినటువంటి 24 నీకు స్వాధీనమై నువ్వు సాక్షిగా వుంటావో, అప్పుడు సేవకుడిగా వుంటావు. కర్తవ్యం చేస్తావు. ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవై వుంటావు.

అంతా ఈశ్వరప్రసాదంగా చూస్తావు. కర్మకి అంటకుండా వుంటావు. మాలిన్యము లేకుండా వుంటావు. ఇంకేమిటి? సహజ సమరస శాంత స్వభావంతో వుంటావు. ఈ మూడూ గుర్తుపెట్టుకోవాలి.

సహజ సమరస శాంత స్వభావంతో ఎవరైతే వుంటారో వాళ్ళు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి అంశాలను ఇందులో ప్రతిపాదిస్తున్నారు.

కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా అనేక జన్మలుగా మాటిమాటికీ ప్రలోభపెడుతూ నీ వెనక పడుతున్నటువంటి నిన్ను వాటి వెంట తిప్పుకునేటటువంటి ధన, కనక, వస్తు, వాహన స్త్రీ వ్యామోహ – స్త్రీ అంటే ఇక్కడ ఒక స్త్రీలనే కాదు సుమీ.

మానవులందరూ స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడు. ప్రకృతి అంతా స్త్రీత్వమే. కాబట్టి ఇక్కడ స్త్రీ అన్న శబ్దం వాడినప్పుడల్లా ప్రకృతి చేత ప్రేరణ పొందబడుతున్న వారందరూ స్త్రీలే. కాబట్టి గుణముల చేత ప్రేరితమవుతున్న వారందరూ స్త్రీలే. సర్వజీవులూ స్త్రీలే అని అర్ధం.

కాబట్టి ఇటువంటి జీవభావంతో శరీరమే నేను అనేటటువంటి వ్యామోహంతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే వుంటారో, మోహము -వ్యామోహము , విస్తృతి కలిగినటువంటి మోహము వ్యామోహము. వ్యావృత్తి కలిగినటువంటి మోహము వ్యామోహము.

కాబట్టి అటువంటి దాని బారిన పడకుండా మానవజీవిత లక్ష్యమైనటువంటి ఆత్మజ్ఞానమును అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నంచేస్తుంటారో వారి జన్మ ధన్యము.

ఎవరికైతే ఈ “స్త్రీ బాలాంధ జడోపమాస్వహమితి భ్రాంతాభృశం వాదినః” అనే సత్యాన్ని గుర్తించినటువంటి వారున్నారో, ఎవరైతే జగత్ భ్రాంతిలో పడకుండా వున్నారో, “బ్రహ్మ సత్యం జగన్మిధ్య” అను సూత్రమును తన జీవితమునందు తాను సిద్ధిపొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి వున్నారో వారి జన్మ ధన్యము.

కాబట్టి మనలో ఆ రకమైన జగత్తుకి సంబంధించినటువంటి ప్రేరణలు కలుగగానే వాటిల్లో ఉన్నటువంటి దోషభావాన్ని గుర్తెరగాలి. ఏమిటి వాటిల్లో ఉన్నటువంటి దోషభావము అంటే నిన్ను మొహములో చిక్కుకునేటట్లుగా చేస్తుంది.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

 
08.Aug.2020
 
———————————— x ————————————

 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 23 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 11 🌻

మోహమునకు ఒక ఉపమానం వుంది. ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది. ఎవరో కఫం వచ్చి ఉమ్మేశాడు. అది విసర్జించ బడదగినటువంటి అంశము కాబట్టి వాడు విసర్జించాడు. వీడు విసర్జించినటువంటి కఫము, శ్లేష్మము ఈగకు ఆహారముగా కనబడుతున్నది.

కనబడి ఆ శ్లేష్మము, కఫములో ఉన్నటువంటి సూక్ష్మజీవులని ఆహారంగా పుచ్చుకోవాలని ఈ ఈగ ఆ శ్లేష్మంలో ప్రవేశించింది.

ప్రవేశించేటప్పటికి ఆ శ్లేష్మానికున్నటువంటి జిగురు దాని రెక్కలకంటుకుంటుంది. అంటుకునేటప్పటికి అది ఎగరడానికి అసక్తమైపోతుంది. అసక్తమైపోయి ఆ శ్లేష్మంలోనే పడి చనిపోయింది.

ఇది మోహంలో వున్నటువంటి గొప్ప విశేషం. ధన కనక వస్తు వాహన శరీరగత వ్యామోహములన్నీ ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటకి ఎగరనివ్వలేవు. నిన్ను, నీ స్వేచ్ఛని హరిస్తాయి. నీయొక్క మానవజన్మకి సంబంధించిన స్వధర్మాచరణని చేయనివ్వవు.

కాబట్టి ఈ రకమైనటువంటి ఉపమానాన్ని వాటిల్లో వున్న దోషలక్షణాన్ని స్పష్టముగా గుర్తెరగవలసినటువంటి అవసరం వుందనమాట. ఆహా, మరల నేను ఈ రకమైనటువంటి మోహంలో చిక్కుకోబోతున్నాను.

మోహమనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అన్నారు. పెద్దలేమన్నారంటే మొహాన్ని పులితో పోల్చారనమాట. ఒకసారి పులిబారిన పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. కారణమేమిటంటే పులి అక్కడా ఇక్కడా పట్టుకోదు.

సరాసరి మెడ దగ్గరే పట్టుకుంటుంది ఏ జీవినైనా సరే. ఇక ఆ మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశము ఉండదనమాట. వీడు తప్పించుకోవడానికి గిలగిలలాడేటంత లోపలే దాని యొక్క పంజా, దాని యొక్క పళ్ళు వీడి యొక్క కంఠనరాలని తెంచేస్తాయి. తద్వారా మృత్యువుబారిన పడతాడనమాట.

కాబట్టి ఈ మొహమనేటటువంటి వ్యాఘ్రము ఎలా వుందయ్యా అంటే నీ ఆయువుని హరించివేస్తూ వుంటుంది. నిరంతరాయముగా నీ ఆయువుని హరించివేస్తుంది. కాలయాపన జరిగేటట్లుగా చేస్తుంది. నిన్ను మేలుకోనివ్వకుండా ఉండేట్లు చేస్తుంది.

నిన్ను విడిపించుకోనివ్వకుండా బంధములో ఉంచేట్లు చేస్తుంది. నిన్ను ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే అంతగా బిగుసుకుపోయేట్లుగా మార్పుచేస్తుంది. ఈ వ్యామోహం యొక్క ప్రభావం ఇది.

ఆ జన్మాంతర విశేషం అయినటువంటి వాసనాబల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై వున్నది. అటువంటి మోహము నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మజ్ఞానము అత్యావశ్యకము.

ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిచారణని పొందుతారో వాళ్ళు ఈ మొహములో నుండి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుండీ బయటపడతారు.

కాబట్టి మానవజన్మని ధన్యత చెందించుకోవాలి అంటే ఉత్తమమైన మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునకి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తూ వున్నాడు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

 
09.Aug.2020
 

———————————— x ————————————


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 25 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 13 🌻

ఒకరికి విద్యయందు ఆసక్తి వుంది. వరసగా చేస్తూనే పోతుంటాడు జీవితకాలం. ఎం ఎ లు, పిహెచ్ డి లు, ఎం ఫిల్ లు, ఎం ఎ లు, బి ఎ లు వాడికి తోచిన డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు. కొంతమంది వున్నారు.

16 ఎం ఎ లు చేశానండీ అని చెప్పుకుంటాడు జీవితంలో. సత్యమే. కాని అది ప్రేయోమార్గము కదా. కొంతమంది ఏం చెప్పుకుంటారు? నేను సైకిల్ తొక్కుతూ ఈ వూరొచ్చానండి. ఇప్పుడు నేను 40 అంతస్థుల మేడ కట్టానండీ అంటాడు.

అంటే ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏమిటీ అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే… మనం కూడా ప్రతిరోజూ ఏం చేయాలిట ఇప్పుడు. ఈ సింహావలోకనం చెయ్యాలి.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలిట. నాకు పుట్టి బుద్ధి ఎరిగినప్పటినుంచీ, ఊహ వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ గత 30 ఏళ్ళలో, గత 40 ఏళ్ళలో, గత 50,60,70,80,100 ఏళ్ళల్లో సాధించినది ఏమిటి? అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో, అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములయినట్లయితే, అవన్నీ ఏమిటవీ? ప్రేయోమార్గములు. బంధదాయకములు.

సుఖాన్ని ఇస్తుంది. బంధదాయకం అయినప్పటికీ కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇందాక చెప్పా. శ్లేష్మములో పడిన ఈగ సుఖాన్ని పొందుతోంది. ఆహారాన్ని తింటోంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తోంది. కాని అందులోనే ప్రాణాన్ని కోల్పోయింది.

శరీరము నేనుగా వున్నప్పుడు జర మరణ దుఃఖములు తప్పవు. ఆ జరామరణదుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందాలి అంటే ఆత్మవిచారణ చెయ్యాలి.

ఈ బాల్య యవ్వన కౌమార వృద్ధాప్యములు నావికావు, శరీరానివి అనేటటువంటి, శరీరంలోనే వుండి శరీరమునకు విలక్షణముగా వుండేటటువంటి స్థితిని సంపాదించాలి.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

 
10.Aug.2020
 

———————————— x ————————————


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 26 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 14 🌻

చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పర భిన్నమో – భిన్నము అంటే అర్ధం ఏమిటంటే ఒకటుంటే ఒకటుండదు. వెలుతురున్నప్పుడేమో చీకటుండదు. చీకటున్నప్పుడు వెలుతురు అనుభూతం కాదు. అట్లాగే వివేకం ఉన్నప్పుడు అవివేకం కలిగే అవకాశం లేదు.

అట్లాగే అవివేకం వున్నప్పుడు వివేకం కలిగే అవకాశం లేదు. కారణమేమిటంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగం వుంటుంది. ఒక వడి వుంటుంది. అదొకసారి కలిగితే నిన్ను స్థిరంగా వుండనివ్వదు. ఉదాహరణ చెప్తాను.

మీఅందరిలో మీ అందరి జీవితాలలో తాజ్ మహల్ చూసినవాళ్ళు ఎవరు అంటే కొంతమంది చూశామని కొంతమంది చూడలేదని చెప్తారు. చూడకపోతే ఏమిటయ్యింది అన్న ప్రశ్న వేసుకున్నామనుకో తాజ్ మహల్ చూడకపోతే జీవితం వ్యర్ధం. అట్లాగే నేను కాలేజిలో చదివే కాలంలో మరోచరిత్ర సినిమా చూశావా అన్నారు.

నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. నేను చూడలేదు. అయితే నీ జీవితం సగం వృధా అనేవాళ్ళు. అంటే అర్ధం ఏమిటీ అంటే, ఈ ప్రేయోమార్గములో వున్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృధా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందుతాడు.

ఆ ఉద్వేగాన్ని పొందేటప్పటికీ ఆ సుఖంవైపు మిడత వలే ఆకర్షించబడతాడు. ఆకర్షించబడి శలభం ఎట్లా అయితే ప్రాణాలని కోల్పోతుందో దీపశిఖ మీద పడి, అట్లాగే దీపపు పురుగువలే అయిపోతాడనమాట. అర్ధమైందా? ఈ రకమైనటువంటి బంధకారణము ఈ ప్రేయోమార్గములో వుంది.

అందువలననే ఈ ప్రేయోమార్గమును అవిద్య అన్నారు. ఎందుకనిట అంటే ఈ అవిద్యకు మూలం లేదు. ఇది అనాది.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

 
11.Aug.2020
 

———————————— x ————————————


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 27 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 15 🌻

మరి శ్రేయోమార్గమో. అది విద్య. జ్ఞానం. అదీ అనాదే. ఆ జ్ఞానము కూడా అనాదే. కాబట్టి శరీరాన్ని మార్చిన ప్రతిసారీ నీతో వచ్చేవేమిటయ్యా అంటే ఈ జ్ఞానాజ్ఞానములే నీతో ఒక శరీరం నుంచి మరొక శరీరమునకు మార్పు చెందేటప్పుడు వచ్చేటటువంటి వారసత్వ సంపద.

దీనినే మనం ఇప్పుడు లేటెస్ట్ [latest] గా నూతనమైన విజ్ఞాన పధంలో జీన్ థియరీ [gene theory] ని డెవెలప్ [develop] చేశాం మనం. అధ్యయనం చేశాం. ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా జ్ఞానాజ్ఞాములు రెండూ ప్రాప్తిస్తున్నాయి. మరి ఏం చెయ్యాలండీ? ప్రయత్నం చేసి దీనిని మార్చవచ్చు. దీనిని మ్యుటేట్ [mutate] చెయ్యవచ్చు అని నిరూపించారు.

ఏ రకమైనటువంటి స్వభావంతో కూడినటువంటి వ్యక్తైనా ప్రయత్నశీలుడై, శ్రద్ధాభక్తి కలిగి, విశ్వాసం కలిగి తపస్సు చేసినట్లయితే దాని కొరకు, లక్ష్యము కొరకై తపించుట. తపస్సు అనగా ఇంద్రియములను ఇంద్రియార్ధములందు ప్రవేశించనివ్వకుండా లక్ష్యమునందే వుంచుటకు తపించుట.

మీరది చెట్టు క్రిందే చేస్తారో, ఇంట్లోనే చేస్తారో, సంధ్యాసమయంలోనే చేస్తారో, నిద్రాసమయంలోనే చేస్తారో, జీవితకాలం అంతా చేస్తారో, ఒక్క క్షణమే చేస్తారో ఇదంతా మీ శక్తిసామర్ధ్యములను బట్టి ఆధారపడి వుంటుంది. కాబట్టి నీవు ఆ తపింపజేసేటటువంటి లక్షణం గనుక నీలో లేకపోయినట్లయితే , ఆ తహ నీలో లేకపోయినట్లయితే , ఆ శ్రద్ధాభక్తులు లేకపోయినట్లయితే , ఆ దైవీ సంపద లేకపోయినట్లయితే నీవు అవివేకియై మోక్షమునకు దూరమై ప్రేయోమార్గమున పడిపోతావు. ఎప్పటికప్పుడు జగద్ వ్యాపారమునకు సంబంధించినటువంటి ఆకర్షణలు నిన్ను ప్రలోభపెడతాయి. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ #సద్గురువిద్యాసాగర్

 
13.Aug.2020
———————————— x ————————————

 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 28 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 16 🌻

ఈ అవిద్యారూపములకు ఉపమానం చెప్తున్నాడు. స్త్రీ పుత్ర ధనాదులు. ఏమండీ, ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలే ఎక్కువమంది వున్నారు.

మీరు స్త్రీలని బహిరంగంగా చెప్తున్నారు. మరి ఏ స్త్రీలు అని అడగవచ్చు మీరు. ఇందాకే చెప్పాను. స్త్రీలంటే ప్రకృతీ స్వభావం కలిగినటువంటి, జీవస్వభావం కలిగినటువంటి వారందరూ, శరీరమే నేనుగా జీవించేవారందరూ స్త్రీలే. పుత్ర అంటే మీ వారసులు.

పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండీ అనుకోవనక్కర్లా. పున్నామనరకం ఎవరికైతే కలుగుతుందో, ఆ పునః నామ నరకం పొందడానికి, జనన మరణ చక్రంలో భ్రమించడానికి, తిరగడానికి సిద్ధపడ్డవారందరూ కూడా మోహమును కలిగివున్నవారే. అందరూ మోక్షమునకు దూరమైనవారే. మోక్షం అంటే మోహక్షయం. విద్యారూపమగు శ్రేయోమార్గము చేత మోహము క్షయించిపోతుంది.

ఆత్మజ్ఞానవిశేషంచేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహము క్షయిస్తుంది. ఇది దాని యొక్క ప్రయోజనం.

ఆత్మవిశేషంచేత, ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించవు. మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి. అవదు. మా అబ్బాయికి ఉద్యోగం రావాలి. అదీ అవదు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. అదీ అవదు. మరి ఏమిటి దీనివల్ల ప్రయోజనం? నీలోపల ఆంతరిక పరిణామాన్ని పొందుతావు. నీకు దేనియందైతే, జగత్తుయందున్నటువంటి వస్తు, మానవ, జీవ సంబంధాలు ఏవైతే వున్నాయో వాటన్నింటి యెడల మోహము క్షయించిపోయేట్లు చేస్తుంది. అదొక్కటే ఈ ఆత్మవిచారణ వలన ప్రయోజనం.

విద్య – ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం, శ్రేయోమార్గము వల్ల ప్రయోజనం; ఏక ప్రయోజనం. ఏమిటంటే సత్య శాంత సమరస భావముచేత మోహక్షయం కలుగుతుంది. మోహము క్షయించి పోవడం ద్వారా నీవు ఉత్తమగతిని పొందుతావు. ఏమిటా ఉత్తమగతి అంటే? జననమరణ చక్రంలో పడకుండా వుంటావు.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

 

14.Aug.2020

———————————— x ————————————

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 28 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 17 🌻

అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రేయోమార్గమును అనుసరించేటటు వంటి వారు, తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో, అది మాత్రమే ఆశ్రయిస్తారు. శాశ్వత దుఃఖం ఏర్పడుతుందనేటటువంటి సత్యాన్ని గ్రహించలేరు. గ్రహించలేకపోగా వారిలో అజ్ఞానాంధకారము వలన, అవిద్యాదోషము వలన, మోహప్రభావంవలన, తమను తామే గొప్పగా తలుస్తారు.

అందుకని పెద్దలు ఎవరైనా గానీ వారి యొక్క జ్ఞానబలాన్ని తెలుసుకోవాలి అంటే, వారేం మాట్లాడుతున్నారో, వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుంది.

ఎవరి మాటలలో అయితే ఆత్మస్తుతి, పరనింద ఈ రెండూ వుంటాయో ఇవి అవిద్యకి ప్రధమ ముఖం. అవిద్యా దోషమునకు ప్రధమ ముఖము ఏమిటంటే ఆత్మ స్తుతి, పరనింద. తననుతాను పొగుడుకోవడం. తననుతాను గొప్పగా చేసుకోవడం. తననుతాను అహంభావంతో వ్యక్తీకరించుకోవడం. తనను తాను అభిమానంతో చూచుకొనుట. తనను తాను గొప్పగా చేసి చెప్పుకొనుట.

తన యొక్క విద్వాంస లక్షణాన్ని, తనయొక్క శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని, తన ఆజీవన పర్యంతము తాను చేసిన పరిశోధనా ఫలమును తాను గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో, పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువాటి వాటినన్నింటిని తానే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో, తనయొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానమును ఎప్పుడైతే బలపరచుకుంటాడో అప్పుడు ప్రేయోమార్గమైనటువంటి, అజ్ఞానాంధకారమైనటువంటి, అవిద్యారూపమైనటువంటి, బంధకారణమైనటువంటి, మోహరూపమైనటువంటి సంసారమునందు చిక్కుకున్నాడు.

కాబట్టి ఇది ఎటువంటిదయ్యా. చాలామంది అట వీళ్ళనే గురువులుగా భావిస్తారు. ఎవరైతే ఆత్మనిష్ఠులు కారో వారు గురువులు కారు.

ఎవరైతే ఈ అవిద్యాబలముచేత శాస్త్రజ్ఞులుగా, విద్వాంసులుగా, పండితులుగా, కార్మికమైనటువంటి మలముచేత, త్రిగుణమాలిన్యముచేత కర్తవ్యకర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపచేస్తూ కామ్యక గురువులుగా, నిషిద్ధగురువులుగా ఉన్నటువంటివారిని ఆశ్రయించినట్లయితే తప్పక మరింత బంధకారణములో చిక్కుకునే అవకాశం ఏర్పడుతుంది. తప్పక మోహం బలపడే అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఏమైపోతావూ అంటే ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని గురువుగా పెట్టుకున్నాడట.

అప్పుడేమయింది. ఏ రకమైనటువంటి విద్యని పొందగలుగుతావు. ఏ రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు. ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతావు అంటే అసాధ్యం. ఎందుకంటే గురువుగారికే ఆత్మానుభవంలేనప్పుడు శిష్యులకి ఆ అత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి వుండదు.

ఎప్పటికప్పుడు ఆత్మోపరతి దిశగా నడపవలసినటువంటి గురువుగారు వారిని జగద్ వ్యాపార సహితమైనటువంటి సకామ్య పద్ధతిగా నడుపుతారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

 
15.Aug.2020

———————————— x ————————————


 
 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 29 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 18 🌻

అప్పుడేమౌతాడు వాడు? అదే మోహంలో మరింతగా కూరుకుపోతాడు. పైగా ఈసారి ఏమనుకుంటాడు. మా గురువుగారే చెప్పారు కదా అనుకుంటాడు. మా గురువుగారే చెప్పగా ఇంకేముంది సమస్య. ఏమండీ మా అబ్బాయిని విదేశాలకి పంపించమంటారా అని నన్ను అడిగారనుకోండి. నేను ఏమి చెప్పగలుగుతాను. మా అమ్మాయికి ఈ పెళ్ళి చెయ్యమంటారా, ఈ సంబంధం కుదర్చమంటారా అని నన్నడిగారు అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను. ఏమండీ ఈ ఇల్లు కొనమటారా అని నన్ను అడిగారనుకోండి. నేనేం చెప్పగలుగుతాను.

కాబట్టి ఈ రకమైనటువంటి జగద్వ్యాపార లక్షణాలలో నీవు గనక గురువును ఉపయోగించుకోవడం ప్రారంభించావనుకో అప్పుడు ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు.

ఎందువల్ల అంటే ఆ గురువు అప్పుడు నీకు ఎట్లా కనబడతాడు అంటే నీ కోర్కెలు, నీ సందేహాలు, నీ సంసారగత సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, శాస్త్రజ్ఞుడు కామ్యకకర్మలయందు, ధర్మములయందు, శాస్త్రములయందు విశేషమైన పాండిత్యం కలిగి సలహాలిచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడే తప్ప నీ అత్మోన్నతికి, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొండానికి, నీవు విద్యావంతుడవు అవడానికి, నువ్వు శ్రేయోమార్గమున నడవడానికి సరియైనటువంటి సద్గురుమూర్తిగా నీకతను ఉపయోగపడలేడు.

కాబట్టి గురువుని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నామనేటటువంటి అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివాడిని ఆశ్రయించిన పద్ధతిగా వుండేది అవిద్యా పద్ధతి.

మోహపద్ధతి. ప్రేయోమార్గ పద్ధతి. ఇద్దరూ గ్రుడ్డివాళ్ళైతే పొందే ఫలం కూడా అంధకారమే. కాబట్టి పరలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఆముష్మిక సాధనలైనటువంటి ఆధ్యాత్మికమార్గమైనటువంటి ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి మార్గంలో ప్రవేశించాలి అంటే మానవులందరూ తప్పక తపోనిష్ఠ కలిగివుండాలి.

తప్పక ఇంద్రియములను ఇంద్రియార్ధములందు, అవి కోరినటువంటి వాటియందు ప్రవేశింపనివ్వక, నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మవిచారణా జ్ఞానమున ప్రవేశింపజేసి, మనోబుద్ధులను ఆత్మయందు సంయమింపచేయాలి. మనోబుద్ధులను చైతన్యస్థితి యందు సంయమింపచేయాలి.

ఇంద్రియములను మనోబుద్ధులయందు, మనోబుద్ధులను చైతన్యమునందు, చైతన్యమును తనమూలమైనటువంటి పరమాత్మయందు ఎవరైతే ఉపశమింపచేస్తారో, ఉపరమింపచేస్తారో, విశ్రమింపచేస్తారో, సంయమింపచేస్తారో వారే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించగలిగేటటు వంటివారు. అటువంటి ఆత్మవిద్యని గ్రహించవలసినటువంటి అవసరం వున్నది.

ఈ ఆత్మవిద్యకి అత్యంత ముఖ్యమైనటువంటి అధికారిత్వంలో వున్న లక్షణాలు చెప్తున్నారు. అహింస, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలగువానిని యమనియమాదుల యొక్క లక్షణాలన్నిటినీ ఇక్కడ వివరిస్తున్నారు. ఈ అహింస, సత్యం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఈ లక్షణాలని తప్పక మానవులందరూ కూడా ఆచరించాలి.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ #సద్గురువిద్యాసాగర్

17.Aug.2020
———————————— x ————————————

Kathoupnisad🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 30 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 19 🌻

బ్రహ్మచర్యం అన్నదాంట్లో ప్రతి ఒక్కరికీ సందేహం కలగవచ్చు. బ్రహ్మచర్యము అంటే అర్ధము ఏమిటంటే బ్రహ్మమునందు చరించుట.

అనగా అర్ధం ఏమిటంటే ఇంద్రియములను ఇంద్రియార్ధములందు పని చేస్తున్నప్పటికి నేను బ్రహ్మమును, నేను సాక్షిని అని ఎవరైతే విలక్షణంగా వుంటారో, ఆ ఇంద్రియ సుఖమును తాననుభవించడు. శారీరిక చర్య, ఉపచర్యలలో ప్రవర్తించినటువంటి సందర్భాలు ఏర్పడినప్పటికీ కూడా సంయమేంద్రియుడై ఇంద్రియజయాన్ని కలిగియుండి నామమాత్రమై నిమిత్తమాత్రమై ఉంటాడు. అప్పుడేమయ్యాడు? అంటే ఆయా చర్య ఉపచర్యలలో, ప్రతిచర్యలలో పాలుపంచుకున్నట్లుగా చూచేవారికి కనబడుతున్నాడు.

జగత్తుకి చూస్తే మాత్రం అలాగే వున్నట్లుగానే కనబడుతున్నాడు. కాని వాస్తవికంగా తాను అలా లేడు. ఈ రకముగా శరీరమునందే ఉన్నటువంటివాడై వుండి, అశరీరిగా వున్నాడు. దేహమునందే ఉన్నవాడుగా వుండి, దేహిగా వున్నాడు. క్షేత్రమునందే ఉన్నవాడుగా వుండి, క్షేత్రజ్ఞుడుగా వున్నాడు.

ఈ రకమైనటువంటి విభాగన్యాయమును మన అంతరంగమునందు ఏర్పరచుకుని బుద్ధిని గనక చైతన్యమునందు సంయమించేటటువంటి సాధనని, ఉపశమించేటటువంటి సాధనని గనక మనం చేసినట్లయితే నీవు ఆత్మోపదేశమును పొందినవాడవై ఆత్మవిచారణ ద్వారా ఆత్మోన్నతిని సాధించి ఆత్మానుభూతిని, ఆత్మనిష్ఠని పొందగలుగుతావు అనేటటువంటి దృఢమైనటువంటి సరియైనటువంటి మార్గనిర్దేశం చేస్తున్నారు.

శ్రేయోమార్గము ననుసరించువారు అరుదుగా నుందురు. లోకములో నూటికి కోటికి ఎవరో ఒకరే నీవంటివారు ఆత్మజిజ్ఞాస కలవారుందురు. మానవులలో అనేకులు ఆత్మనుగురించి వినుటకు నోచుకొనరు. ఆత్మ జ్ఞానమును ప్రబోధించి ఉపదేశములను వినుటకు అవకాశము కల్పించుకొనరు. ఒకవేళ అట్టి ఉపదేశములను వినుచుండినను వారిలో ఎక్కువమందికి ఆత్మయననేమో తెలియదు. ఆత్మ తత్వమును చెప్పగలవారు కూడా అరుదుగా వుందురు. ఆత్మను గురించి విని, వినిన దానిని మనన నిధి ధ్యాసలచే ఆత్మ నెరుంగువారు కుశలురు.

ఆత్మ తత్వమును బోధించువారు కూడా అతి కుశలురై యుండవలెను. అట్టి నిపుణుడైన ఆచార్యునిచేత బోధింపబడి ఆత్మ నెరుగు వ్యక్తిని అద్భుతమైన వ్యక్తి యనక తప్పదు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

 
———————————— x ————————————

 
 

1595345086266370-0.png🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 31 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 20 🌻

ఆచార్యుడు కానటువంటివాడు ఆత్మతత్త్వమును బోధించలేడు అని చెప్తున్నారు.

అంటే అర్ధం ఏమిటీ అంటే స్వయముగా తానే ఆచరించి తాను స్వయముగా ఆత్మనిష్ఠను పొందనటువంటివారు ఎవరైతే వున్నారో, వారు ఆత్మతత్త్వాన్ని బోధించడానికి అనర్హులు. ఒకవేళ అటువంటి వారిని నీవు ఆశ్రయించినచో, వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా, నీలో అవిద్యా శబలితమైనటువంటి అజ్ఞానప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి అవకాశం వుంది.

కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రముగా గమనించవలసినటువంటి అవసరం వుంది. వారిని అనుసరించాలట. నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే ఒక సంవత్సరకాలం అనుగమించి ఉండాలి. అనుసరించి వుండాలి. అనేక సందర్భాలలో గురువుగారు ఎలా వున్నారు అనేటటువంటి పరీక్ష చేయాలి. నిజానికి మాట్లాడితే శిష్యుడే గురువుని పరీక్షించాలి. ఈయన నాకు తగునా. తగుపాటి గురువును అన్వేషించాలి. ఈ అన్వేషణ అత్యంత శ్రద్ధతో చేయాలి.

అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువుగారు నిరంతరాయంగా ఆత్మనిష్ఠ గురించే బోధిస్తున్నారా, లేక జనవాక్య హితమైనటువంటి ప్రేయోమార్గ పద్ధతిగా జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధ చేస్తున్నాడా అనేటటువంటిది గ్రహించాలి, గమనించాలి. ఎవరైతే స్వయముగా ఆత్మనిష్ఠులో వారు మాత్రము అతికుశలురై వుండుటచేత – ఈ అతికుశలత్వం అంటే అర్ధం ఏమిటంటే బుద్ధియొక్క కదలికలని కదలకముందే తెలుసుకొనుట. ఇది కౌశలము అంటే.

కౌశలము అంటే నిపుణత్వం. నైపుణ్యం ఎంత వుండాలయా అంటే “బుద్ధి కర్మానుసారిణీ”. బుద్ధి కర్మననుసరించే పనిచేస్తుంది. కర్మ అంటే ఏమిటీ అంటే మూడు గుణములతో కూడుకున్నది కర్మ. కర్తృత్వ భోక్తృత్వములతో కూడుకున్నది కర్మ.

ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటిది కర్మ. వాసనలతో కూడుకున్నటువంటిది కర్మ. కాబట్టి గుణత్రయము, వాసనాత్రయమును, దేహత్రయమును, శరీరత్రయమును, అవస్థాత్రయము వంటి త్రిపుటులన్నీ ఇందులో వున్నాయి.

మరి వాటియందు ఏ రకమైనటువంటి కదలిక ఏర్పడినా, ఏరకమైన ప్రలోభం ఏర్పడినా, ఏరకమైన ప్రభావం ఏర్పడినా, ఏరకమైన ప్రతిబంధకం ఏర్పడబోతున్నా, అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి కాబట్టి, బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకొన్నవాడై బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపివుంచి ఈ ప్రలోభములకు గురి కాకుండా చేయగలగడం కౌశలం. ఇదీ కౌశలం అంటే అర్ధం. కుశలత్వం అంటే అర్ధం ఇది. ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయా నువ్వు? ప్రపంచంలో చాలా నైపుణ్యాలు వున్నాయి. అనేక నైపుణ్యాలు.

ఒక గోడకి మేకు కొట్టాలన్నా నైపుణ్యంతో కొట్టాలి; లేకపోతే వేలు బద్దలవుతుంది. ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి. ఒక సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా నైపుణ్యం కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా, వంకాయ కూర చేయాలన్నా కూడా సరిగ్గా జాగ్రత్తగా చేయకపోతే వేలు తెగుతాయి వంకాయ తెగేబదులు.

కాబట్టి ప్రతిపనిలోనూ – కర్మ అంటేనే కౌశలం. కర్మ అంటేనే కౌశలం అని అర్ధం. “కర్మసుకౌశలం” అంటే అర్ధం ఏమిటంటే చాలా నైపుణ్యంతో చేయబడేటటువంటి కర్మ అనే అర్ధం చెప్పకూడదు.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

 
 
19.Aug.2020
 
———————————— x ————————————

 
 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 32 🌹Kathopanishad (1)

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 21 🌻

“యోగాత్ కర్మసుకౌశలం” అంటే అర్ధం ఏమిటంటే – ‘సుకౌశలం’ వట్టి కౌశలం కాదు అది. నీవు ఆత్మవిచారణా జ్ఞానముతో, సాక్షిత్వజ్ఞానంతో నిలబడి వుండి, నిష్ఠ కలిగి వుండి, చలించని వాడవై వుండి చేసేటటువంటి వ్యవహారం అని అర్ధం. అంతేగానీ వ్యవహారంలో బాగా కౌశలంగా చేయగలగడం అని కాదు.

అంటే అర్ధం ఏమిటంటే చాలామంది ఈ అర్ధాన్ని తప్పుగా స్వీకరించినప్పుడు బాగా వంట చెయ్యగలగడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా ధనం సంపాదించడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా వ్యాపారం చేయడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా భోజనం చేయడం కూడా ఆత్మనిష్ఠయే. బాగా నిద్రపోవడం కూడా సుఖాలని అనుభవించడం కూడా ఆత్మనిష్ఠయే అనేటటువంటి అర్ధాన్ని అది సూచిస్తోంది.

కాబట్టి ‘కౌశలం’ అంటే అర్ధం ఏమిటంటే జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములలో, జగత్ సంబంధమైనటువంటి వ్యవహారములలో, మోహ సంబంధమైనటువంటి ప్రతిబంధకములలో సుఖ దుఃఖరూప మిశ్రితమైనటువంటి కర్మలలో, సంగత్వ దోషాన్ని పోగొట్టేటటువంటి సాక్షిత్వమునందు నువ్వు నిలకడ చెందాలి.

ఆ సాక్షిత్వమునందు నిలకడచెందేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ నైపుణ్యాన్ని నువ్వు సంపాదించినపుడు మాత్రమే నువ్వు “బుద్ధిగ్రాహ్యమతీంద్రియం”. బుద్ధిని దాటగలుగుతావు. “బుద్ధికర్మానుసారిణీ” అన్న స్థితి నుంచి కర్మకి అతీతంగా బుద్ధిని పనిచేయించగలుగుతావు. ఇది కౌశలం అంటే. ఈ కుశలత్వాన్ని అందరూ సంపాదించలేరు.

ఎవరికైతే బుద్ధి వికాసం పూర్తవుతుందో, ఎవరికైతే జగత్ భ్రాంతిగతంగా కనబడుతుందో, ఎవరికైతే జ్ఞానం సత్యంగా కనబడుతుందో, ఎవరికైతే విజ్ఞానము, వివేకమే జీవితప్రాధమ్యాలుగా వుంటయ్యో.. వాళ్ళు మాత్రమే దీనిని సాధించగలుగుతారు. అందువలన ఏమంటున్నాడంటే, నాయనా! ఇటువంటివారు నూటికో కోటికో వుంటారు. కాబట్టి బోధించేవారూ అరుదుగా వుంటారు.

ఆశ్రయించేటటువంటి అధికారులైనటువంటి శిష్యులు కూడా అరుదుగా వుంటారు. యమధర్మరాజుని, సరాసరి యమధర్మరాజు దగ్గరికి పుట్టినటువంటి జీవులందరూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసిందే. కానీ ఏ ఒక్కరూ యమధర్మరాజుని ఆత్మతత్త్వ విచారణ గురించి ప్రశ్నించలేదు.

ఆయన యొక్క స్థితిని చూసి భయపడిపోయి, ఆయన యొక్క విధించేటటువంటి శిక్షలను అనుభవిస్తూ, క్షీణపుణ్యం అవ్వగానే మరల మర్త్యలోకంలోకి తిరిగి వచ్చేటటువంటి వారేగానీ, యమధర్మరాజుని గురువుగా భావించి, ఆచార్యుడుగా భావించి, ఆ ఆత్మతత్త్వ బోధ గురించి అడిగి – ప్రశ్నించేటటువంటి ఉత్తమమైనటువంటి వివేకాన్ని ప్రదర్శించినటువంటి నచికేతుని వలే ఉండేటటువంటివారు చాలా అరుదుగా వుంటారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

20.Aug.2020

———————————— x ————————————


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 33 🌹
Kathoupanisad
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 22 🌻

అట్లాగే మన నిజజీవితంలో కూడా జగత్ వ్యవహారమునకు, జగత్ వ్యాపారమునకు సంబంధించి అనేక సూచనలని, సలహాలని, అవగాహనలని, ఆక్షేపణలని, ఆశ్రయాలని అందించేటటువంటివారు కోకొల్లలుగా వుంటారు.

కాని నాయనా! ఆత్మనిష్ఠ గురించి మీరేమైనా తెలియజేయగలరా అని ప్రశ్నించాలట. అత్మానుభూతి మీరు పొందారా అని ప్రశ్నించాలట. అట్టి ఆత్మానుభూతి విషయమై ఆత్మనిష్ఠ విషయమై నాకు మీరు సహాయం చేయగలరా అని పరిప్రశ్న వేయాలిట. అలా ఎవరినైతే నీవు అర్ధిస్తావో, తప్పక నీకు సహాయం చేస్తాను ఆత్మనిష్ఠ విషయమై, తప్పక నీకు ఆత్మానుభూతి పొందేట్లుగా చేస్తాను అనే వాగ్ధానం చేయగలిగేటటువంటి ఆచార్యుడని ఆశ్రయించాలి.

కాబట్టి గురుపౌర్ణమి అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగము అనేటటువంటి పద్ధతి ద్వారా గురువుగారు నీకు ఈశ్వరుడు సాక్షిగా వాగ్ధానం చేస్తున్నారు. శిష్యుడు ఈశ్వరుడి సాక్షిగా గురుపాదమును ఆశ్రయిస్తున్నాడు. శరణాగతుడౌతున్నాడు. చరణాగతి కాదు అది, శరణాగతి. అంటే సంజ్ఞారూపకంగా కాళ్ళుపట్టుకుని ప్రార్ధిస్తున్నాం అన్నమాట. ఇంక అంతకుమించి ప్రార్ధించడానికి వేరే మార్గము లేదు కాబట్టి.

హృదయపూర్వకమైనటువంటి నివేదన, శరణాగతి. అటువంటి పద్ధతిగా మనం గురువును ఆశ్రయించాము. మానసిక ఆశ్రయాన్ని పొందటం. మనస్సుని హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమగమ్యం.

కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే మనస్సుని హృదయస్థానమందు నిలిపి వుంచి స్వరూపజ్ఞాన విశేషంచేత నీవు జీవించడం. అట్లా జీవనం ఎవరైతే చేస్తారో వాళ్ళు సరియైనటువంటి విధానంలోకి ప్రవేశిస్తారనమాట. అటువంటివారు అతికుశలురైనటు వంటి గురువును ఆశ్రయిస్తున్నారు.

గురువు ఎటువంటి వాడయ్యా అంటే శిష్యునిలో ఏర్పడేటటువంటి కొద్దిపాటి మార్పులని కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్ధత ఆయన దగ్గర వుంది. అలా చూస్తేనే గ్రహిస్తాడు. వింటూనే గ్రహిస్తాడు. వినకుండా కూడా గ్రహిస్తాడు. అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు. నిన్ను నీడలాగా వెంబడిస్తూ వుంటాడు. నీ హృదయస్థానంలోనే నిలకడైనటువంటి స్థానం కలిగి వుండి నీలో కలుగుతున్నటువంటి మార్పులన్నిటినీ గ్రహిస్తాడు. ఆ రకంగా నువ్వు గురువుని నీ హృదయస్థానంలో నిలుపుకోవాలి.

ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని సంపాదించాలి. నైపుణ్యాన్ని సంపాదించాలి. అప్పుడేమౌతావు. సర్వార్పణ అయిపోతావు అనమాట. అట్లా ఎవరైతే సర్వార్పణైనటువంటి శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళు ఉత్తమగతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది.

ఇంకా ఇందులో ఒక మర్మగర్భమైనటువంటి విశేషం కూడా వుంది. నూటికో కోటికో అనడంలో ఒక ఉద్దేశ్యం వుంది. తెలుసా మీకు ఎవరికైనా? సాధారణంగా అందరూ అంటుంటారు – ఎక్కడో నూటికో కోటికోనండీ అంటుంటారు. అంటే శతజన్మలకి ఒకసారి ఈ అవకాశం వస్తుంది.

వందసార్లు పుట్టి పోతే, శత జన్మలకు – శతజన్మల ఆయుర్దాయం – వంద వందలు – అంటే ఎంత- పదివేల సంవత్సరాలకి ఒకసారి నీకు ఈ ఆత్మనిష్ఠని పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది. అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధకాలని ఉద్దేశించి, ఏదో ఒక సమస్యలనుద్దేశించి, ఏదో ఒక తాత్కాలికమైన అంశాలని ప్రాధమ్యాలుగా స్వీకరించి ఆత్మానుభూతి కొరకు చేసేటటువంటి ప్రయత్నాన్ని విరమించడం అనేది అత్యంత హీనమైనటువంటిది. ధన్యత చెందే అవకాశం శతజన్మలకి ఒకసారి వస్తుంది.

ఇంకా కోటికో అంటాం.. తెలుసా మీకెవరికైనా. ‘కోటికో’ అనడం వెనక ఉద్దేశ్యం ఏమిటంటే ఒక్కొక్క పర్యంతము క్రిమికీటకాదుల జన్మలతో గనక నువ్వు ప్రారంభించినట్లయితే కోటి జన్మలకి ఒకసారి కూడా లభించే అవకాశం వుండదు. అన్నిసార్లు పుట్టిపోతూ వుంటావు. ఏ వంద జన్మలకో, ఏ కోటి జన్మలకో గాని నీకు ఆత్మనిష్ఠని పొందాలి అనేటటువంటి బలమైన నిర్ణయం కలగడం లేదు.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 34 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ Kathoupanisad (1)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము – ప్రేయోమార్గము – 23 🌻

అంత ప్రభావశీలమై అవిద్యా బలము, మోహము యొక్క బలము, బంధకారణమైనటువంటి సంసారరూప భ్రాంతి, జగత్ భ్రాంతి జీవులనన్నిటినీ పరివేష్టించి తనలోనే ఇముడ్చుకుని జననమరణ చక్రమునందు బాధితమయ్యేట్లుగా చేస్తుంది కాబట్టి దీని యొక్క విలువను తెలుసుకోమని యమధర్మరాజు బోధిస్తున్నారు.

వివేకవైరాగ్యములు, శమదమాది సద్గుణములు, ముముక్షత్వము గలవారు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులైనట్లుగా శాస్త్రజ్ఞానమొకటే గాక అనుభవజ్ఞానము కలవారు మాత్రమే ఆత్మోపదేశము చేయుటకర్హులని విశదమగుచున్నది. శాస్త్రజ్ఞానమున్నవారు చాలామంది వుండవచ్చును. వారందరును ఆత్మను గురించి బాగుగా చెప్పలేరనియే తెలియుచున్నది.

ఆత్మసాక్షాత్కార మొనర్చుకొనిన అనుభవజ్ఞానులు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధింపగలరు. అందుచేతనే ఆత్మ తత్వమును బోధించువారు అరుదుగా నుందురు అని చెప్పబడినది. భగవద్గీత కూడ ‘తత్వదర్శినః’ తత్వదర్శినులైన నీకు జ్ఞానబోధ చేయుదురని చెప్పుచున్నది.

ఇప్పటివరకు చెప్పిన అంశాలని మనం ఒకసారి విచారణా చేద్దాం. ఈ ఆత్మవిచారణ చేయాలి అంటే ఒక ప్రాధమిక నియమం వుంది. ఏమిటా ప్రాధమిక నియమం అంటే? ఎవరైతే బోధిస్తున్నారో వారికి కొన్ని లక్షణాలు వుండాలి. అలా లేనటువంటి వాళ్ళని గనక మనం ఆశ్రయించినట్లయితే ఈ ఆత్మబోధని అందుకోవడం కష్టతరమవుతుంది.

కాబట్టి మనం ఆత్మవిచారణ కొరకు, ఆత్మోపదేశము కొరకు, ఆత్మ బోధ కొరకు, ఆత్మనిష్ఠ కొరకు, ఆత్మానుభూతి కొరకు, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కొరకు ఏ గురువునైతే ఆశ్రయిస్తున్నామో ఆ గురువుకి వుండవలసినటువంటి లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే సరియైన గురువుని, తగుపాటి గురువుని – రెండు లక్షణాలు వుండాలి ఎప్పుడూ కూడా. సరియైన గురువుని ఎంపిక ఛేసుకోవాలి. అట్లాగే తగుపాటి గురువుని కూడా ఎంపిక చేసుకోవాలి. 

ఇప్పుడు మనమందరం తెలుగుభాషలో మాట్లాడుకుంటే మనందరికీ బాగా అర్ధమవుతోంది. ఒక అరబ్బు దేశంలో వున్నటువంటి అరబ్బీ భాషలో మాట్లాడేటటువంటి గురువుగారిని ఎంపిక చేసుకున్నారు అనుకోండి ఏమవుతుంది? ఆయన చెప్పేది మనకర్ధం కాదు, మనం చెప్పేది ఆయనకి అర్ధం కాదు. కాబట్టి తగుపాటి గురువై వుండటం కూడా అవసరం 

ఇంకొకటి ఏమిటీ? నీవు నిష్కామ కర్మ అనేటటువంటి లక్ష్యంలో నువ్వు గనక జీవించేటటువంటి ప్రమాణాన్ని స్వీకరించినవాడివైతే సకామ్య గురువుని గనక ఆశ్రయించావనుకోండి. అప్పుడు ఆయన బోధించేటటువంటి బోధావిధి నీకు సరిపడదనమాట. 

కాబట్టి ఎటువంటి గురువును ఆశ్రయిస్తావు అనేది చాలా ముఖ్యం. యోగపాఠం నేర్చుకోవడానికి యోగాసనాలు మాత్రమే నేర్పేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళావనుకోండి అప్పుడు ఆయన శరీరిక దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యంగా పాఠం బోధించేటటువంటి గురువునే పొందుతావనమాట. 

ఈ రకంగా ఎనిమిది రకాలైనటువంటి గురువులు వున్నారు. కామ్యక గురువు, వాచక గురువు, సూచక గురువు, నిషిద్ధ గురువు, పరమ గురువు, నిజ గురువు ఈ రకంగా రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు. ఇట్లా ఎనిమిదిమంది గురువులు వున్నారనమాట – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

 

🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 35 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

మరి ఈ ఎనిమిది రకాలైనటువంటి గురువులలో ఎవరిని ఆశ్రయించాలి అనే సందేహాన్ని ఈ లక్షణాలలో తీరుస్తున్నారనమాట. 

వివేక వైరాగ్యములు, శమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అంటే సాధనా చతుష్టయ సంపత్తియందు నిష్ణాతుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి. నిత్యానిత్య వస్తువివేకము, ఇహమూత్రార్ధ ఫలభోగ విరాగము, శమాదిషట్కసంపత్తి, ముముక్షత్వము – ఈ నాలుగు లక్షణాలు కలవారు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు. 

వీటిలో ఈ నాలుగూ కాకుండా శాస్త్రజ్ఞాన విధానమని ఒకటి వున్నది. అంటే అర్ధం ఏమిటంటే షడ్ దర్శనాలయందు ప్రవేశం వున్నవాళ్ళందరూ గురువులే. 

అంటే సాంఖ్య, మీమాంస (ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస) , యోగ దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము ఈ షడ్ దర్శనాలు కూడా – ఈ షడ్ దర్శనాల గురించి చెప్పేవాళ్ళు కూడా గురువులే.

ఇంకేంటిట? ఇవి కాక షట్ శాస్త్రములు వున్నాయి. అంటే వ్యాకరణము ఇత్యాది శాస్త్రములు. ధర్మ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము (జాతక శాస్త్రము), ప్రశ్నా శాస్త్రము ఇట్లాంటి కామ్యక పద్ధతులుగా ఉండేటటువంటి అంశాలతో కూడుకున్నటువంటి శాస్త్రములు కూడా వున్నాయి. కాబట్టి మరి ఒకాయన దగ్గరికి వెళ్ళారనుకోండి. 

ఏమండీ మీకు ఆ గ్రహాలు బాలేదు, ఈ గ్రహాలు బాలేదు. ఆ గ్రహాల శాంతి కొరకు ఇలా చేయండి. ఈ గ్రహాల శాంతి కొరకు అలా చేయండి. ఆ రకమైన ఉపాసనా విధిని అనుసరించండి అనేటటువంటి పద్ధతిగా వుండే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండీ మీరు ఆత్మోపదేశం చేయండి. ఆత్మనిష్ఠ నాకు కావాలి. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలి అని అడిగారనుకోండి అది సాధ్యమయేటటువంటి అంశం కాదు.

కాబట్టి శాస్త్ర జ్ఞానం, ఈ ప్రపంచములో అందరికీ ఆత్మవిషయం మీద ఎంతో కొంత పరిజ్ఞానం వుంటుంది. ఆత్మ వున్నది అని అందరూ ఒప్పుకుంటారు. కాని స్వయముగా ఆత్మ నిష్ఠ, స్వయముగా ఆత్మానుభూతి కలిగినటువంటివారిని ఆశ్రయించినపుడు మాత్రమే, వారు మాత్రమే దాని గురించి సరియైనటువంటి బోధని అందించగలుగుతున్నారు.

కాబట్టి, శాస్త్ర పరిజ్ఞానం ఒక్కటే సరిపోవడంలేదు. ఏమండీ, నేను మా గురువుగారి దగ్గర 30 సంవత్సరాలపాటు ఉపనిషత్తులు అధ్యయనం చేశాను. బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశాను. కాబట్టి నేను బోధిస్తాను అన్నారనుకోండి, మంచిది , స్వీకరించవచ్చు. ఇలాంటి ప్రయత్నం మనం హైదరాబాదులో చేశాం. 

మాండూక్య ఉపనిషత్తు చెప్పారు. ఒక వారం రోజులపాటో, ఒక పది రోజులపాటో రెగ్యులర్ గా పాఠం చెప్పారు. గురువుగారు ఏం చెప్పారో అదే చెప్తారు. మక్కీకి మక్కీ. అక్షరదోషంలేకుండా యధతథంగా చెప్తారు. వాళ్ళేం ధారణ చేశారో ఆ ధారణ చేసినదానినే చెప్తారు. 

అయ్యా తమకు ఆత్మానుభూతి కలిగిందా, తాము ఆత్మనిష్ఠులేనా, మాకు ఆ రకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పగలరా అంటే ఇంకా మేము అది అందుకోలేదండీ అంటారు. అంటే ఉపనిషద్ పాఠం పూర్తయిపోయింది, కాని ఆత్మానుభూతి జరగలేదు. అంటే ఏమైనట్లు. లక్ష్యం సిద్ధించలేదు. కాబట్టి శాస్త్రజ్ఞానం అవసరమే. 

ఆత్మానుభూతికి ఆత్మవిచారణకు శాస్త్రాజ్ఞానం అనేది అవసరమే. అనవసరం కాదు. కాని ఒట్టి శాస్త్రజ్ఞానమే సరిపోదు. కాబట్టి అనుభవజ్ఞానం కలవారు మాత్రమే ఆత్మోపదేశము చేయుటకు అర్హులు.

అందుకని నచికేతుడు ఈ వైవశ్వతుడుని ఆశ్రయించాడు ఆచార్యుడిగా. ఎందుకంటే ఇంతకుమించినటువంటి ఉత్తమమైనటువంటి గురువు లేడు కాబట్టి. ఇంకేమిటటా? ఆత్మ గురించి బాగుగా చెప్పలేరనియు తెలియుచున్నది. 

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

25.Aug.2020


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 36 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

ఇక్కడ దీనికొక ఉదాహరణ చెప్తా. తల్లి పిల్లవాడికి ఆహారాన్ని అలవాటు చేసే విధానాన్ని మనం గనక చూస్తే మొట్టమొదట పిల్లవాడు ఆ పాలు తాగే దశ నుంచి ఘనమైన ఆహారం తినే దశకి మారలేడనమాట. ఎందుకంటే సులభంగా ఆహారాన్ని గ్రహించడం దగ్గరి నుండి కొద్దిగా కష్టపడుతూ ఆహారాన్ని గ్రహించేటటువంటి పద్ధతికి మారాలనమాట. జీవుడికి మొదటి నుంచీ ఈ దురభ్యాసం వుంటుందనమాట. కష్టమంటే చాలు వెనక్కి పారిపోతూ వుంటాడు. అన్నం తినడమైనా సరే అంతే. 

కాబట్టి చాలామంది పెద్దవాళ్ళు అయిన తరువాత కూడా ఇంకా చాక్లేట్లు తింటూనే వుంటారు. కారణం ఏమిటంటే అవి సులభంగా తినొచ్చు కాబట్టి. కొద్దిగా కష్టతరమైన ఆహారాన్ని తినాల్సిన అగత్యం వచ్చినప్పుడు వెనుకంజవేస్తూ వుంటారనమాట. కష్టపడాలంటే జీవుడికి విముఖత కలుగుతుందనమాట.

తల్లి ఏం చేస్తుందంటే, మొట్టమొదట తాను తినునట్లు నటిస్తుంది. బాగున్నట్లుగా కూడా భావ వ్యక్తీకరణ చేస్తుంది. ఆ భావ వ్యక్తీకరణని పిల్లవాడు అందుకుంటాడు. ఎందుకంటే పిల్లవాడికి అప్పటికి భాషరాదు. ఆరునెలల వయసు దాటేటప్పటికి ఘనాహారం పెట్టాలి. 

మరి ఘనాహారం పెట్టేటప్పుడు అది బావుంది అని ఆ పిల్లవాడికి అర్ధమయేటట్లు చెప్పాలి. మరి ఎట్లా చెప్తుంది అంటే భావవ్యక్తీకరణ ద్వారా, అనుభూతిని వ్యక్తీకరించడం ద్వారా అవసరం అయితే తాను తిని చూపిస్తుంది. తద్వారా.. ఓహో! వాడికి తెలుస్తుందనమాట – ఇది తినే వస్తువే అనేటటువంటి అర్ధం తెలుస్తుంది. 

అట్లా ఒకటి రెండు మూడు నాలుగు అయిదు వస్తువులను పెంచుకుంటూ పోతుంది. ఆహారపదార్ధాలను మార్చుకుంటూ పోతుంది. ఆహార పదార్ధాలను మార్చినప్పుడల్లా ఈ సమస్య వస్తుంది. వాటిల్లో కొన్నిటికి అతను ఒప్పుకుంటాడు, కొన్నిటికి ఒప్పుకోడు. 

కారణం ఏమిటీ అంటే స్వభావరీత్యా అతనికి కొన్ని రుచుల యెడల కలిగినటువంటి వైముఖ్యత, విముఖత. తత్ ప్రభావం చేత కొంతమంది పాలన్నం తింటారు. కొంతమంది మజ్జిగన్నం తింటారు. కొంతమంది ఆ రెండూ తినరు. కొంతమంది కేవలం పప్పన్నం మాత్రమే తింటారు. కొంతమంది పచ్చడన్నమే తింటారు – చిన్నపిల్లలు కూడా.

ఆరునెలలప్పుడు కూడా పచ్చడన్నం తినేస్తారు. మరి ఆ రకమైన స్వభావం వాడిలో బలంగా వుంటుందనమాట. సాత్వికమైన ఆహారాలని కొంతమంది ఇష్టపడేవారు వుంటారు. కొంతమంది రాజసికమైన ఆహారాలని ఇష్టపడేవారు వుంటారు. కొంతమంది తామసికమైన ఆహారాలని ఇష్టపడేవారు వుంటారు.

మరి వారికి ఏ రకమైనటువంటి బుద్ధి వికాసం లేకపోయినప్పటికీ ఆ యా ఆకర్షణల బలం వాడిలోపల ప్రజ్ఞ మీద, చైతన్యం మీద ఆచ్ఛాదితమై పనిచేస్తూ వుంటుంది. తత్ ప్రభావం చేత ఆ స్థాయి నుంచే ప్రియ అప్రియములేర్పడటం మొదలవుతాయి. 

మరి ఆ ప్రియ అప్రియముల ప్రభావం చేత జీవితం అంతా ఎలా వుంటాడు? అవే బలవత్తరంగా మారిపోతాయి. ఎదిగినా కూడా మార్చుకోలేనంతగా ప్రతిబంధకములైపోతాయి. మరి అవి ప్రతిబంధకములైతే ఎనిమిదేళ్ళ వయసు దాటే వరకూ కూడా ఇక వాడిని మార్చలేం. 

ఏమన్నా మారితే ఎనిమిదేళ్ళకు మారాలి. అప్పుడు కూడా మారలేదనుకోండి ఇక పదహారేళ్ళకు మారాల్సిందేవాడు. పదహారేళ్ళకు కూడా కొంతమంది మారనివాళ్ళు వుంటారు జీవితకాలంలో. అప్పుడు ఇక 24 ఏళ్ళకు మారాల్సిందే. 

ఈ ఎనిమిది అనే సంఖ్యామానం మీద నడుస్తూ వుంటుంది అనమాట. కాబట్టి మరి ఈ ఆహారము యొక్క అనుభూతి ఈ తల్లి ఎట్లా అయితే అనుభూతి పొంది, ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ అందించేటటువంటి ప్రయత్నం చేసిందో – చిన్న ఆహారం విషయంలోనే ఇలా వుంటే మరి ఆత్మానుభూతి విషయంలో ఎలా వుండాలి. దానిని మాటలతో ఎలా చెప్తాం? – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ#సద్గురువిద్యాసాగర్

26 Aug 2020


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 37 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 1 🌻

ఒకవేళ చెప్పినా “తద్దూరే, తన్నైదూరే” అంటే దానికంటే దూరం లేదు, దాని కంటే దగ్గర లేదు . 

“తన్నైజతి” దానికెంతో ప్రయాణం చేసినా కూడా దొరకదు. అసలు ప్రయాణమే చెయ్యకుండా కూడా దొరుకుతుంది. ఇలాంటి పద్ధతిలో ఆత్మవస్తువు గురించి చెప్పడం జరుగుతుంది. ఇది నిత్యవస్తువు అంటే.

మరి ఎప్పుడూ వుంది ఎప్పుడూ లేదు. ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది ఎప్పుడూ ప్రకాశించదు. ఇలాంటి తత్ భిన్న వ్యతిరేక లక్షణాలని ఒకేచోట ప్రతిపాదిస్తూ ఆత్మ గురించి చెప్పబడుతూ వుంటుంది. 

మరి ఈ విధంగా ఒకేసారి చెప్పినప్పుడు సరియైనటువంటి విధానం అందుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఎవరైతే వుంటారో, వారు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధించ గలుగుతారు. అందుచేతనే ఆత్మతత్వమును బోధించువారు అరుదుగానుందురు.

మీరొక కోటిమంది గురువులని – జీవితంలో ‘గురువు’ అన్నవాళ్ళ అందరి దగ్గరికీ వెళ్ళారనుకోండి, గురువులందరూ గురువులే. ఎవరూ కాదనలేరు. కానీ ఇందులో అనేక రకాలైనటువంటి గురువులు వున్నారని ముందే చెప్పుకున్నాం కదా. వాళ్ళందరిలో కూడా ఒకానొకడు మాత్రమే కేవలము ఆత్మానుభూతిని గురించి మాత్రమే పాఠం చెప్పేటటువంటి వాడు వుంటాడు. 

వాడి దగ్గర మిగిలిన అంశాలను స్పృశించారనుకోండి, ఏం ప్రయోజనం లేదు.వాళ్ళ దగ్గర ఆ షాపులో అవి దొరకవనమాట. వజ్రాల షాపుకెళ్ళి ఏమండీ కందిపప్పు ఇస్తారా, పెసరపప్పు ఇస్తారా అంటే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. మా దగ్గర అటువంటివిలేవండి. ఆ స్టాక్ లేవు మా దగ్గర అంటారు. 

అట్లాగే ఆత్మానుభూతి, ఆత్మోపదేశము, ఆత్మనిష్ఠ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము – జ్ఞానమార్గమునకు సంబంధించినటు వంటి బోధావిధిని అనుసరించేటటు వంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వాళ్ళని మీరు ఎన్ని సంవత్సరాలు ఆశ్రయించినా, ఎన్ని రకాలుగా స్పృశించినా, ఏ కాలంలో అయినాసరే వాళ్ళు కేవలము జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమె బోధిస్తారు. 

మిగిలిన అంశాలు వాళ్ళ దగ్గర ప్రయోజనం లేదు. భగవద్గీత కూడా ఏం చెప్తోంది ”జ్ఞానినస్ తత్వదర్శినః”. జ్ఞాని అని చెప్పాలి అంటే అతడు తత్వదర్శియై వుండాలి.

తద్వి ప్రణిపాతేన పరి ప్రణ్నేన సేవయా ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శినః”

అనే శ్లోకంలో వుంటుందనమాట ఇది. ఇది మీరు అనుసరించి ఆశ్రయించేవాడు కూడా పరిప్రశ్నతో ఆశ్రయించాలి. 

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ#సద్గురువిద్యాసాగర్

27 Aug 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 38  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 2 🌻

బోధించేటటువంటి జ్ఞాని తత్వదర్శి అయినపుడు మాత్రమే ఆ రకమైనటువంటి దర్శన శాస్త్రాన్ని నీ అనుభూతి జ్ఞానం ద్వారా అందిస్తాడు.

ఈ రకమైనటువంటి లక్షణాలు ఆశ్రయించేటటువంటి శిష్యుడిలోనూ, బోధించేటటువంటి గురువులోనూ సుస్పష్టంగా వుండాలి అనేటటువంటి అధికారిత్వాన్ని గురించి సమదర్శి అయినటువంటి తత్వవేత్త అయినటువంటి వైవశ్వతుడు/యమధర్మరాజు నచికేతునియందు ప్రస్తావిస్తూ వున్నారు.

నచికేతా: 

ఆత్మజ్ఞానములేని సామాన్య మానవుని చేత ఈ ఆత్మతత్వము ఉపదేశింపబడినను అట్టి ఉపదేశము పొందినవానికి ఎన్ని విధముల ఆలోచించినను ఈ ఆత్మతత్వము తెలియబడదు. ఆత్మ సూక్ష్మ పదార్ధములకన్న అతి సూక్ష్మమైనదగుట చేత శాస్త్ర జ్ఞానముచే తర్కించుటకు లేక ఊహించుటకు వీలుకానిది. 

ఆత్మ సాక్షాత్కారము పొందిన ఆచార్యుని చేత బోధింపబడిన వ్యక్తికి ఆత్మ విషయమున ఉన్నదా లేదాయను సంశయములు నివృత్తియై ఆత్మజ్ఞానము కలుగును. అనుభవ జ్ఞానహీనులు ఆత్మను గురించి బోధించిన, గ్రుడ్డివారు ఏనుగును గురించి వర్ణన చేసినట్లుగానే యుండును. 

ఆత్మ విషయక జ్ఞానము తర్కము చేత త్యజింపరాదు. వంట ఇంటినుండివచ్చు పొగను చూచి నిప్పు లేనిదే పొగ రాదనీ తర్కించి వంటఇంటిలో నిప్పున్నదని ఊహించుచున్నాము. కాని ఆత్మ అతిసూక్ష్మమగుట వలన ఆత్మ విషయక చిహ్నములు ప్రత్యక్షము గావు. 

అందుచేత తర్కము మూలమున ఆత్మను తెలిసికొనలేము. అట్టే తర్కము వలన ఆత్మను నిరసింపరాదు. తర్కముకంటే భిన్నమైన ఆత్మవిదుల ఉపదేశము వలన కలిగిన జ్ఞానము సరియైనది.

ఇప్పుడు కొన్ని అంశాలని మరల ప్రస్తావిస్తున్నారు. ఏ ఉపనిషత్తైనా కూడా షట్ ప్రమాణ సహితంగా బోధించబడుతూ వుంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారనమాట. 

మనకి ప్రత్యక్షప్రమాణం అంటే అర్ధం ఏమిటంటే ఇంద్రియముల ద్వారా తెలుసుకొనగలిగినదంతా ప్రత్యక్ష ప్రమాణమే. చూడటం ద్వారా గాని, వినడం ద్వారా గాని, స్పృశించడం ద్వారా గాని, రుచి చూడటం ద్వారా గాని, లేదా వాసన చూడటం ద్వారా గాని ఈ రకమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాత్మకమైనటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా మనం గ్రహించేదంతా ప్రత్యక్ష ప్రమాణం. మరి ఆత్మని వీటితో నిర్ణయించవచ్చా? అంటే ఆ అవకాశం లేదు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

28 Aug 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 39  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 3 🌻

ప్రత్యక్ష ప్రమాణంగా ఆత్మను నిరూపించలేము. అంటే ఎలాగండీ? ఆత్మ కదలదు. మొదటి లక్షణం. 

రాయి కదలదు. మరి కదలనివి భూమండలంలో ఏం తెలుసంటే? రాళ్ళు కదలవు. కొండలు కదలవు. ఆత్మ కొండవలే వుంటుంది అన్నామనుకోండి. తప్పు. పోయింది. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అన్నాం. ఆత్మ అన్నింటినీ కదిలించగలదు అంటే? వాయువు అన్నింటినీ కదిలించగలదు కదా. 

కాబట్టి ఆత్మ వాయువు వలే వుంటుంది అన్నామనుకోండి. పొరపాటు. తేడా వచ్చేసింది. అలా కుదరదు. మరి ప్రత్యక్ష ప్రమాణానికి ఇంకేం చెప్పారు? నిప్పు – పొగ. ఎక్కడైనా సరే ఒక పొగ వస్తోందంటే నిప్పుంది అని ఎవరైనా గానీ చెప్తారనమాట. కానీ అట్లా అనుమాన ప్రమాణంతో కూడా ఇది వీలుకాదు. 

ఇది రెండవ ప్రమాణం అనమాట. మనం దగ్గరికి వెళ్ళి నిప్పుందో లేదో చూడలేదు. దూరం నించీ పొగ వస్తోందని చూశాం. అది వంటిల్లు కావచ్చు, ఎక్కడైనా దూరప్రదేశంలో కావచ్చు. 

తద్వారా నీవేం తెలుసుకున్నావు? వాసన చేత అక్కడ వంట జరుగుతోందని, వంట జరగాలంటే నిప్పుందని, వెళ్ళి చూడక పోయినప్పటికీ కూడా ఊహించావు. ఇదేమిటిదీ? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణంతో కూడా దీనిని మనం నిర్ణయించలేము.

రెండు ప్రమాణాలకి సంబంధించినటు వంటి ఉపమానాలని ఇక్కడ వేశారనమాట. గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. నలుగురు గ్రుడ్డివారు ఏనుగు దగ్గరికి వెళ్ళారు, నాలుగు వైపుల నించి ఏనుగును పట్టుకోవడానికి. 

ఒకాయన తొండాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఏమన్నాడు? ఏనుగంటే మెత్తగా వుంటుంది అన్నాడు. ఒకాయన తోకను పట్టుకున్నాడు. ఏనుగంటే కుచ్చులాగా వుంటుంది అన్నాడు. ఒకాయన కాళ్ళు పట్టుకున్నాడు. 

ఏనుగంటే స్థంభమువలే వుంటుందీ అన్నాడు. ఒకాయన ప్రయత్నించి ఏనుగుమీదకి ఎక్కాడు. ఏనుగంటే ఎత్తుగా వుంటుందీ అన్నాడు. అప్పుడేమయిందీ? ఈ నాలుగు లక్షణాలు ఏనుగుయొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం లేదు.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

29 Aug 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 40  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 4 🌻

ఈ రకంగా ఆత్మ వస్తువు గురించి శాస్త్ర జ్ఞాన పద్ధతిగా, తర్క పద్ధతిగా – రెండు పద్ధతులున్నాయట. 

శాస్త్రం ఎప్పుడూ నిన్ను తర్కానికి సంబంధించిన జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వల్ల నీలో బుద్ధి వికాసం పూర్తవుతుంది. ఇది శాస్త్ర ప్రయోజనం. ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా ఆ అధ్యయనము నీ బుద్ధి వికాసాన్ని పూర్తిచేస్తుంది – తార్కికమైనటువంటి పద్ధతిలో. 

అసలు ఈ తర్కానికి సంబంధించినటువంటిది ఒక సూత్రం వుంది. ఏమిటంటే తర్కానికి నిలబడనిది జ్ఞానం కాదు. లాజికల్ ఈక్వేషన్ [Logical Equation] కి నిలబడకపోయినట్లయితే – తర్కానికి నిలబడనటువంటిది జ్ఞానం కాదు. 

ప్రక్కనే దానికి కంటిన్యుఏషన్ ఇంకొక పాదం కూడా వుంటుంది. తర్కించేవాడు జ్ఞాని కాదు. నువ్వు తర్కిస్తూ వున్నంతకాలం నువ్వు ఆత్మజ్ఞానివి ఎప్పటికీ కాలేవు అని అసలు తర్కమే చెయ్యనంటావా అప్పుడు నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు.

కాబట్టి “శాస్త్ర దృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయమ్”. ఇది క్రమ ముక్తికి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే తప్పక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. 

అధ్యయనం చేసి బాగా తర్కించాలి. తర్కించగలిగిన విధానములు ఎన్ని వున్నాయో ఆ షట్ ప్రమాణ సహిత పద్దతిగా వాటిని బాగా తర్కించాలి. ఆ తర్కించడం వల్ల ఏమవుతుంది? నీ బుద్ధివికాసం పూర్తవుతుంది. గిన్నెకి నెయ్యి ఆధారమా , నేతికి గిన్నె ఆధారమా.

ఒక నెయ్యి గిన్నె పట్టుకున్నాడట ఒకాయన. నెయ్యి గిన్నె పట్టుకుని ఈ ప్రశ్న వచ్చిందట. ఏమిటదీ? గిన్నె – గిన్నె కాదిది – నేతి గిన్నె. నేతికి గిన్నె ఆధారమా, గిన్నె కి నేయి ఆధారమా అని బోర్లించాడు. ఇప్పుడు గిన్నెలో వున్నా నెయ్యంతా ఏమైంది? నేలపాలయింది. అర్ధమైందా? మన తర్కం అంతా ఇలానే వుంటుంది. 

నెయ్యి ప్రధానమా గిన్నె ప్రధా నమా మనకిప్పుడు. నెయ్యి ప్రధానం. కాని గిన్నె ప్రధానం అనుకుని, గిన్నెని పట్టుకుని నెయ్యి పారబోశాం. ఇట్లా ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలియాలి అంటే తప్పక తర్కాన్ని ఆశ్రయించాలి.

అంటే ఈ విచారణలో కొన్ని విమర్శలున్నాయి. ఈ విమర్శ ఎలా చేయాలి అంటే జడచేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ, కార్యకారణ విమర్శ, చేతనా అచేతన విమర్శ, నిత్య అనిత్య విమర్శ, ఆత్మ అనాత్మ విమర్శ, సదసత్ విమర్శ, దృగ్ దృశ్య విమర్శ, ధ్యాత-ధ్యేయము-ధ్యానము అనేటటువంటి త్రిపుటి యొక్క విమర్శ, పంచకోశ విచారణ, అవస్థాత్రయ విచారణ, శరీరత్రయ విచారణ , దేహత్రయ విచారణ – ఈ రకంగా అనేక పద్దతులుగా ఈ తర్కాన్ని అనేటటువంటి అవధిని నిన్ను దాటించేటటువంటి ప్రయత్నం చేస్తారనమాట ఆత్మా విచారణలో. ఇన్ని రకాలైనటువంటి విమర్శలని నీకు సాధికారత కలిగేటట్లుగా చేస్తారనమాట. 

ఇది ఆత్మజ్ఞానాన్ని బోధించే విధానం. నీకు ఎట్లా చెప్పాడయ్యా? నువ్వు ఏది చెప్పినా దానిని ఒక విమర్శ రీత్యా దానిని నిరూపించడమో, ఖండించడమో, నిరసించడమో చేస్తాడనమాట. 

తద్వారా ఏమౌతావు నువ్వు? ఆ విమర్శలో బాగా బలవత్తరమైనటువంటి సమర్ధతని, బుద్ధిబలాన్ని నువ్వు సాధిస్తావనమాట. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

30 Aug 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 41  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 5 🌻

మీరందరూ తప్పక ఈ విమర్శ చేసేటటువంటి విధానములన్నింటిలో పూర్ణజ్ఞానమును పొందాలి. ఏమిటవి? పంచకోశ విచారణ, దేహత్రయ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ విచారణ, ధ్యాన ధ్యాతృ ధ్యేయ విచారణ, జడచేతన విచారణ, ఆధార ఆధేయ విచారణ, నిత్యానిత్య విచారణ, అత్మానాత్మ విచారణ, కార్యకారణ విచారణ, సదసద్ విచారణ, దృగ్ దృశ్య విచారణ – ఇలాంటివాటన్నింటినీ పూర్తిచేయాలి. 

ఇవన్నింటినీ ఎప్పుడైతే నీవు పూర్తి చేస్తావో, వీటన్నింటిలో నుండి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే వుందో, ఆ అనుభవం నిన్ను ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది. అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరుస్తుంది. అందుకని వీటన్నింటినీ బాగా నీకు అధ్యయనం చేయిస్తారనమాట. ఈ అధ్యయనం చేయించడం వల్ల – సాంఖ్య విచారణలో వున్నటువంటి విశేషణం ఇదే – 

ఈ సాంఖ్య విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో, నీలో ఏవేవి నిరసింపబడాలో, ఏయే వాటి నుంచి నీవు అధిగమించాలో, వాటన్నింటినీ నీవు అధిగమించిన స్థితిలో నిలబడతావనమాట. తత్ ప్రభావం చేత నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవజ్ఞానం చాలా ముఖ్యము. అందుకని – ఎందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము.

ఎందుకని ఆ మాట అంటున్నారంటే ఆత్మ సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము. ఇక ఆత్మ కంటే సూక్ష్మమైనది లేదనమాట. అది సర్వ వ్యాపకము. అన్నింటికంటే సూక్ష్మము. మరి చిహ్నముల ద్వారా దానిని ప్రత్యక్షమయ్యేటట్లు చెయ్యగలుగుతామా? అంటే అర్ధం ఏమిటీ? సరే. 

ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాని అవేవీ సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు. అంటే అర్ధం ఏమిటీ? 

ఒకాయన ఒక చేతిలో కొబ్బరికాయ పట్టుకుని వుంటాడు. ఒకాయన దానిని తీక్షణంగా చూస్తూ వుంటాడు. చూడగా చూడగా చూడగా చూడగా చూపు ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో వున్న కొబ్బరికాయ క్రిందపడిపోతుంది. 

ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా? ఒకాయన కళ్ళకు గంతలు కట్టుకుని తన ఎదురుగుండా వున్నటువంటి పుస్తకంలో వున్న వేదాన్ని అంతా చదివేస్తాడు. దీన్ని బ్లైండ్ రీడింగ్ [blind reading] అంటారు. మరి ఆయనకి ఆత్మానుభూతి వున్నట్లేనా?

ఒకాయనకి దూరశ్రవణ విద్య. అంటే మనం ఫోన్ లో ఎట్లా మాట్లాడుకుంటున్నామో, ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకో గలుగుతాడు. అలాంటి దూరశ్రవణ విద్య వున్నటువంటివాళ్ళు వుంటారు. 

అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వొకింగ్ – ఇంట్యూషన్ [invoking – intuition] అంటారు దీన్ని. ఈ ఇంట్యూషన్ [intuition] ద్వారా చెప్పేటటువంటి విధానం ఒకటి వుంటుంది. అలాగే కొంతమందికి ట్రాన్సెన్-డెన్టల్ [Transcendental Meditation] అంటారు. 

అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి నిబద్ధత కొంతమంది మానసిక వ్యవస్థలలో వుంటుంది. అట్టి మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు – తప్పక ఏం జరుగుతుందంటే – ఆ మానసిక వ్యవస్థల నుంచి వాళ్ళు ప్రేరణని పొంది, ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాన్ని చెప్తూ వుంటారు.

ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో. ఈ ప్రజ్ఞ కి చైతన్యానికి వున్నటువంటి వలయాలలో చిట్టచివరి వలయాలలో [outer periphery] ఉంటారనమాట. అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయనమాట. 

సూక్ష్మం అనగానే అనేకరకాలైన శక్తులు, అనేకరకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి – అతీత శక్తులు అతీత శక్తులు అంటారు – దేనికి అతీతం అంటే స్థూలానికి అతీతం. 

అంటే మన కళ్ళు, మన చెవులు, మన ముక్కులు, మన స్పర్శ, మన నోరు ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తెలుసుకోగలిగినదానికంటే అతీతమైనటువంటిది. అవతలిది. అలాంటిదేదైనా వచ్చినపుడు వాళ్ళు అవి చేయగలుగుతారనుకోండి. 

మరి వీటి ద్వారా ఆత్మ వున్నదని నిరూపించదగునా అంటే అట్లాంటివాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము. అత్మానుభూతిని పొందలేము. 

మరి ఎలాగండీ నిరూపణ అంటే ఇదంతా గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకున్న రీతి. వాళ్ళు పట్టుకున్నది ఏనుగును కాదా? ఏనుగు లక్షణాలు కావా అంటే ఒకానొక అంశీభూతములే. 

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

31.Aug.2020


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 42 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 6 🌻

ఆత్మ పెద్ద అగ్ని స్వరూపం అనుకోండి. సూర్యుడువంటి అగ్నిస్వరూపం అనుకోండి. అందులో నుంచి వెడలుతున్నటువంటి విస్పులింగములు (నిప్పురవ్వలు) ఏవైతే వున్నాయో అలాంటివి ఈ మహిమలు, విభూతులు. 

ఈ విభూతులన్నీ ఈశ్వర విభూతులనమాట. అవి ఈశ్వర స్థితి కలిగేముందు ఇలాంటి విభూతులు సూక్ష్మంలో నువ్వు ప్రవేశించావు అనేటటువంటి నిర్ణయం తెలియడం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటివి. వీటివల్ల ఏమీ ప్రయోజనం లేదు. యధాతధమైనటువంటి ఈశ్వరత్వం ఎటువంటిదంటే సహజ సూర్య ప్రకాశంవంటిది. 

దానియందు ఏ రకమైన మహిమలు, ఏ రకమైన విభూతులు వుండవు. ఎంతగా అయితే సమస్త సృష్టికి ఆధారభూతమై సర్వసాక్షి స్వరూపమై, కర్మ సాక్షి స్వరూపమై సూర్యుడు ప్రకాశిస్తూ వున్నాడో ఆ రకం గా ఆత్మ హృదయ స్థానంలో సహజంగా స్వచ్ఛంగా వున్నది స్వరూప జ్ఞానంతో. 

దానికి ఏరకమైనటువంటి చిన్న చిన్న – అంటే అర్ధం ఏమిటంటే – ఒక పైసా రెండు పైసలలాంటివనమాట ఇవన్న. కోట్లరూపాయల ఆస్థితో పోలిస్తే ఒకపైసా రెండుపైసలు అందుట్లో భాగమా కాదా అంటే, ఆ ఒకపైసా రెండు పైసలు కూడా అందుట్లో భాగమే. కాని కోటి రూపాయలతో పోలిస్తే ఈ ఒకపైసా రెండుపైసలు దేనికి ప్రయోజనం? ప్రయోజనం లేదు. 

కోహినూరు వజ్రానికి మన పెట్టుకునేటటువంటి రంగు రాళ్ళకీ – అదీ రాయే ఇదీ రాయే కదండీ అంటే. రాయే ఎవరుకాదన్నారు? కాని అనంతవిశ్వంతో పోలిస్తే ఇవన్నీ ఎందుకూ కొరగానటువంటివి. అంతేనా కాదా? భూమండలం మొత్తాన్నీ, నవగ్రహాలు మొత్తాన్నీ మనం రంగురాళ్ళు పెట్టుకుని ఏమార్చగలుగుతామా? ఆలోచించిచూడండి. 

మానవుడుకి భ్రాంతి ఎంత దూరం వచ్చేసిందయ్యా అంటే ఏమండీ మీకు కుజగ్రహ దోషం వుంది కాబట్టి మీరీ పచ్చ రంగు రాయి పెట్టుకోండి, ఆ దోషం పోతుంది, అంటే ఆనందపడిపోతాడు అంతే. ఓ పచ్చరాయి పెట్టుకుని నాకు కుజగ్రహ దోషం పోయింది అంటాడు.

ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నిస్తే పోతుంది గానీ – ఎందుకనీ – దైవానుగ్రహం వున్న గ్రహములేమి చేయును? అందరూ ఈశ్వరుడి మీద ఆధారపడి వున్నారు. సమస్త సృష్టీ ఈశ్వరాధారంగా వుంది. అంతేతప్ప ఎవరికివారు వ్యక్తిగతంగా ఎవరూ ఏమీ చేయలేరు. 

మరి అట్టి ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు తపమో, జపమో, ఆచరణో, విధానమో, ధ్యానమో, మరొక సాధనా క్రమమో ఆశ్రయించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని పొంది, నీ మనో బుద్ధులని అధిగమించి, నీ హృదయస్థానంలో నిలబడేటటువంటి ప్రయత్నాన్ని చేయాలేగానీ నీవు గ్రుడ్డివాడు ఏనుగును పట్టుకుని మెత్తగా వుంది, కుచ్చు వలే వుంది, స్తంభము వలే వుంది, కొండవలే వుంది అనేటటువంటి తాత్కాలికమైనటువంటి అనుమాన ప్రమాణములతో పొగ వస్తుంది కాబట్టి నిప్పు వుందని, ఇలాంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో ఈ ఆత్మని నిర్ణయించడానికి వీలు కాదు.

కాబట్టి తర్కము మూలమున ఆత్మను తెలిసికొనలేము. తర్కము బుద్ధిగతమైనటువంటిది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

01.Sep.2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 43  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 7 🌻

ఎంతకాలమైతే తర్కిస్తూ వుంటామో, అది బుద్ధి పరిధి వరకే పనిచేస్తుంది.

“బుద్ధిగ్రాహ్యమతీంద్రియం” ఈ బుద్ధిని ఎంతగా పెంచాలయ్యా, ఎంతగా ఓడించాలయ్యా – రెండు పనులు చేయాలి – దీన్ని బాగా పెంచాలి మొదటి దశలో. రెండవ దశలో ఏం చేయాలిట? ఓడించాలి. నీ బుద్ధిని నీవే ఓడించాలి. 

నీ బుద్ధియొక్క కర్మ ప్రేరితంగా ఏర్పడుతున్నవాటిని నీవే నిరసించాలి. నీవే అధిగమించాలి. అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి ఓడిపోయి సాక్షిత్వ స్థితియందు నిలకడ చెందుతుంది. 

మనోబుద్ధులు సాక్షిత్వస్థితియందు ఎవరికైతే నిలకడ చెందినాయో అట్టి సాక్షిత్వ జ్ఞానం చేత మాత్రమే ఆత్మను నిర్ణయించడానికి వీలవుతుంది. తర్కము కంటే భిన్నమైనటువంటి ఆత్మవిదుల ఉపదేశం వలన కలిగిన జ్ఞానమే సరియైనటువంటిది. ఇది చాలా ముఖ్యం. ఎవరిదగ్గరికైతే వెళితే నీకు తర్కాన్ని ఉపదేశిస్తారో వాళ్ల వలన నీవు ఆత్మోపదేశాన్ని పొందలేవు. 

ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అదెలా కుదురుతుందీ, ఇదెలా కుదురుతుందీ, అలా ఎలా కుదురుతుందీ, ఇలా ఎలా కుదురుతుందీ అనే బుద్ధిప్రచోదనం చేత జరిగేటటువంటి చర్చల వల్ల ఆత్మ యొక్క నిర్ణయం జరుగదు.

ఆత్మ నిర్ణయం జరగాలి అంటే మనోబుద్ధులు ఆగిపోయినటువంటి స్థితిలో, మనోబుద్ధులు హృదయస్థానంలో సంయమించబడినటువంటి స్థితిలో, నిర్వాణ ప్రజ్ఞా స్థితిలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అటువంటి నిర్వాణ ప్రజ్ఞను ప్రతిఒక్కరూ పొందాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్తున్నారు. 

నీవెట్టి దృఢ సంకల్పముతో ప్రలోభములకు లోనుగాక ఆత్మ జ్ఞానము నొందుటకు ధీరచిత్తముతో నుంటివో, అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!

ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. ధీరచిత్తము అంటే చిత్తములో ఏర్పడేటటువంటి వృత్తులు ఏవైతే వున్నాయో , ఆ చిత వృత్తులను నీవు అధిగమించినటువంటి వాడవైనప్పుడు మాత్రమే నీవు ఆత్మ జ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తావు. 

నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి ఉత్తమమైనటువంటి స్థితికి అర్హత సంపాదించాలీ అంటే నీకు అడ్డమైనటువంటి అంశము ఏమిటంటే చిత్తవృత్తి. కాబట్టి యోగమార్గము యొక్క లక్ష్యము ఏమిటంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం. “యోగాః చిత్తవృత్తి నిరోధకః” అనే సూత్రం ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమ్మ్ దృష్ట్యానే, ఆ లక్ష్యం దృష్ట్యానే ఏర్పరచబడింది. 

ఎవరైతే వారివారి చిత్తవృత్తులను బాగుగా, నిశ్శేషముగా నిరోధించి చిత్త ఉపశాంతి, చిత్తశుద్ధి, నిర్మలమైనటువంటి చిత్తము ఎవరైతే సాధిస్తారో, వాళ్ళు మాత్రమే సరియైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించి వాళ్ళు ఆత్మజ్ఞానమును పొందెదరుగాక! అనేటటువంటి ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ వేశారనమాట. చూడండి ఎంత దృఢంగా చెప్తున్నారో.

“అట్టి సత్యధృతివైన నీవంటి శిష్యులు మా దగ్గరకువచ్చి ఆత్మజ్ఞానమును పొందుదురుగాక!”

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

02 Sep 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 44  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 8 🌻

ఆశీఃపూర్వకమైన వాక్యమును ఇక్కడ ప్రయోగించారు. ఇది చాలా గొప్ప విశేషం. గురువు వాగ్ధానం చేశాడు అంటే వాగ్ధానభంగం జరిగేటటువంటి అవకాశమే లేదు. అది ఈశ్వర నియతితో కూడుకున్నటువంటి అంశం అనమాట. 

కాబట్టి వారు సంకల్పించరు, వాగ్ధానం చెయ్యరు. అధవా వారు సంకల్పిస్తే, వారు వాగ్ధానం చేస్తే దానికి ప్రతి అనేది సృష్టిలో వుండదనమాట. కారణం ఏమిటంటే సాక్షాత్తు వారికి ఈశ్వరుడికి భేదములేదు కాబట్టి. 

అటువంటి నియమము పాటించబడుతుంది కాబట్టి వైవశ్వతుడు అయినటువంటి యమధర్మరాజు అయినటువంటి సమదర్శి అయినటువంటి సమవర్తి అయినటువంటివాడు చక్కని ఆశీఃపూర్వకమైనటువంటి వాక్యాన్ని అక్కడ ప్రయోగించారు. 

“ఆత్మసాక్షాత్కార జ్ఞానమును పొందెదరు గాక!” తప్పక మీరు పొందుతారు అనేటటువంటి ఆశీః పూర్వకమైనటువంటి నిర్ణయాన్ని ఇక్కడ తెలియజేశారనమాట. చాలా ఉత్తమమైనటువంటి వాక్యం ఇది.

ధనం, గృహారామ క్షేత్రం మొదలగు సంపదలన్నియు అనిత్యములని నేనెరుగుదును. కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును.

అనిత్యములగు సాధనలచేత నిత్యమగు ఆత్మతత్వమును పొందజాలమనియు నేనెరుగుదును. అందుచే కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్నిని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.

(కామ్య కర్మలను ఫలాపేక్షతో చేయువారు మోక్షం పొందజాలరు. ఫలాపేక్ష లేకుండా కర్మల నాచరించువారు చిత్తశుద్ధిని పొంది జ్ఞానసముపార్జన ద్వారా మోక్షమును పొందుదురు).

మనం ఎట్లా వుండాలి అనేది స్పష్టమైనటువంటి నిర్ణయంగా తెలిపారనమాట. 

ఎవరికైతే ధనం మీద గాని, గృహం మీద గాని, ఆరామములమీద గాని, క్షేత్రం మీదగానీ, సంపదల మీద గానీ, అనిత్యములు అంటే పరిణామము చెందేటటువంటి వాటిని ఏవైనాసరే కూడా సుఖం గాని, దుఃఖం గాని ద్వంద్వానుభూతులు ఏవైనా సరే అనిత్యం క్రిందకే వస్తాయి. వీటియందు ఆసక్తి ఎవరికైతే వుంటుందో, వాళ్ళు ఎప్పటికీ ఈ ఆత్మానుభూతిని పొందజాలరు.

కాబట్టి మానవులందరూ తప్పక వీటియందు విముఖత, వైరాగ్యం, నిరసించడం, ఆసక్తిని పోగొట్టుకోవడం, సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవడం తప్పదు. చాలా అవసరం. 

అది అధికారం అనేటటువంటి పద్ధతిని యమధర్మరాజు చెప్తున్నాడు. మనల్ని జనన మరణ చక్రంలో పడవేసేవి ఏవైతే వున్నాయో, వాటిని నిరసించమని చెప్తున్నాడు. మనం మరల యమధర్మరాజు దగ్గరికి రెండోసారి వెళ్ళకూడదు.

ఒకసారి వెళ్ళాం ఆల్రెడీ [already] పూర్వ జన్మలో. మళ్ళా వచ్చాం ఈ జన్మకి. మరల ఈ జన్మ తరువాత తిరిగి యమధర్మరాజు యొక్క దర్శనం కలగకుండా వుండాలి అంటే, ఏవేవి వాటియందు ఆసక్తిని పోగొట్టుకోవాలో స్వయముగా యమధర్మరాజే బోధిస్తున్నాడు. ఇంతకు మించి ఉత్తమ ఉపదేశం లేదు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

03.Sep.2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 45  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 9 🌻

మనకి ఉద్వేగం కలిగేటటువంటి అంశాలు ఏమేమిటీ అంటే ధనం, గృహం, ఆరామం, క్షేత్రం, సంపదలు, అనిత్యమైనటువంటి ద్వంద్వానుభూతులు. ఏ ఏ అంశములందు మీకు ఆవేశం కలుగుతూ వుందో చక్కగా గమనించు. ఆవేశం ఎందువల్ల కలిగింది, నీకు సంగత్వ దోషం వుండబట్టి కలిగింది లేకపోతే కలుగదు. 

సంగత్వ దోషం ఎందువల్ల వుంది? ఆసక్తి వుంది కాబట్టి. ఆసక్తి ఎందువల్ల వుందీ అంటే దాని వల్ల నీకు సుఖమో, దుఃఖాన్ని దూరం చేసుకోవడమో, కొత్త సుఖాన్ని పొందుతాననే భ్రాంతి వుంది కాబట్టి. ఆ భ్రాంతి ఎందుకుంది? నీకు సుఖాపేక్షయందు ఆసక్తి వుంది కాబట్టి. ఎల్లప్పుడూ సుఖంగా వుండాలనే బలీయమైన జీవ భ్రాంతి వుంది కాబట్టి. 

ఆ జీవ భ్రాంతి ఎందుకుందీ? శరీరమే నేననేటటువంటి బలమైన పునాది అభిమానము శరీరమునందు ‘దేహాభిమానమే నేను’ అనేటటువంటి బలమైన అభిమానం నీలో వుంది కాబట్టి ఆ యా అంశములను స్పృశించినప్పుడల్లా నీకు ఆవేశం కలుగుతుంది. తప్పదు. ఆ ఆవేశం కలిగిన ప్రతిఒక్కరూ కూడా ఈ ఆత్మానుభూతిని పొందజాలరు. 

కారణమేమిటి అంటే నీ అంతఃకరణము – మనసు బుద్ధి చిత్తము అహంకారము వీటియందు ఆసక్తమై సంగత్వ దోషాన్ని నిరంతరాయంగా పొందుతూ వుంటుంది. మీ ప్రతిఒక్కరి స్వభావంలో గ్రహించండి — మీరు ఇక్కడ చెప్పినటువంటి అంశాలలో ఏదో ఒక అంశం మీద మీరు తప్పక స్పందిస్తారు. స్పందించకుండా వుండలేరు. సమస్యలేదు అందులో. ఆవేశాన్ని పొందుతారు తప్పక. ఆ ఆవేశాన్ని పొందితే ఆ రకమైనటువంటి సంగత్వ దోషం, మాలిన్యం మీలో ఏర్పడక తప్పదు.

వీటియందు ఎవరైతే అసంగముగా, నిరాసక్తముగా వైరాగ్యముతో విషయ ప్రభావం లేకుండా నిశ్చలముగా, గంభీరముతోటి నిమిత్తమాత్రంగా, సాక్షిగా, ఎవరైతే వుంటారో వారు మాత్రమే ఆత్మజ్ఞానమును పొందుటకు అధికారులు. 

ఇంకేమి చెప్తున్నారు? “కామ్య కర్మలవలన కలుగు ఫలము ఐహికాముష్మిక సుఖములు కూడా అశాశ్వతమని ఎరుగుదును” . మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యక కర్మలు. అంటే అర్ధమేమిటీ? ఏదో ఒక కోరిక చేత ప్రేరేపించబడునవి. ఫలము చేత ప్రేరేపించబడునవి అని కర్మలు ద్వివిధంబులు.

కర్మ మనము చేసేటప్పుడు ప్రారబ్ధ కర్మ అయినప్పటికీ కూడా ఆ ప్రారబ్ధ కర్మ భాగంలో రెండుంటాయి. కోరిక ఫలము. ఈ రెండింటి చేత ప్రేరితమవుతూ చేయబడినటువంటి సమస్తమూ కూడా కామ్యక కర్మే.

భారతదేశంలో సనాతన ధర్మంలో బోధించ బోధించినది అంతా కూడా మానవులు కర్తవ్య కర్మను ఆచరించ వలనే గానీ అభిమాన పూరితమైనటువంటి విశేష కర్మని ఆచరించరాదు. 

విశేషమైన ధనం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి గృహం ప్రాప్తిస్తుంది. విశేషమైనటువంటి రూప లావణ్యవతి అయిన భార్య ప్రాప్తిస్తుంది లేక భర్త ప్రాప్తిస్తాడు. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం జరుగుతుంది.

విశేషమైనటువంటి శారీరిక బలం లభిస్తుంది. విశేషమైనటువంటి విద్యాబలం లభిస్తుంది. విశేషమైన పాండిత్యం లభిస్తుంది. విశేషమైన శాస్త్ర జ్ఞానం లభిస్తుంది. విశేషమైనటువంటి బుద్ధిబలం లభిస్తుంది.విశేషమైనటువంటి స్వర్గ సుఖం లభిస్తుంది.

విశేషమైనటువంటి… ఈ రకంగా ఎన్ని విశేషాలు చెప్పుకుంటూ పోతే అన్ని విశేషములు మన జీవితమంతా పరుచుకునివుంటాయి. విశేషమైన సుఖం అనమాట దాంట్లో. అదొస్తే చాలండి. 

నేను లంకంత ఇల్లు కట్టుకుంటే సుఖంగా వుంటాను. తరువాత లంకేశ్వరుడు ఏమయ్యాడు? ప్రతివాడూ ఏమనుకుంటూ వుంటాడంటే లంకంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు. తక్కువేమీ కట్టుకోవాలి అనుకోడు. వాడి ఆలోచనంతా ఎప్పుడూ అంతే. 

కాని లంకేశ్వరుడు ఏమైపోయాడనే అంశాన్ని మాత్రం ఆలోచించడు. ఎందుకనిటా? అప్పుడు ఆ రకమైనటువంటి అభిమానానికి లోనయ్యావుగా. అట్లగే ప్రతివాడూ ఏమనుకుంటాడూ?

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

04.Sep.2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 46  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 10 🌻

శత సంవత్సరములు ఏ రకమైన అనారోగ్యం లేకుండా బలవత్తరమైనటువంటి దేహాన్ని కలిగి వుండాలి. ఇదీ లంకంత ఇల్లుతో సమానమే. ఇప్పుడాలోపల వున్నవాడు కూడా ఏమౌతాడు అప్పుడూ? ఆ లంకేశ్వరుడే అవుతాడు. శరీరం కూడా నీ ఇల్లేగా. నువ్వు నివసించే ఇల్లు ఎట్లాగో, నీ శరీరమే మొదటి ఇల్లు. 

అట్లాగే డబ్బెంత కావాలి నాయనా? అబ్బ, నేనండీ ఒక ఏనుగు మీదకి ఎక్కి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తు వెళ్తుందో అంత ఎత్తు ధనరాశి గనక నాకు లభిస్తే ఈ జీవితానికి సరిపోతుంది అన్నాడట. ఆ ధనం క్రిందే వాడు నలిగిపోతాడు అనమాట. ఎక్కడికో పోవవసర్లా. వాడు నలిగిపోవడానికి , ఆ ధనమే చాలు.

కాబట్టి ఏవేవి అయితే నీ సుఖప్రాప్తికి అవసరమని నువ్వు నీ జీవితంలో నిర్ణయించుకున్నావో వాటి వలననే నీకు దుఃఖము తప్పదు. అట్లా అనుభోక్తమవడం సృష్టి ధర్మం. 

ఈవిడతో కలిసి జీవిస్తే నేను సుఖంగా వుంటాను అని ప్రేమించాడు. ఏమైంది? ప్రకృతి యొక్క ధర్మం ఏమిచేస్తుంది. ఆవిడ వలననే నీకు దుఃఖం ప్రాప్తించేటట్లుగా చేస్తుంది. చేస్తే ఏమైంది అప్పుడు. ఆ పూర్వపు అభిమాన బలమంతా దూరమైపోతుంది అప్పుడు. 

కాబట్టి ఎవరితో అయితే దుఃఖం కలుగుతుందని నీవు అనుకుంటావో వారి వలన నీకు సుఖం కలిగేటట్లు చేస్తుంది. ప్రకృతి ఎప్పుడూ కూడా విలక్షణమైనటువంటిదనమాట. నీ అభిమానమును పోగొట్టేటటువంటి పద్ధతిగానే ప్రకృతియొక్క నియమాలు వున్నాయి . ఈ సత్యాన్ని గ్రహించాలి. కర్మవశాత్తూ అంటూవుంటామనమాట. 

అంటే నువ్వు ఊహించనివి జరగడం కర్మవశాత్తు అని నీ అభిప్రాయం. కాని నీ బుద్ధిబలం కూడా ప్రకృతిలో భాగమే. ఈ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి అనిత్యములైనటువంటివాటిని నీవు ఆశ్రయించకూడదు. ఐహికము గాని, ఆముష్మికము గాని.

ఆముష్మికము అనిత్యమెట్లా అయిందండీ అంటే స్వర్గలోక వాస సుఖముగాని, యక్షలోక సుఖముగాని – చాలామంది ఈ మధ్యకాలంలో కుబేరుణ్ణి పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే కుబేరుణ్ణి పూజిస్తే ధనం బాగా ప్రాప్తించేస్తుందని అందరి అభిప్రాయం. 

అయితే ఆయన ఇంకొక అవకాశాన్ని కూడా ఇస్తాడు. యక్షలోకాధీశ్వరుడు ఆయన. ఆ యక్షలోకంలో నీకు అవకాశాన్ని ఇస్తాడు. కాని యక్షులు అందరూ కూడా రాజసికమైనటువంటి గుణధర్మము కలిగినవాళ్ళు. వారు రాక్షసులకి అతి దగ్గరగా వుండేటటువంటివాళ్ళు. 

కాబట్టి తమో గుణ సహకారాన్ని తమోగుణ సహవాసాన్ని కలిగించేటటువంటి వాళ్ళు. మరి ఉత్తర జన్మలలో ఏమౌతావు? అప్పుడు జన్మరాహిత్య పద్ధతిలో వెళ్ళలేవు కదా.

ఆత్మానుభూతికి చేరువ కాలేవు కదా. కాబట్టి ఎంతగా ఎవడైతే ఈ ధన గృహ ఆరామ క్షేత్ర అనిత్య సుఖ భోగ సంపద – సుఖ భోగ సంపద – వీటికి దూరంగా వుండమని పరమహంస చెప్తున్నారు. కాంత కనకం. ఇది చాలా ముఖ్యం. 

వీటికి ఎవరైతే దూరంగా వుంటారో, వీటిని ఎవరైతే నిరసించి వుంటారో, వీటియందు ఆసక్తి లేకుండా వుంటారో, వీటిచేత ఉద్వేగం పొందకుండా వుంటారో, ఆఖరికి స్వర్గ సుఖం చేత కూడా నువ్వు ప్రేరేపించబడకుండా వుండాలి. అదికూడా కర్మఫలమే. కాబట్టి వాటిని అశాశ్వతములని ఎరుగవలెను. అతి ముఖ్యమైనదనమాట. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

05.Sep.2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 47   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 11 🌻

శాశ్వతమైనటువంటి ఆత్మ దృష్ట్యా చూచినప్పుడు ఇవన్నీ కూడా అశాశ్వతములైనటువంటివి. 

వీటి యెడల నీ అంతరంగాన్నీ పూనడం అంటే నీ అంతరంగాన్ని పనిచేయించడం సరియైనటువంటి పద్ధతి కాదు, అది జీవ పద్ధతి, ఆత్మభావ పద్ధతి కాదు. కావున ప్రయత్నించి ఇటువంటి పద్ధతిని విడనాడాలి. అందుచేత కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్ని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.

ఆయన అష్టదిక్పాలకులలో ఒకరిగా యమధర్మరాజు గా ఆయనకి ఆ స్థానం ఎలా లభించిందో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వీటన్నింటినీ విసర్జించాడు. వీటన్నిటియందు వైరాగ్యమును కలిగివున్నాడు. ఇంకేం చేశాడు. కేవలం కర్తవ్య నిష్ట మాత్రమే కలిగివున్నాడు. 

ఆ కర్తవ్య నిష్ట చేత ఎవరి ప్రాణములను ఎప్పుడు హరించవలసి వచ్చినా ఆఖరికి అవతార పురుషులైనా, శ్రీరామచంద్రుడైనా, శ్రీకృష్ణమూర్తి అయినా సరే కాలమాసన్నమైనపుడు వినయముగా అవతార పురుషునివద్దకు వెళ్ళి “అయ్యా! మీ సమయం పూర్తయింది. మీరిక అవతారాన్ని చాలించండి“ అని చెప్పేటటువంటి సమవర్తి యమధర్మరాజు. 

కాబట్టి నిర్భయత్వముతో, నిర్భీతితో నిరంతరాయముగా తాను సహజముగా సాక్షిగా నిలబడి కర్తవ్య కర్మను మాత్రమే ఆచరించేటటువంటి వ్యక్తి.

ఇంకేమిటటా – మిగిలిన అంశాలనన్నింటినీ నాచికేతాగ్ని సంచయనము వాటియందు – ‘సంచయనము’ అంటే బాగా గుర్తుపెట్టుకోండి నిశ్శేషముగా లేకుండా చేయుట. 

ఇది సంచయనము అంటే అర్ధం. ఇన్ని అకర్మలను ఆచరించినా కూడా ఎంతో కొంత శేషభాగం మిగిలిపోతుంది. ఆ శేషభాగాన్ని మొత్తాన్ని పట్టుకెళ్ళి నాచికేతాగ్ని అనే యజ్ఞంలో పూర్ణాహుతిగా నిశ్శేషముగా దగ్ధము చేయుట. సంచయనము అంటే నిశ్శేషముగా పోగొట్టుకొనుట. 

అటువంటి సంచయనము ఒనర్చడం చేతనే ఆయన సాపేక్షిక నిత్యత్వము గల యమాధికారమును పొందాడు. అంటే స్వయముగా ఈశ్వరుడేమో నిత్యుడు. ఈశ్వరునితో సమానమైనటువంటి నిత్యత్వం. సాపేక్షిక నిత్యత్వం అంటే అర్ధం అది. 

ఈశ్వరుడితో సమానమైనటువంటి నిత్యత్వాన్ని పొందినటువంటి యమధర్మరాజు తనకి ఆ స్థితి అట్లా కలిగింది. ఆ ఈశ్వరనియమంతో ఈశ్వరునితో సమముగా వ్యవహరించగలిగేటటువంటి స్థితి ఎట్లా కలిగిందో ఈ అంశములందు బోధించేటటువంటి ప్రయత్నాన్ని మనకి చేశారు.

ముఖ్యమైన అంశం ఏమిటంటే కామ్య కర్మలను ఫలాపేక్షతో చేసేటటువంటి వాడు మోక్షం పొందజాలరు. తీవ్ర మోక్షేచ్ఛ అనేది వీళ్ళకు కలగదు. అతి ముఖ్యమైన అంశం. ఫలాపేక్షలేకుండా కర్మలని ఆచరించడంచేత, అంటే నిష్కామ కర్మ చేత చిత్తశుద్ధి కలుగుతుంది. 

జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం కలుగుతుంది. ఈ రెండూ చాలా ముఖ్యం. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఆత్మ విచారణ ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానం, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం అనేవి చాలా ముఖ్యం. 

ఈ రెండు జీవిత లక్ష్యాలనే స్వీకరించి కామ్యక కర్మలను సదా త్యజించవలెను. త్యజించవలెను అంటే ఫల అపేక్షను త్యజించవలెను. ఫల ఆసక్తిని త్యజించవలెను. ఫల ప్రేరణ ద్వారా నువ్వు చేయరాదు. ఈ రకమైనటువంటి కర్తవ్య నిష్ట కలిగివుండాలి. 

తదుపరి చిత్తశుద్ధి ద్వారా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. తద్వారా జీవన్ముక్తిని నీవు పొందగలవాడవు. ఈ రకముగా నీవు తెలుసుకొనవలసినది అని యమధర్మరాజు నచికేతునికి బోధించుచున్నాడు. 

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ 

07.Sep.2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 48   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 12 🌻

యముడు నచికేతుని మరల ఇట్లు ప్రశంసించు చున్నాడు. నచికేతా! నీవు బుద్ధిమంతుడవు, ధైర్యశాలివి, కనుకనే కామ భోగ ప్రాప్తిని త్యజించితివి, జగత్తు యొక్క స్థితిని గ్రహించితివి. 

క్రతువుల వలన కలిగెడి ఫలమెంతటి విశాలమైనదైననూ, ఇహమందు రాజ్యాధి పత్యమును, పరమందు హిరణ్యగర్భ పదవిని కల్గించునదైనను ఇవి అశాశ్వతమని ఎరిగి త్రోసిపుచ్చితివి. స్తుతింప దగిన సర్వమాన్యతను, కీర్తిని కోరవైతివి. ఇవి అన్నియు సంసార భోగమునకు సంబంధించినవే కానీ, పరతత్త్వమునకు సంబంధించినవి కావని వదలితివి. నీ వంటి ఉత్తమ గుణములు కలవాడు దొరకుట దుర్లభము.

ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతుని యొక్క ఉత్తమగుణాలని, అధికారిత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. మనం కూడా ఇటువంటి అధికారిత్వాన్ని సంపాదించాలి. ఆత్మజ్ఞానం సంపాదించాలనుకున్న ప్రతీ ఒక్కరూ కూడా ఇటువంటి అధికారిత్వాన్ని సంపాదించ వలసినటువంటి అవసరం వుందన్నమాట!

ఏమిటి ఆ అధికారిత్వం? అనేది ఒక్కసారి మనం విచారణగా గ్రహిస్తే ‘బుద్ధిమంతుడువు’. సాధారణంగా ‘బుద్ధిమంతుడు’ అంటే అర్థం ఏమిటి? ఈ మాట ప్రతి మానవుడు అనిపించుకోవాలన్నమాట!

వ్యవహారంలో బుద్ధిని మాత్రమే ఆశ్రయించే సత్వగుణ ఆశ్రయంతోటి, సత్వగుణ వ్యవహారం తోటి, సాత్వికమైన జీవనం తోటి… బుద్ధి యొక్క అధిష్ఠానంతో, ఇతర ఇంద్రియములను శాసించగలిగేటటువంటి సమర్థత, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వాళ్ళని బుద్ధిమంతుడు అంటారు.

మానవులు ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, శిష్యుడిగా స్వీకరించాలి అనంటే మొదటి అధికారం నువ్వు బుద్ధిమంతుడివై వుండాలి. 

అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియార్థముల యందు నీకు ఆసక్తి లేకుండా, బుద్ధి యొక్క బలం చేత, వాటిని స్వాధీనపరచుకున్నవాడివై, నీవు వాటిని వినియోగించడంలో విజ్ఞత కలిగినవాడివై వుండాలి అంటే ‘ప్రాప్త కాలజ్ఞత’ అంటారు.

అంటే ఏ సమయానికి ఏ ఇంద్రియాలను ఎలా వాడాలి?

ఏ సమయానికి ఏ ఇంద్రియంతో వ్యవహరించాలి?

ఎలా వ్యవహరించాలి?

ఎంతవరకూ వ్యవహరించాలి?

ఎలా అవి అహం లేకుండా వ్యవహరించాలి?

ఎలా వినయంతో వ్యవహరించాలి?

ఎలా సాధికారంగా వ్యవహరించాలి?

ఎలా సమర్థంగా వ్యవహరించాలి?

ఈ లక్షణాలనన్నింటినీ ఒకేసారి అమలుపరచగలిగేటటువంటి శక్తి బుద్ధిలో వుంటుంది. 

కాబట్టి బుద్ధికి వున్న బలం అటువంటిదన్నమాట! వీటన్నిటిని సక్రమముగా, సవ్యముగా, ఆ క్షణము నుండి ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఉపయోగించగలిగేటటువంటి సమర్థుడైనటువంటి వాడిని ‘బుద్ధిమంతుడు’ అని అంటారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

08.Sep.2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 49   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 13 🌻

అంటే, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఆ నిర్ణయాన్ని అమలు పరిచేటప్పుడు, ఏ స్థితిలో ఇతడున్నాడు? అనేది చూస్తారన్నమాట! అంటే, మనసు స్థితిలో వున్నాడనుకోండి, అప్పుడు రజోగుణ ధర్మంగా చంచలంగా వుంటాడన్నమాట! 

శరీరమనే దాంట్లో (శరీరధర్మంగా) ప్రధానంగా వున్నాడనుకోండి అప్పుడు తమోగుణ ధర్మంతో జడంగా వుంటాడు. కాబట్టి, సూక్ష్మబుద్ధియై గ్రహించగలిగేటటువంటి శక్తి కలిగిన వాడై వుండి, ‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ అనేటటువంటి స్థితికి బుద్ధి వికసించినటువంటిదై వుండాలి. అటువంటి వాడిని బుద్ధిమంతుడు అంటారు.

ఇంకేమిటి? అంటే, ‘ధైర్యశాలివి’ – ధైర్యశాలి అంటే అర్థం ఏమిటంటే, మరణము యొక్క రహస్యాన్ని, మరణాన్ని ఎదిరించేటటువంటి పద్ధతిని, మరణం లేకుండా చేసుకునేటటువంటి పద్ధతిని, జన్మలేకుండా చేసుకునేటటువంటి పద్ధతిని ఆశ్రయించాలి అంటే, నువ్వు ధైర్యశాలివై వుండాలి. 

ఎందుకని అంటే, మానవులందరూ సాధారణంగా ఒక రకమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శిస్తూ వుంటారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఆయా సమస్యలను ఎదిరించడం కోసం అని, ధైర్యం అనేటటువంటి లక్షణాన్ని ఆశ్రయిస్తూ వుంటారు. 

కానీ నిజానికి ఆత్మస్థైర్యం – ఆత్మయందు స్థైర్యం కలిగి వుండాలన్నమాట. అంటే, ‘నేను’ అనేటటువంటి స్వరూపజ్ఞానంలో సరియైనటువంటి పట్టు కలిగి వుండాలి. ఎందువల్ల అంటే, జననమరణాలను దాటటం కంటే, మానవజన్మలో అత్యంత గొప్పదైనటువంటి లక్ష్యం లేదన్నమాట. 

జన్మసాఫల్యత పొందాలి అంటే, జన్మ అధికారాన్ని పొందినటువంటిది ఏదైతే వుందో, ఈ మానవజన్మ సాధికారతకు సరియైనటువంటి సఫలత, నీ జనన మరణ రాహిత్యంలోనే వుందన్నమాట. దానికి కారణం ఏమిటి అనంటే, కామభోగ ప్రాప్తిని త్యజించటానికి ధైర్యం కావాలి. సాధారణంగా ప్రతీదానికి లొంగిపోతూ వుంటాడు మానవుడు. 

ఏదో ఒక అంశానికి లొంగిపోయి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి బాహ్యప్రపంచంతోనో, ఇంద్రియాలతోనో సంయోగ వియోగాలను పొందుతూ తత్‌ ప్రభావ రీతిన, వాటికి లొంగేటటువంటి తత్వాన్ని, బుద్ధిని కలిగివుంటాడు. దానిని ఎదిరించి బుద్ధిని సాక్షిగా నిలుపగలిగేటటువంటి సమర్థత కోసమే ఈ ధైర్యం.

కాబట్టి, ‘ధైర్యం’ అంటే ఎదుటివారిని నిరసించడమో, ఎదుటివాడిని కోప్పడడమో, ఎదుటివాడిని పోట్లాడడమో, ఎదుటివారితో జగత్తుమీద వీపరీతమైనటువంటి చర్యలతో విరుచుకుపడటమో లేదా సాధు సజ్జన సంతతిపై తన బలదర్ప ప్రభావములను చూపించటమో ఇవేమీ ధైర్యములు కావన్నమాట! నీయందే వున్నటువంటి అరిషడ్వర్గాలను జయించటానికి నీకు ధైర్యం కావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. 

కామ, క్రోథ, లోభ, మోహ, మద, మాత్సర్య, రాగ, ద్వేష, అసూయ వంటి లక్షణాలను జయించటానికి ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం కలిగిన వాడు మాత్రమే, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటానికి అర్హమైనటువంటి వాడు.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

09.Sep.2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 50  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 14 🌻

ఎవరైతే ఆత్మజ్ఞాన విచారణ, ఆత్మవిచారణ, ఆత్మనిష్ఠ, ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఈ త్రోవలో నడిచేటటువంటి వారు ఎవరైతే వుంటారో, వాళ్ళకి ఈ అరిషడ్వర్గాలు మిత్రులు వలే ప్రవర్తిస్తాయి. వీళ్ళకు శతృత్వం వుండదన్నమాట!

ఎందుకని అంటే,

రాగద్వేషాలు లేవు కాబట్టి.

సమానత్వం ఉంది కాబట్టి.

సమరసత్వం ఉంది కాబట్టి.

శాంతము ఉన్నది కాబట్టి.

వీళ్ళు నిలకడగా, స్థిరంగా తమ లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తూ వుంటారు కాబట్టి, నిరంతరాయంగా ప్రయాణం చేస్తారు కాబట్టి, అవస్థాత్రయాన్ని దాటే ప్రయత్నంలో ఉంటారు కాబట్టి,

వీళ్ళకి ఏ రకమైనటువంటి రాగద్వేషాలు వుండవు.

కనుకనే అటువంటి ధైర్యశాలి అయినటువంటివాడు బుద్ధిమంతుడు, ధైర్యశాలి….

ఇంకేం తెలియాలట? జగత్తు యొక్క స్థితిని గ్రహించాలి. జగత్తు యొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును గ్రహించాలి. మనమందరం జగత్తులో వ్యవహరించేటప్పడు…. జగత్తే సత్యముగా చూస్తుంటాము. ‘సత్యము’ అంటే అర్థం ఏమీలేదు.

“పరవశత్వము” జగత్తును అనుభవించేటప్పుడు పరవశించి అనుభవిస్తాడన్నమాట! అంటే అర్థం ఏమిటి? ఒకావెడ, కొత్త పట్టుచీర కట్టుకుందనుకోండి! ఆహా! ఆవెడకి ఇంద్రభోగం లభించినంత ఆనందం కలుగుతుంది.

ఆ ఒక్కక్షణం, రెండు క్షణాలు, మూడు క్షణాలు, ఐదు క్షణాలు… ఎవరైన ఇతరులు ఆహా! నీవు అద్భుతమైన వస్త్రాలు కట్టుకున్నావని అంటే, ఐరావతం ఎక్కినంత ఆనందం పొందుతారు. ఆ ‘ప్రశంస’. ఆ ప్రశంస పూర్వకమైనటువంటి దృష్టిని మనం కోరుతూ వుంటామన్నమాట! ఆ ప్రశంస పూర్వకమైనటువంటి అనుభూతిని కోరుతూ వుంటాము. 

ఏమిటి? ఆ ప్రశంసలో వున్న విశేషం అంటే, ‘అహం’ పోషించ బడుతోంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. తెగిడితే పొగుడుతాడు. పొగిడితే తెగుడుతాడు. ఈ రెండు లక్షణాలు ఒక్కచోటే వుంటాయి. పొగిడిన నోటితోనే మరలా ఒక్క క్షణంలో తెగుడుతాడు. అంటే నిరసిస్తాడన్నమాట. ఖండిస్తాడన్నమాట.

కాబట్టి, పొగడ్తలకు పొంగక, తెగడ్తలకు కుంగక వుండేటటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడే ఈ ప్రశంసకు, దూషణ భూషణలకు లొంగని వాడు. అదే కాక, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా ఎరగాలి. ఎప్పటికప్పుడు నీ మనస్సుని చంచలత్వముగా పరిగెత్తింపజేసి, తనవైపు ఆకర్షింపజేసేటటువంటి, త్రిగుణ మాలిన్యంతో కూడుకున్నటువంటి… జగత్తు ఏదైతే వుందో… ఆ జగత్తు నీ యందు పనిచేస్తూ వుంటుంది. 

నిన్ను మేల్కొల్పుతూ వుంటుంది. నిన్ను ప్రేరేపిస్తూ వుంటుంది. నిన్ను ఆకర్షిస్తూ వుంటుంది. నీ యందు వున్నటువంటి బలాల్ని, బలహీనతల్ని నీకు తెలియజెప్తూ వుంటుంది. దానిని ఆత్మవిచారణకు అనుకూలమైనటువంటి పద్ధతిగా, విచారణగా గ్రహించాలే కానీ దానిని త్రిగుణ పద్ధతిగా, త్రిగుణ తాదాత్మ్యతతో కనుక అనుభవించడం కనుక మనం అలవాటు చేసుకుంటే, దాని వెంబడిపడే పోతాం అన్నమాట! – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

10.Sep.2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 51  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 15 🌻

ఇది, జగత్తే శాశ్వతము. ఈ జగత్తు ఎప్పటికి వుంటుంది. నేను పుట్టక ముందు నుంచీ ఈ జగత్తు వుంది, నేను పోయినాక కూడా ఈ జగత్తు వుంటుంది. కాబట్టి జగత్తు శాశ్వతము – అని నీ జననమరణాల మధ్యలో కనుక నీవు చూచుకున్నట్లయితే జగత్తు శాశ్వత లక్షణంతోనే తోచినట్లుగా కనపడుతుంది. 

అంటే సాపేక్ష పద్ధతిగా చూసినప్పుడు, జగత్తు శాశ్వతముగా నీకంటే ముందు నుంచీ వున్నదిగా, నీ తరువాత కూడా వుంటున్నదిగా కనబడుతున్నప్పటికీ, జగత్తు పరిణామశీలమైనటువంటిది. నిరంతరాయం మార్పు చెందుతూ వున్నటువంటిది. అస్థిరమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మవస్తువును గ్రహించటానికి వస్తునిశ్చయజ్ఞానం అవసరం. 

ఇటువంటి వస్తునిశ్చయజ్ఞానం ఏదైతే వుందో, అట్టి వస్తునిశ్చయజ్ఞానం చేత జగత్తుయొక్క అశాశ్వతత్వమును, ఆత్మయొక్క శాశ్వతత్వమును గుర్తించిన వాళ్ళు ఎవరైతే వున్నారో…. వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు కాగలుగుతారు.

కాబట్టి ఇక్కడ నచికేతుడు, జగత్తు యొక్క అశాశ్వతత్వమును బాగుగా గుర్తించినటువంటి వాడుగా మనకి యమధర్మరాజు గారు మాట్లాడే సందర్భంలో కనబడుతున్నారు.

ఇంకేమిటట? సాత్విక కర్మల ప్రభావం చేత కలిగేటటుంవంటి పుణ్యవశం చేత, కొన్ని భోగములు లభిస్తాయి సూక్ష్మశరీరానికి, స్థూలశరీరానికి కూడా! కాబట్టి, అవి ఎటువంటివి అట? క్రతువల వలన కలిగెడి ఫలము ఎంతటి విశాలమైనదైననూ అనేక రకాలైనటువంటి క్రతువులు చేస్తూవుంటాం మానవులం.

ఆ యా క్రతువుల యొక్క ఫలితములన్నీ దానము, ధర్మము, యజ్ఞము, తీర్థయాత్ర, సాత్విక కర్మాచరణ…. ఇవన్నీ కూడా పుణ్యఫలములన్నమాట. 

ఈ పుణ్యఫలములు అనుభవించేటప్పడు, నీకు ఆ ఐశ్వర్యం సమకూరినట్లు, సుఖభోగాలను అనుభవించినట్లు స్థూలంలో నీకు కనబడుతూ వుంటుంది. ఇంకేమిటి అంటే… అప్పుడు ఆ పుణ్యం ఖర్చు అయిపోతూ వుంటుందన్నమాట. 

అట్లాగే, నీకు దుఃఖ కాలం, కష్టకాలం వచ్చినప్పుడు పాపం అనేటటువంటి కర్మ ఖర్చు అయిపోతూ వుంటుంది. కాబట్టి, తన సుఖమే పుణ్యము, తన దుఃఖమే పాపము. ఇంకా వేరే ఏమీ లేదు. పాపాయ పరపీడనం. వేరే ఏమీ లేదు. పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం.

ఇతరులకు ఉపకారమొనర్చడానికి నువ్వు చేసినటువంటి శ్రమ, శ్రద్ధ, ఇచ్ఛ ఏదైతే వుంటుందో అదంతా పుణ్యఫలంగా మారుతుంది. 

ఇతరులకు నిరసించినటువంటిది, నిందించినటువంటిది, ఆపత్కాలంలో సహాయం చేయనటువంటి ఇతరత్రా సమస్యలు ఏవైతే వుంటాయో, చేయగలిగి వుండి చేయలేనటువంటి ధర్మరీత్యా భంగం ఏదైతే వుంటుందో అదంతా కూడా, ఆ ధర్మలోపం అంతా కూడా అధర్మాచరణగా, పాపంగా పరిగణించబడుతుంది. దాని ఫలమేమిటి? అనంటే, ప్రకృతి దాని ఫలాన్ని నీకు ఏదో కష్టం రూపంలో అందించేస్తుంది. ఆరకంగా రెండూ ఖర్చు అయిపోతూనే వుంటాయి.

కానీ సాధకుడు ఎలా వుండాలయ్యా? అనంటే ఈ పుణ్యపాపములను రెండింటినీ సాక్షిగా చూడగలిగేటటువంటి స్థితిలోకి ఎదగాలి. అలా ఎదిగినవాడు మాత్రమే, ద్వంద్వాతీతము… సుఖదుఃఖాలకు, పుణ్యపాపములకు, రాత్రి పగలుకు అనేక రకములైన ద్వంద్వాలున్నాయి. 

ఇట్లాగ… ఈ రెండు రెండు జ్ఞాన అజ్ఞానములు, వీటన్నిటికీ అతీతంగా వుండేటటువంటి సాక్షిత్వ చైతన్య స్థితిలోకి మానవుడు ఎదగాలి. అలా ఎదగాలి అంటే, క్రతువుల వలన కలిగేటటువంటి, ఇహమందు రాజ్యాధిపత్యము, పరమందు హిరణ్యగర్భ పదవి… ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

11.Sep.2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 52   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 16 🌻

ఏంటంటే, ఈ జన్మలో, ఈ శరీరంతో నువ్వు ఏదైనా సరే, అధికారాన్ని, ఆధిపత్యాన్ని… చాలామందికి తెలుసు. మీ ఇళ్ళల్లో మీమాటే చెల్లుతూ వుంటుందనుకోండి. దాని అర్థం ఏమిటి? అంటే అది కూడా ఒక అధికారమే. నీ మాటే నెగ్గించుకోవడం. 

అప్పుడు ఏం ఖర్చు అయిపోతుంది అంటే, పుణ్యఫలం ఖర్చు అయిపోతూ వుంటుంది. ఎదుటివాడు నువ్వు ఏదైనా చెప్పగానే, చెప్పకుండానే విని ఆచరిస్తున్నాడు, నీమాటను ఔదర దాలుస్తున్నాడు, ఔదారుస్తున్నాడు అనంటే, అంటే అక్కడ నీ పుణ్యఫలం ఖర్చైపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బా! నేనే నా సంసారమునకు అధిష్ఠానమును. నేనే నా కుటుంబమునకు అధిష్ఠానమును. నామాటే చెల్లుతుంది. నామాటే నెగ్గుతుంది. అనేటటువంటి అహం ఏదైతే వుందో, ఆ అహం ఈ పుణ్యభోగాన్ని అనుభవించేస్తూ వుంది.
ఈ రకంగా రాజ్యాధికార పదవి, అనేక రాజ్యాలుంటాయి ఈ ప్రపంచంలో… మనోరాజ్యం వేరే, బుద్ధిరాజ్యం వేరే, శారీరక రాజ్యం వేరే. ఐహికమైనటువంటి భూమండలాధిపత్యం వేరే. 

అనేక రకాల అధికారములతో కూడినటువంటి, అనేక శాసనములు, అనేక పదవులు నా శాసనమే చెల్లుతుంది, నా మాటే చెల్లుతుంది, నేనే అధికారిని, నేనే అధిష్ఠానాన్ని అనేటటువంటి బలం ఏదైతే వుందో, ఆ బలం అంతా ఇతః పూర్వ పుణ్యఫలం చేత, ఖర్చయ్యేటప్పుడు జరిగేటటువంటి ఫలితం. 

కాబట్టి, భక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ ఎలా వుంటాడయ్యా? అనంటే, ‘దాసోహం’ – నాయనా! నాకు ఏ రాజ్యములు వద్దూ, నాకు ఏ సేవకులు వద్దూ, నేనే దాసాను దాసుడను. నేనే సేవకులకు సేవకుడను. నాకు సేవకులు అసవరం లేదు. నా సామాన్య అవసరములు తీరితే చాలు. నాకు ఏ రకమైనటువంటి ఇతరత్రా… ఇతరత్రా… ఎవరక్కడా అంటే పలికేటటువంటి వాళ్ళు అవసరం లేదు. ఈ రకంగా నిశ్చలంగా, భక్తి విశ్వాసాలతో ఉండి, ఈ రకమైనటువంటి ఆకర్షణ నుంచీ బయటపడాలి.

ఇంకొక్కటి ఏం చెప్తున్నారు? ఐహికంలో రాజ్యపదవి ఎలాగో, ఆముష్మికంలో హిరణ్యగర్భ పదవి కూడా అంతే. ఈ హిరణ్మయ కోశానికి అధిష్ఠానం హిరణ్యగర్భుడు. మీరు అందరూ కూడా ఐదు కోశముల విషయం తెలుసుకుని ఉండాలి. ఈ ఐదు కోశములకు అవతల హిరణ్మయకోశం అని ఆరవ కోశం కలదు.

కాబట్టి, “జనన మరణ రాహిత్యం పొందాలి అనంటే, షట్కోశ రహితం అవ్వాలి”. పంచకోశ విచారణ, పంచకోశ నిరసన వరకూ సరిపోదన్నమాట. ఆరవకోశమైనటువంటి హిరణ్మయకోశము నందు ప్రవేశించి, అట్టి హిరణ్యగర్భ పదవిని కూడా, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వున్నటువంటి సమస్తమూ ‘నాకు అవసరం లేదు’ – అనే త్యాగం చేయగలిగేటటువంటి, తీవ్రవైరాగ్యం కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు మాత్రమే మోక్షమునకు అర్హుడు. 

ఈ రకమైనటువంటి సత్యాన్ని ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నారు. ఇవి అశాశ్వతమని ఎరిగి తోసిపుచ్చాలి. ఇది చాలా ముఖ్యం. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

12 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 53   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 17 🌻

పిపీలి కాది బ్రహ్మపర్యంతమూ వున్నటువంటి సమస్త పదవులు, సమస్త శరీరములు, సమస్త వ్యవహారములు, సమస్త భోగములు సమస్త అనుచానమైనటువంటి సాంప్రదాయక విధానములన్నీ, సమస్త అధిష్ఠాన పద్ధతులన్నీ, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా వున్న సమస్త వ్యవహారమునంతటిని, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఎవరైతే కాదనుకోగలుగుతారో, ఎవరైతే నిరసించగలుగుతారో, 

ఎవరైతే తనకు అవసరం లేనివిగా గుర్తిస్తారో, ఎవరైతే అశాశ్వతముగా గుర్తిస్తారో, ఎవరైతే పరిణమించేవిగా గుర్తిస్తోరో, ఎవరైతే నిరంతరాయముగా చలనశీలమై ఉన్నట్లుగా వీటిని గుర్తించగలుగుతారో, ఎవరైతే అస్థిరమని గుర్తించ గలుగుతారో వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు అయ్యేటటువంటి అవకాశం వుంది. 

పరబ్రహ్మనిర్ణయాన్ని పొందే అవకాశం వుంది. వాళ్ళు మాత్రమే మోక్ష లక్ష్మిని వరించే అవకాశం వుంది. వాళ్ళు మాత్రమే ముక్తికాంతను వరించేటటువంటి అవకాశం వుంది. వాళ్ళు మాత్రమే జీవన్ముక్తులై, విదేహముక్తులయ్యేటటువంటి అవకాశం వున్నది.

ఇంకేం కోరకూడదట? ‘స్తుతింప దగిన సర్వమాన్యతను’ – అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచంలో అందరూ కూడా నీవు కలిగివున్న వాటిని బట్టి నీకు ‘మాన్యత’ అంటే ప్రశంసిస్తూ వుంటారు. 

ఆయనకేమిటండీ? వాళ్ళ పిల్లలు అమెరికాలో వున్నారు… వాళ్ళ కోడళ్ళు అమెరికాలో వున్నారు. వాళ్ళు అంతటివాళ్ళు, వీళ్ళు ఇంతటి వాళ్ళు, వీళ్ళు కోటీశ్వరులు, వాళ్ళకు అంత డబ్బువుంది, వీళ్ళకు ఇంత డబ్బు వుంది, వాళ్ళకు అంత ఇల్లు వుంది, వీళ్ళకు ఇంత ఇల్లు వుంది. 

ఇట్లా భౌతికమైనటువంటి ఆశ్రయాలతో ‘మానత్య’ – కీర్తిస్తూ వుంటారు. ఆ కీర్తిని ఆశ్రయించకూడదు. నీ నిన్ను గుర్తించేవాళ్ళు, నువ్వు గుర్తించే వాళ్ళ మధ్యలో, నీవు ఎప్పుడైతే కీర్తిని ఆశ్రయిస్తావో, ఆ కీర్తి యొక్క ఫలం, పుణ్యఫలం ఖర్చైపోవడం వల్ల నీకు లభించేటటువంటిది. 

తత్‌ ప్రభావం చేత మరలా, జనన మరణ చక్రంలో, పుణ్యపాప చక్రంలో, ద్వంద్వానుభూతి అనే చక్రంలో పడిపోతూ వుంటావు. కాబట్టి ఎవరైనా కీర్తించినప్పుడు అంతా ఈశ్వరానుగ్రహం అండీ నాదేం లేదు. నా ప్రయత్నం ఏమీ లేదు. 

నేను నిమిత్తమాత్రుడని, నాకెట్టి అందులో ప్రాధాన్యతా లేదు, నాకెట్టి అందులో వున్నటువంటి ఆశ్రయమూ లేదు. నేనేమీ దాంట్లో కోరలేదు, నేనేమీ దానిని అనుభవింప లేదు. అనేటటువంటి నిరసించేటటువంటి కీర్తి, యశః కాములై వుండేటటువంటి విధానాన్ని నిరసించుకోవాలి ఎవరికి వారు.

ఇంకేమిటి? ‘కీర్తిని కోరవైతివి’ – ఇది చాలా ముఖ్యం. ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ కోరేది ఏమిటంటే, మానవులకున్న అతిపెద్ద దుర్భలత్వం ఏమిటంటే, కీర్తిని కోరటం. 

అంటే అర్థం ఏమిటంటే, ప్రక్కవాళ్ళు తనని ప్రశంసించాలి. ఆహా! ఇవాళ మీరు ఎంతటి మంచి డ్రస్‌ వేసుకుని వచ్చారండీ! ఆహా! మీరు ఎంత అందంగా వున్నారండీ? ఆహా! మీరు ఎంత ఐశ్వర్యంతో వున్నారండీ? ఆహా! మీరు ఎంత చదువుకున్నారండీ! ఆహా! మీరు ఎంత అందంగా వున్నారండీ! 

ఇట్లా అష్టమదములకు సంబంధించినటువంటి ప్రశంసని పొందుతూ వుంటారు. ఆహా! మీరు ఎంతబాగా చదువుకున్నారండీ! ఆహా! మీ కుటుంబం ఎంతబాగా ఔన్నత్యంగా వున్నదండీ! ఆహా! మీరు పదిమందిలో ఎంతో గొప్పగా వున్నారండీ! ఆహా! మీరు ఈ దేశంలోనే గొప్పగా వున్నారండీ! ఆహా! మీరు ఈ ప్రపంచంలోనే గొప్పగా వున్నారండీ! అసలు మీలాంటి వారు… ప్రపంచంలోనే లేరండీ, ఇలాంటి ‘యశఃకామత’ – 

దీనిని ఏమంటారంటే, ‘యశః కామత’ – కామంలో ఇది కూడా ఒక కామం అన్నమాట! కోర్కెలలో ఇది కూడా ఒక కోరిక. నీడ వలె, చాప క్రింద నీరు వలె, ఇది మన జీవితంలో ఆక్రమిస్తూ వుంటుంది. 

ప్రతి రోజూ ఎవరో ఒకరు, నిన్ను ఒక్కరన్నా కనీసం భార్యగారు భర్తగారినో, భర్తగారు భార్యగారినో లేకపోతే తల్లిదండ్రులు పిల్లలో, పిల్లల్ని తల్లిదండ్రులో ఎవరో ఒకరు ఒకర్ని కీర్తించకపోయినట్లయితే, స్తుతించకపోయినట్లయితే, ఆ రోజు సరిగ్గా నిద్రపట్టదు. దీని పేరు ‘యశః కామత’ అంటారు దీనిని. 

ఈ యశఃకామత ఎవరిలో అయితే బలంగా వుంటుందో, వాళ్ళు ఎవరో ఒకరిచేత మీరు అద్భుతమండీ! అని అనిపించుకుంటేనే ఆ రోజుకి అహం శాంతిస్తుంది. దాన్నే పునః పునః పునః స్మృతిలో ఊహించుకుంటూ, పునః పునః స్తుతింపజేసుకుంటూ ఆ సంతృప్తిని పొందుతారు. 

దీనిని ‘కీర్తికామత’ లేదా ‘యశః కామత’ అంటారు. అటువంటి కీర్తిని కోరలేదు నచికేతుడు. కారణం ఏమిటట? ఇవన్నీ సంసార భోగమునకు సంబంధించినవి.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

14 Sep 2020


🌹.    కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 54   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 18 🌻

చాలామంది ఏమనుకుంటుంటారంటే, వివాహం చేసుకుని పిల్లల్ని కనటం ఒక్కటే సంసారం అని అనుకుంటూ వుంటారు. కానీ నిజానికి ఇప్పుడు చెప్పినటువంటి కామోపభోగములు అన్నీ కూడా సంసారమే. 

నువ్వు వివాహం చేసుకున్నావా? చేసుకోలేదా? అనేది కాదు అక్కడ ప్రాధాన్యత. శరీరమును ధరించావు అని అంటేనే, నీకు కామోపభోగం వుండక తప్పదు. 

కాబట్టి, అట్టి శరీర పద్ధతి ఏదైతే వుందో, ఆ శరీరమును ధరించి వున్నప్పటికీ, జగత్తు యందున్నటు వంటి అశాశ్వతమైనటువంటి దృష్టి నిలబెట్టుకున్నవాడై, ఈ అరిషడ్వర్గములను ఎవడైతే సమూలముగా నిరసిస్తాడో, స్మృతి పూర్వకంగా నిరసిస్తాడో, వాసనతో సహా నిరసిస్తాడో, నిర్వాసనా మౌన పద్ధతిని ఆశ్రయిస్తాడో, నిష్కామ కర్మను ఆశ్రయిస్తాడో, నిష్క్రియాపరుడై వుండకుండా వుంటాడో,…. సక్రియాత్మకుడై వుండాలి, సామన్య ధర్మాన్ని నడుపుతున్నవాడై వుండాలి. 

సామన్యమైన కర్మాచరణ, కర్తవ్య కర్మాచరణగా చేస్తున్నవాడై వుండాలి, ఏకకాలంలో సాక్షీభూతుడై వుండాలి. 

అట్లా ఎవడైతే జీవితాన్ని నిలబెట్టుకో గలుగుతాడో, బాలన్సు [balance] చేసుకోగలుగుతాడో, సమత్వస్థితిలో నిలుపుకో గలుగుతాడో, సమదర్శన పద్ధతిగా వుంటాడో, శాంత సమరస సత్క్రియా శీలుడై వుంటాడో, వాడు మాత్రమే పరతత్వమునకు సంబంధించినవి కావని కూడా వదలగలుగుతాడు. 

వీటన్నింటిని కూడా పరతత్వం దృష్ట్యా, నువ్వు అందవలసినటు వంటి, పొందవలసినటువంటి, లక్ష్యమైనటువంటి, ఆత్మనిష్ఠా, బ్రహ్మనిష్ఠా, పరబ్రహ్మనిర్ణయమనే పరతత్వమును ఆశ్రయించేటటు వంటివి కావు కాబట్టి ఇవి, వీటిని నిరసించాలి. నీవంటి ఉత్తమ గుణములు కలవాడు దొరకుట దుర్లభము.

సులభము, దుర్లభము అని రెండు పదాలు ఎక్కడికక్కడ మనకి వేదాంతంలో లభిస్తూ వుంటాయి. సులభము అంటే, ‘సులభము’ అంటే ఏంటి? సు-లభ్యత. ఎక్కడ పడితే అక్కడ లభించేది. 

ఎక్కడ పడితే అక్కడ సులభంగా లభించేది. కష్టపడకుండా పొందగలిగినది ఏదైతే వుంటుందో, దానికి సులభం అని పేరు. కష్టపడైనా సంపాదించగలిగేది ఏదైతే వుంటుందో అది దుర్లభం. నువ్వు ఎన్ని కష్టాలైన సరే పడి దానిని సంపాదించాలి. అప్పుడు దానిని దుర్లభం అంటాం. 

ఏ కష్టం పడకుండా లభించేది వుందనుకోండి దాన్ని సులభము అని అంటాము. అర్థమైందా అండీ? కాబట్టి, ఎంత కష్టమైనా సరే మానవుడు, ఈ ఆత్మనిష్ఠకి, ఈ బ్రహ్మనిష్ఠకి, ఈ పరబ్రహ్మ నిర్ణయం అనే పరతత్వాన్ని పొందడానికి కావలసిన అధికారిత్వమును పొందడానికి, ఎన్ని కష్టాలు పడైనా సరే, తనని తాను ఈ జగదాశ్రయ తత్వమునుంచీ, జగదాశ్రయ ఆకర్షణ నుంచీ, అరిషడ్వర్గ ఆకర్షణ నుంచీ, త్రిగుణ మాలిన్యం నుంచీ, తనని తాను బయటపడ వేసుకోవాలి.

“ఉద్ధరేత్‌ ఆత్మనాత్మానాం ఆత్మాన మవసాధయేత్‌” – ఎవరికి వారు ప్రయత్న శీలురై బయట పడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తున్నారు.

నీవు తెలిసికొన దలచిన ఆత్మతత్త్వం గురించి చెప్పుచున్నాను వినుము. ఆత్మ అతి సూక్ష్మ మగుట చేత సులభముగా తెలియబడక పోవుటచే దుర్ధర్శుడనబడును. ఈ ఆత్మ ప్రాణుల బుద్ధిగుహ యందు ప్రవేశించి గుప్తముగా యున్నది. శబ్దాది విషయముల చేత మరుగుపరచబడియున్నది. 

సనాతనమైన ఆ ఆత్మను ధీరుడైన విద్వాంసుడు ఆధ్యాత్మ యోగచేత తెలిసికొనును. అనగా శబ్దస్పర్శాది విషయముల నుండి ఇంద్రియములను మరల్చి చిత్తమును ఆత్మయందు ప్రవేశపెట్టుటయను యోగము ద్వారా ఆత్మను తెలిసికొనును. 

అట్టి ఆత్మసాక్షాత్కారమైన వారు హర్షశోకములు మొదలగు ద్వంద్వములను విడచి నిర్వికారస్థితి యందు ఉండెదరు. ఆత్మ తమ బుద్ధి గుహయందే వున్నప్పటికినీ విషయాదులతో కూడుకొని యుండు సాధారణ మానవులు తెలిసికొనలేక యున్నారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

15.Sep.2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 55   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 19 🌻

ఈ ఆత్మతత్వాన్ని ఇప్పుడు తెలియబరిచేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. నీవు తెలుసుకొన దలుచు కొనునటువంటి ఆత్మతత్త్వం ఎంతటి విశేషమైనటువంటిదో, ఎలా పొందాలో ఈ రెండింటి లక్షణాలని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. 

‘ఆత్మ’ ఎక్కడ వున్నది? అని అందరి ప్రశ్న. ‘ఆత్మ’ ఎక్కడో ఉన్నది – అనటానికి వీలుకాదు. అంటే ఆకాశం అవతల. పాతాళానికి ఇవతల. ఇలా చెప్పటం కుదరదు. అంటే, “నకర్మణా, నప్రజయా, యద్ధనేనైక, త్యాగేనైక అమృతత్వమానసుః” – అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆత్మ ఉన్నది. 

అంటే, ఒకటి చేయడం ద్వారా కానీ, నకర్మణా, నప్రజయా – అనేక జనబాహూళ్యం చేత కానీ, యద్ధనేనైక – ధనబలం చేత కానీ, త్యాగేనైక అమృతత్వమానసుః – ఒక్క త్యాగం చేత మాత్రమే, త్యాగబుద్ధి చేత మాత్రమే ఆత్మ తెలియబడుతుంది. ఎట్లాగు? కారణమేమిటంటే, బుద్ధి గుహయందు వుందట.

అసలు బుద్ధి అనేది ఎక్కడుంది అంటే స్థానం చెప్పడానికి చాలా కష్టమైనటువంటింది. నీ హృదయస్థానంలో నీకు ఆత్మతత్వం నిశ్చలంగా ప్రకాశిస్తూ వున్నది. అట్టి హృదయస్థానాన్ని తెలుసుకోవాలి అనంటే, బుద్ధిపూర్వకంగానే తెలుసుకోవాలి.

బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి అంటే, నీ ప్రాణమనస్సుల యొక్క చలనం ఎక్కడి నుంచైతే పుడుతోందో, ఆ పుట్టుక స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలి. సాధనలన్నీ ఈ హృదయస్థానమును తెలుసుకొనటం కొరకే చెప్పబడ్డాయి. 

కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సూక్ష్మమైనటువంటి, బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి, చిత్తము కంటే సూక్ష్మమైనటువంటి, అహంకారమునకంటే సూక్ష్మమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞాతగా, తెలుసుకునేవాడుగా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కూటస్థుడుగా, కదలనివాడుగా, స్థిరముగా, స్థాణువుగా, ఉన్నటువంటి స్థానము, స్థితి ఏదైతే ఉన్నదో, దానిని ‘దుర్ధర్శుడు’ అని పేరుపెట్టారు దీనికి. అంటే అర్థం ఏమిటి?

కష్టసాధ్యమైన వాటిళ్ళోకెల్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటి దర్శనం ఏదైనా వుంది అనంటే అది ఆత్మసాక్షాత్కారం. ఈ ప్రపంచంలో హిమాలయాల మీద, ఎవరెస్ట్‌ పర్వతం మీద ఆత్మ ఉన్నది. అన్నారనుకో మీరందరూ టకటకా టకటకా దానికి తగినట్లు ప్రయాణం పూర్తిచేసుకుని, ట్రైనింగ్‌ పొంది, ఎవరెస్ట్‌ పర్వతం ఎక్కి చూస్తారు కానీ, అంత కష్టసాధ్యమైనటువంటి పని కూడా సులభమే కానీ, ‘ఆత్మసాక్షాత్కారజ్ఞానం’ – సులభం కాదు.

అయ్యా! రాకెట్‌ వేసుకుని చంద్రమండలం మీదకు వెళ్తే, నేను చంద్రమండలం మీద నడిస్తే, ఆత్మ నాకు తెలియబడుతుందా? తెలియబడదు. నువ్వు ఎంతకష్టపడైనా అంతరిక్ష ప్రయాణం పూర్తిచేసినప్పటికీ, ఆత్మానుభూతిని పొందలేవు. అందుకని దీనికి ‘దుర్దర్శుడు’ – అని పేరుపెట్టారు. 

ఈ ‘దుర్దర్శుడు’ అన్న పదం చేత మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏంటంటే, ఇంద్రియముల ద్వారా నువ్వు దీనిని అనుభవించలేవు. అందుకని ఏమంటున్నాడు? ఎట్లా పొందవచ్చటా? ఒకటే మార్గం వుంది. వేరే మార్గం లేదు. ఏమిటి? శబ్దాది విషయముల చేత అది మరుగపరచబడి యున్నది.

‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ – అనే స్థితికి బుద్ధి పరిణామం చెందితే తప్ప, వేరే మార్గం లేదు. 

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

16 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 56   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 20 🌻

బుద్ధి ఇంద్రియాల పరిధిలో పని చేస్తూ, ఇంద్రియ విషయములను మాత్రమే గ్రహిస్తూ, తెలుసుకుంటూ శబ్దాది శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు విషయాలను గ్రహించేటటువంటి స్థాయికి మాత్రమే పరిణామం చెందినటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎప్పటికీ దీనిని తెలిసికొనలేరు. ఎవరైతే స్పష్టంగా చెప్తున్నారు. “సనాతనమైన ఈ ఆత్మను, ధీరుడైన విద్వాంసుడు, అధ్యాత్మ యోగము చేత తెలుసుకొనును” – సనాతనమైన ఈ ఆత్మను అనంటే, సృష్టికి ముందు నుంచీ వున్నది. 

సృష్టి లేకుండా పోయినా కూడా వుంటుంది. ఈ అనంతమైన విశ్వం రాకముందుకూడా వుంది. అనంతమైన విశ్వం లేకుండా పోయినా వుంటుంది. ఈ బ్రహ్మాండం రాకముందు వుంది. ఈ బ్రహ్మాండం అంతా లయమైపోయినా కూడా అది వుంది. ఈ రకంగా ఏదైతే ఉన్నదో అది సనాతనము. అట్టి సనాతనమైనటువంటి దానిని ‘ధీరత’, ‘విద్వాంసత’ – ఈ రెండూ వుండాలి.

ధీరుడైన వారు – అంటే జగత్తు యొక్క అశాశ్వతమును, అశాశ్వతత్వమును తెలుసుకొన్నటువంటి వాడు ఎవడైతే వున్నాడో, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వైరాగ్యాన్ని కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు అధ్యాత్మ యోగము చేత తెలిసికొనును. అనగా శబ్ద స్పర్శాది విషయములనుండి, ఇంద్రియములను మరల్చి, చిత్తమునందు ప్రవేశ పెట్టి, అట్టి చిత్తమును ఆత్మయందు ప్రవేశ పెట్టుటయను యోగము ద్వారా… ఇది “యోగం” అంటే! బాగా గుర్తుపెట్టుకోండి.

‘యోగము’, ‘యోగము’ అని బయట ఏదైతే మనకి బోధించబడుతూ, అనుభవించబడుతూ, తెలియబడుతూ, బోధించబడుతూ, తెలుసుకొనుట అనేటటుంవంటి ప్రక్రియ ద్వారా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగ యోగ విద్య గా చెప్పబడుతున్న యోగము ఏదైతే వున్నదో, ఆ యోగ లక్ష్యము ఏమిటయ్యా అనంటే, ఆత్మోపరతి. చిత్తమును ఆత్మయందు ప్రవేశపెట్టుట – అనేటటువంటి ప్రధాన లక్ష్యం దిశగా, బోధించబడుతూ వున్నది. 

కాబట్టి మౌళికార్థములో అధ్యాత్మయోగం అంటే ఏమిటంటే, ఇంద్రియములను ఇంద్రియార్థముల నందు ప్రవేశింప నివ్వక, ఇంద్రియములను చిత్తమునందే నిలబెట్టి, అట్టి చిత్తమును చిత్తశుద్ధి, త్రిగుణ మాలిన్యమునకు లోబడనివ్వక, గుణాతీత పద్ధతిగా, సాక్షిత్వ పద్ధతిగా, నీవు ఆత్మయందు, చైతన్యము నందు వాటిని ప్రవేశపెట్టుట. చిత్తము ‘చిత్‌’ గా మారిపోవాలి. సచ్చిదానందములో వున్నటువంటి చిత్‌ స్వరూపమే నీలో చిత్తముగా వున్నది. కాబట్టి, నీ యందు వున్నటువంటి చిత్‌ని గ్రహించాలి. 

చైతన్యాన్ని గ్రహించాలి. చైతన్యాన్ని అనుభూతమొనర్చుకోవాలి. నీలోపలే జరుగవలసినటువంటి గొప్ప పరిణామమిది. అట్టి ఆత్మసాక్షాత్కార మైనటువంటి వారు, హర్షశోకములు మొదలైన ద్వంద్వములను విడచి, నిర్వికార స్థితియందు ఉండెదరు. ఇది చాలా ముఖ్యం.

‘నిర్వికారము, నిర్విచారము’ – ఈ రెండూ ఒకేసారి లభిస్తాయి.

‘నిర్వికారము, నిర్విచారము’ – ఎవరైతే దేనికీ విచారించరో, ఎవరైతే దేనికీ వికారిత్వమును పొందరో… అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల చేత ప్రేరేపించబడరో, అనుభవనీయములైనటువంటి జగత్‌ భోగములయందు ప్రేరణను పొందరో, జగదాకార వృత్తిని పొందరో, అటువంటి వాడు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానమును పొందినటువంటి వాడు అవుతున్నాడు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

19 Sep 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 57  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 21 🌻

ఆత్మ తన బుద్ధిగుహ యందే వున్నప్పటికీ, విషయాలతో కూడుకుని వున్న సాధారణ మానవుడు తెలుసుకొనలేక యున్నాడు. 

ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ తెలుసుకోవాలి అని కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా, అష్టాదశ శక్తిపీఠాలు తిరిగినా, ప్రపంచంలో వున్న ఏడువింతల్ని తిరిగి చూసినా కూడా నీవు ఆత్మతత్త్వాన్ని పొందలేవు. 

భూమండలానికి ఒక విమానం వేసుకుని ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చినా సరే, పొందలేవు. ఎందువలన అంటే, ఇది నీ బుద్ధి గుహయందే వున్నది కాబట్టి. నీ హృదయస్థానమందే వున్నది కాబట్టి. నీవు ఎప్పటికైనా సరే, నీ హృదయస్థాన నిర్ణయాన్ని తెలుసుకుని, అదే స్థానమున ఉన్నటువంటి, స్వస్వరూపజ్ఞాన సాక్షాత్కార నిర్ణయాన్ని నీవు దర్శనపద్ధతిగా పొందాలి. 

అట్లా పొందినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని అందుకోగలుగుచున్నాడు. ఇతరత్రా ఏ కర్మల చేత గానీ, ఏ నిర్ణయముల చేత గానీ, ఏ పనుల చేత గానీ, ఏ పద్ధతుల చేత గానీ ఇది సాధింపబడదు. తదేక నిశ్చలత కలిగి వుండి, చిత్తమును చైతన్యమునందు రమింప చేయగలిగేటటువంటి సమర్థుడవు కావలెను – అని మరలా స్పష్టముగా, నిర్ణయముగా బోధించుచున్నారు.

మృత్యువు వశుడగుటచేత మనుష్యుడు మర్త్యుడున బడుచున్నాడు. ఈ మనుష్యుడు నేను చెప్పబోవునట్టి ఆత్మతత్త్వమును, ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని మననాదులచేత బాగుగా నెరింగి, ఆనందాది ధర్మయుక్తమున, అతి సూక్ష్మమును అగు ఆత్మతత్వంను, శరీరాదికము నుండి వేరుపరిచి బాగుగా గ్రహించును, అట్లాత్మను బొందిన విద్వాంసుడు సర్వ దుఃఖముల నుండి విముక్తుడై బ్రహ్మానందము ననుభవించును. అర్హుడైన నచికేతునకు మోక్షద్వారములు తెరువబడి యున్నవని తలంచుచున్నాను.

అధికారిత్వము పొందగానే, నీకు ఆ అధికారిత్వం ప్రభావం చేత, మోక్షద్వారములు తెరువబడుతాయి. ఇది చాలా ముఖ్యం. ఎట్లా అట ఇది? ఆత్మ వల్ల ఏమిటండీ? ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ పొందటం వలన నీకేమిటి ప్రయోజనం? అంటే, సర్వదుఃఖముల నుండీ విముక్తుడై, బ్రహ్మానందమును అనుభవించును. ఇది చాలా ముఖ్యం.

పిపీలికాది బ్రహ్మపర్యంతము ఉన్నటువంటి సమస్త జగత్తునందు వ్యాపకమై వున్నటువంటి, బ్రహ్మతత్వము ఏదైతే వున్నదో, అట్టి బ్రహ్మానుభూతిని బడసి, సర్వవ్యాపకమైన స్థితియందు స్థిరముగా నిలబడియుండి, తానే బ్రహ్మమైనటువంటి అహంబ్రహ్మాస్మి అనే బ్రహ్మనిష్ఠను పొందుతాడు. అట్లా బ్రహ్మనిష్ఠను పొందడం ద్వారా సచ్చిదానందమనెడి స్థితిని, నిరంతరాయమానంగా అనుభూతమొనర్చుకుంటూ వుంటాడు. ఇది చాలా ముఖ్యం. శరీరాదికమునుండీ వేరుపరచీ ఇది చాలా ముఖ్యము. 

నీవు నీ శరీరంలోనే విడివడిపోయి వున్నటువంటి స్థితిని నీవు గుర్తించాలి. ఆ గుర్తింపు శక్తి రావాలి. శరీరమే నేనుగా వున్నటువంటి స్థితినుంచీ, శరీరము నేను కాదు, శరీరము నందు నేను వేరే. క్షేత్రము వేరే క్షేత్రజ్ఞుడు వేరే, దేహము వేరే దేహి వేరే, శరీరము వేరే శరీరి వేరే. ఆత్మ అనేది సాక్షి. ఇట్టి సాక్షిభూతమైనటువంటి వాడు, శరీరము నుంచీ వేరుగా వున్నాడు. అది ఎలా పొందాలట?

‘మర్త్యుడు’ – అన్న పేరెందుకు పెట్టారంటే మానవులందరికీ మృత్యువుకు వశమై వున్నాడు. ఎల్లప్పుడూ ఆ మరణభయాన్ని పొందుతూ వుంటాడు. ఆ మృత్యువుకు సిద్ధముగా వుండడు. ఇంకా ఈ చూరు పట్టుకునే అనేక జన్మలు వేళాడుదామనేటటువంటి పద్ధతిగా, గబ్బిళం పద్ధతిగా వుంటాడు. 

ఈ శరీరాన్ని నేను విడవను, ఈ శరీరాన్ని నేను విడవను, ఈ శరీరమే నాకు కావాలి, శరీమందు వుంటేనే కదా, నేను ఏమైనా అనుభోక్తవ్యం అయ్యేది? కాబట్టి శరీరమును నేను విడువజాలను అని శరీరాన్నే పట్టుకుని, శరీర తాదాత్మ్యత భావము చేత పొందేటటుంవంటి నరకమునంతా అనుభవిస్తూ వుంటాడు. కాబట్టి మానవులందరికి ‘మర్త్యులు’ అని పేరు పెట్టారు.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

20 Sep 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 58  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 22 🌻

ఈ మనుష్యులు ఆత్మతత్వమును, ఆచార్యుని ఉపదేశమును శ్రద్ధగా విని, శ్రవణ, మనన, నిధి, ధ్యాసల ద్వారా ఈ ఆత్మతత్వమును, ఆత్మనిష్ఠగా ఆత్మవిచారణను ఆత్మనిష్ఠగా, ఆత్మానుభూతిగా మరల్చుకోవాలి అంటే, ఒక ఉపాయమున్నది.

ఏమిటంటే, సదా ఆచార్యుడు చెప్పినటువంటి ఉపదేశమును శ్రవణ, మనన, నిధి, ధ్యాసలు అనేటటువంటి నాలుగు సాధనలని ఆశ్రయించి, నిరంతరాయముగా, అవస్థాత్రయములో నేను ఆత్మస్వరూపుడను, అనే నిశ్చయమును, నిర్ణయమును కలిగివుండి, నీ శరీరయానమును పూర్తిచేయాలి. శరీరయానము ఇది ఒక ప్రయాణం లాంటిది.

మనం ఒక వాహనంలో ఎక్కామే అనుకోండి? ఆ వాహనాన్ని మనం నడుపుతున్నాం అనుకోండి, ఒక చోటునుంచీ మరొక చోటుకి ప్రయాణం చేస్తున్నామనుకోండి, అయినంత మాత్రమున… ఆ వాహనము నీవు కాదు కదా! రధము నీవు కాదు. రధికుడవు. 

కాబట్టి అట్లా ఆత్మతత్వమును అతిసూక్ష్మముగా వున్నటువంటి దానిని, ఈ శరీరాదికము నుంచీ వేరు పరిచి, నేను రధమును కాదు, నేను రధికుడను, నేను దేహమును కాదు, నేను దేహిని. నేను శరీరమును కాదు, నేను శరీరిని. నేను క్షేత్రమును కాదు, నేను క్షేత్రజ్ఞుడను. 

నేను క్షర పురుషుడను కాదు, అక్షరపురుషుడను. అనేటటువంటి పద్ధతిగా… వేరుపరుచుకోగలగడం రావాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. అలా వేరుపరుచుకోగలిగే సమర్థతను సంపాదించడమే ‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే!

‘ఆత్మసాక్షాత్కార జ్ఞానం’ అంటే ఆకాశం నుంచీ ఏమీ మెరుపులు, పిడుగులు పడవు. నీ నెత్తి మీద అంతకంటే అమృతవృష్ఠి ఏమీ కురవదు. నీవేమీ పైనుంచీ కిందకేమీ పడిపోవు. లేదు కిందనుంచీ పైకి ఉత్థాన పతనాన్ని చెందవు. భౌతికమైన మార్పులేమీ రావు. నీలో ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం చేత లభిస్తుంది. అదేమిటంటే ‘సర్వసాక్షిత్వము’.

అటువంటి సర్వ సాక్షిత్వ స్థితికి నువ్వు ఎదుగుతావు. అట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే వున్నారో, వారు శరీరాదికము నుంచీ వేరుపడినటువంటి వారు.

అంటే ఎలా అంటే, ఎంత కష్టపడినప్పటికీ, పాము తన శరీరము నుంచీ వేరుపడేటటువంటి కుబుసమును ఎట్లా వదిలి పెడుతున్నది? ఆ ముళ్ళ చెట్లలోకి, ఆ ముళ్ళ తీగల్లోకి వెళ్ళి శరీరమంతా రక్తధారలు ప్రవహిస్తున్నప్పటికీ, కుబుసము నుంచీ వేరు చేసుకుంటుంది. 

అట్లా, పాము కుబుసము వదిలినట్లుగా నీవు నీ శరీర తాదాత్మ్యత భావమును విడువవలెను. అట్లా ఎవరైతే విడుస్తారో, అట్లా ఆత్మను పొందినవారు ఎవరైతే వుంటారో, సర్వదుఃఖముల నుండి విముక్తుడై, బ్రహ్మానందమును అనుభవించును. 

ఏమిటండీ దీని వల్ల ఉపయోగం అనంటే, ‘బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం’ – అనేటటువంటి ప్రార్థన శ్లోకం ఏదైతే చెప్పుకుంటున్నామో, అది యథాతథముగా అనుభూతమై వుంటుంది. అట్లాంటి అనుభవస్థితిలో వుండి, ప్రయాణం చేస్తూ వుంటారు. శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధముగా వుంటారు. 

అటువంటి సిద్ధత్వాన్ని, బుద్ధత్వాన్ని పొందుతారు. కాబట్టి ఇలాంటిదానికి అధికారిత్వాన్ని పొందినటువంటి నచికేతుడుకి మోక్షద్వారము తెరువబడి వుండడంలో విశేషమేముంది? కాబట్టి, నచికేతుడికి మోక్షము సులభముగా లభిస్తుందనేటటువంటి సత్యాన్ని యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అతడు అధికారి కాబట్టి.

యమధర్మరాజు ఇంతవరకూ చెప్పిన విషయములు విని నచికేతుడు తనలోతాను ఇట్లు అనుకొనెను. అశాశ్వతమైన సాధన ద్వారా శాశ్వత పదవిని పొందజాలమని చెప్పుచునే నాచికేతాగ్ని చయనము చేత తాను ఈ నిత్య పదవిని పొందితినని చెప్పుచున్నాడు. 

మరల ఈ ఆత్మ అతి సూక్ష్మమైనదని, సులభముగా పొందదగినది కాదని, ఇంద్రియ నిగ్రహము ద్వారా యోగము అభ్యసించిన వారు తెలిసికొన గలరని చెప్పుచున్నాడు. నీ వంటి వారే దీనికి అర్హులని మధ్యలో నన్ను ప్రశంసించుచున్నాడు. అసలు విషయము చెప్పకుండా దాటవేయునేమోయని సంశయించి నచికేతుడు యమధర్మరాజు నిట్లడుగుచున్నాడు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

21 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 59   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 23 🌻

కాబట్టి, నచికేతుడు ఎంతటి బుద్ధిశాలో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. 

యమధర్మరాజు ఇప్పటివరకూ చెప్పినటువంటి అంశాలనన్నిటినీ నచికేతుడు తనలో తాను సమీక్షించుకున్నాడు. ఎట్లా సమీక్షించాడు? 

మొదటి వరంలోనేమో తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షి కోరిన వరాన్ని ఇచ్చారు. రెండవ వరంలో నచికేతాగ్నిచయనము గురించినటువంటి బోధంతా చెప్పారు. 

ఆ నచికేతాగ్ని చయనము అనేటటువంటి అగ్నిచయనాన్ని కర్మగా చేస్తే, నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అనీ చెప్తున్నాడు, రెండవ పద్ధతిలో ఏం చెప్తున్నాడంటే నకర్మణా – ఏం చేయడం ద్వారా కూడా నువ్వు పొందలేవు అని తద్‌విరుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా బోధిస్తున్నాడు. 

అతి సూక్ష్మము, అత్యంత సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి పద్ధతిని కూడా చెప్తూ, ఒక పక్కన ఏం చెప్తున్నాడు? అంటే నచికేతాగ్నిని అనుష్టయనం చేసి తాను అష్ట దిక్పాలకులలో ఒకడుగా అయ్యాను అనేటటువంటి స్థితిని కూడా చెప్తున్నాడు. ఈ రెండు విరుద్ధములను ఒకేసారి చెప్తున్నాడేమిటి? అనేటటువంటి దానిని సంశయించాడు. 

ఇంకేంటట? మధ్యమధ్యలో ఈ నచికేతుని యొక్క అధికారిత్వమును గురించి ప్రశంసించి, ఈయనని దాటవేస్తున్నాడేమో ఒకవేళ తాను ఏదైతే పొందాలని అనుకున్నాడో, తన ప్రశ్న ఏదైతే వుందో, మరణానంతరం జీవితం వుందా? మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి? అనే ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడేమో, కాబట్టి, అలాంటి పద్ధతి కాకుండా, ఆచార్యుడిని నేను స్పష్టముగా ప్రశ్నించాలి. ‘పరిప్రశ్నేన సేవయా’ – అనేటటువంటి పద్ధతిగా నేను తిరిగి ప్రశ్నించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మరల ప్రశ్నిస్తున్నాడు.

ఆచార్యా! నేను బ్రహ్మోపదేశమునకు అర్హుడనైతినేని, మీకు నా యందు సంపూర్ణ అనుగ్రహమున్న యెడల వేదవిహిత కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టియు, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము, దాని ఫలమునకు వేరైనట్టియు, కార్యకారణ జగత్తునకు వేరైనట్టియు, కాలత్రయముచే బాధింపబడక అపరిచ్ఛిన్నమైనదో అట్టి పరమాత్మ తత్వమును నీవెరిగి యున్నావు. నీవెరిగిన ఆ తత్వమునే నాకు బోధింపుమని నచికేతుడు యముని ప్రార్థించెను.

అయ్యా! నీవు… ‘నేను అధికారిని’ అని అంటున్నావు కాబట్టి, మీ వద్ద వున్నటువంటి, పరమాత్మ తత్వమునకు సంబంధించినటువంటి, బ్రహ్మోపదేశాన్ని నాకు చేయండి. ఎందువల్ల? అంటే, దాని విశేషం ఏమిటంటే…

కర్మలు ద్వివిధింబులు.
1. వేద విహితమైన కర్మ.
2. వేద నిషిద్ధమైన కర్మ.

వేద విహితమైన కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యములని పొందవచ్చు. వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు. 

వేద నిషిద్ధమైన కర్మ చేయడం ద్వారా ద్వంద్వానుభూతులైనటువంటి ఈ జగత్తునకు పుణ్యపాప కర్మల చేత, జనన మరణముల చేత, బాధించబడుతూ… స్వర్గ నరకముల చేత, అనుభూతములను పొందుతూ, సుఖదుఃఖాలను పొందుతూ, కష్ట నష్టాలను పొందుతూ… రాత్రి పగళ్ళయందు చరిస్తూ…. ఈ రకమైనటువంటి ద్వంద్వాలలో మునిగి తేలుతూ వుండేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. మరి ఈ రెండూ కూడా పరతత్వమును పొందింప జాలవు. 

కాబట్టి వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానము, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము…. ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఫలము ‘ఆత్మనిష్ఠ’ కాదు. కాబట్టి మీరు కార్యకారణ జగత్తుకు వేరైనట్టి… ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే కార్యకారణ వివేకం కనుక నీవు పొందకపోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు కాలేవు.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

22 Sep 2020


🌹.  కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 60  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 24 🌻

వివేకం ఎన్ని విధాలుగా వుంది?
నిత్యానిత్యవస్తు వివేకం
ఆత్మానాత్మ వివేకం
కార్యకారణ వివేకం
సదసద్‌ వివేకం
దృక్‌దృశ్య వివేకం

ఇందులో వరుసక్రమంలో రావాలన్నమాట. ముందుగా నిత్యానిత్యం, తరువాత ఆత్మానాత్మ, ఆ తరువాత కార్యకారణ. కార్యకారణ – కారణమేదో, కార్యమేదో నీకు స్పష్టంగా బోధపడేటటువంటి లక్షణం నీలో, పరిణామ ఫలితంగా నీకు రాకపోయినట్లయితే, అంటే కార్యకారణ వివేకాన్ని నీవు సముపార్జింక పోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు అయ్యే అవకాశం లేదు. అట్టి కార్యకారణములకు సాక్షీభూతమేదైతే వున్నదో, అదియే బ్రహ్మము.

ఇంకేమిటట? కాలత్రయాబాధితము కాదు. అట్టి బ్రహ్మము ఎటువంటిదట? భూత భవిష్యత్‌ వర్తమానములనే త్రిపుటి చేత బాధించబడటం లేదు. 

భూత భవిష్యత్‌ వర్తమానములందు ఎల్లకాలము ఎప్పుడూ వుండేది ఏదైతే వున్నదో, అదే బ్రహ్మము. కాబట్టి అపరిచ్ఛిన్నము. దాని లక్షణాలన్నీ నచికేతుడు చెబుతున్నాడు. బ్రహ్మము యొక్క లక్షణాలన్నిటినీ కూడా. ‘అపరిచ్ఛిన్నము’ – ఛిన్నము అంటే అనేకత్వము పొందినది.

అపరిచ్ఛిన్నము అనంటే ఏకము. ఎప్పుడూ ఎల్లకాలములందు ఏకమై వున్నదో, సత్యమై వున్నదో అటువంటి దానిని పరమాత్మ తత్వమును నీవెరిగి యున్నావు. ఆచార్యవర్యా! నీవెరిగియున్నావు. అటువంటి పరమాత్మ తత్త్వమును నాకు అనుగ్రహించుము. 

అటువంటి బ్రహ్మోపదేశమును నాకు అనుగ్రహింపుము. అని యముని ప్రార్థించుచున్నాడు నచికేతుడు. ఆ రకంగా ప్రార్థిస్తూ, తాను పొందవలసినటువంటి లక్ష్యం ఎడల, సరియైనటువంటి నిర్ణయాన్ని, సరియైనటువంటి మార్గాన్ని, సరియైనటువంటి ఆచరణను, సరియైనటువంటి నిశ్చయాన్ని కలిగివున్నాడు. శిష్యులకు ఇది చాలా ముఖ్యం. తాను ఏది పొందాలి అనేది స్పష్టంగా పట్టుకోవడం రాకపోయినట్లయితే, ఆ లక్ష్యభేదనం జరుగుదు. 

కాబట్టి ఎన్నిరకాలుగా నిన్ను ప్రకృతి ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికి, జగత్తు ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికి, నీ ఇంద్రియములు నిన్ను ఏమార్చే ప్రయత్నం చేసినప్పటికీ, నీలో వున్నటువంటి జీవభావం నిన్ను అధః పతనం చెందించే ప్రయత్నం చేసినప్పటికి, నీవు ఉత్తమగతి కలిగినటువంటి వాడవై, ఉత్తమ అనుశీలత కలిగినటువంటి వాడవై, ఉత్తమమైనటువంటి ప్రయత్నాన్ని కలిగినటువంటి వాడవై, నీ యొక్క జన్మసాఫల్యతను పొందించేటటు వంటి, పరమాత్మ తత్వమును గ్రహించేటటువంటి ప్రయత్నం చేయాలి. 

పరబ్రహ్మనిర్ణయాన్ని పొందే ప్రయత్నం చేయాలి. నీ ప్రయత్నం సదా బ్రహ్మనిష్ఠ యందు నిలబడి వుండేటట్లుగా నువ్వు అనుశీలత కలిగి వుండాలి. అదే రకమైనటువంటి ఓరియన్టేషన్ [orientation] అంటారు.

నీ లక్ష్యం వైపుకు నీవు తిరిగి వుండేటటువంటి, లక్ష్యములో నిలచివుండేటటువంటి, లక్ష్యములో నిలకడ కలిగి వుండేటటువంటి, స్థిరమైనటువంటి పద్ధతిని ఎవరైతే ఆశ్రయిస్తారో, వాళ్ళుమాత్రమే, ఈ ఆత్మనిష్ఠని, ఈ బ్రహ్మనిష్ఠని ఈ పరబ్రహ్మనిర్ణయాన్ని పొందగలుగుతారు.

ప్రతి తలపుని, ప్రతి మాటని, ప్రతి చేతని తనలో కదిలే ప్రతి కదలికని కూడా కేవలం ఈ ఆత్మనిష్ఠకి, బ్రహ్మనిష్ఠకి, పరబ్రహ్మ నిర్ణయానికి సరిపోతుందా లేదా? అనేటటువంటి గీటురాయి మీద ఎవరైతే చూసుకోగలుగుతారో, వాళ్ళు మాత్రమే దీనిని పొందగలుగుతారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group 

https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

23 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 61  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 25 🌻

యముడు అతని ప్రార్ధనను మన్నించి పరమాత్మ తత్వ విశిష్టత్వము నిట్లు చెప్పుచున్నాడు. వేదములన్నియు ఏ వస్తువు పొందదగినదని చెప్పుచున్నవో, ఏ వస్తువును పొందుటకు సర్వ తపస్సులు చేయబడుచున్నవో, ఏ వస్తువును పొందగోరి గురుకుల వాస రూపమగు బ్రహ్మచర్యం నాచరించుచున్నారో నీవు ఏ వస్తువును తెలియగోరుచున్నావో ఆ వస్తువును సంగ్రముగ చెప్పుచున్నాను. ఆ తత్వము ‘ఓం’ అని చెప్పబడుచున్నది.

చదివేటప్పుడు భావ స్ఫురణతో, వినేవాళ్ళకి ఏ భావం అందుకోవలసి వుందో ఆ భావాన్ని అందించేటటువంటి పద్ధతిలో చదవగలగడం రావాలి. అలాగే గ్రంధము ఏ రీతిగా అయితే బోధిస్తున్నారో ఆ బోధించేటటువంటి విధానాన్ని కూడా అందిపుచ్చుకునేటటువంటి విధానంలో చదువుకోవడం నేర్చుకోవాలి. అర్ధవంతంగా చదవాలి. భావయుక్తంగా చదవాలి. బుద్ధి పరిధిలో వుండి చదవాలి. 

సత్వగుణంతో వుండి చదవాలి. అలాగే ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం అందుకోగలుగుతాం. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ వారు వారు చదువుకునేటప్పుడు కూడా, వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు కూడా ఈ నియమాన్ని పాటిస్తే సులభంగా అందుకోగలుగుతారు.

ఇప్పుడేమంటున్నారు అంటే ఓంకార తత్వ విచారణ ప్రారంభిస్తున్నారు. ఈ ఓంకార తత్వ విచారణని ప్రారంభించే ముందు దాని యొక్క విశిష్టతని చెప్తున్నారు. 

ఋషులు దేనికొరకైతే తపస్సు చెస్తున్నారో, దేనిని పొందటం కోసమైతే అన్ని తపస్సులు నిర్దేశించబడినాయో, దేనిని తెలుసుకోవడం కోసమైతే అన్ని సాధనలు ఏర్పాటు చేయబడ్డాయో, దేనిని తెలుసుకోవడం కోసమైతే గురుకులవాసం, బ్రహ్మచర్యం వంటి నియమాలు ఏర్పరచబడ్డాయో,

దేనిని తెలుసుకోవడం కోసం వేదములన్నియు కూడా దేనిని గురించి స్తుతిస్తున్నాయో, దేనిని ఆశ్రయించి సర్వసృష్టి ఏర్పరచబడిందో, దేనిని తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వము యొక్క విశిష్టతని తెలుసుకోగలుగుతామో దాని యొక్క తత్వమే ఓంకార తత్వమనేటటువంటి పద్ధతిలో నచికేతునియొక్క ప్రార్ధనను మన్నించి యమధర్మరాజు బోధించడానికి ప్రారంభిస్తున్నాడు. 

ఇన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఓంకార తత్వమును మనందరం తెలుసుకోవలసినటువంటి అవసరం వుంది. ఈ ఓంకారోపాసన చాలా ముఖ్యమైనటువంటిది. 

ఎందుకనంటే ఈ ఓంకారోపసనను మించిన ఉపాసన మరియొకటి లేదు. మించిన సాధన కూడా లేదు. మించిన తపస్సు కూడా లేదు. మించిన నియమం లేదు. మించిన ధర్మం లేదు. మించినటువంటి తత్వం లేదు. ఈ రకంగా అన్నీ ఈ ఓంకారం తోనే ముడిపడి వున్నాయి. అన్ని మంత్రములు ఓంకారంతోనే ముడిపడి వున్నాయి. అన్ని బీజాక్షరముల యొక్క సంపుటీకరణము కూడా ఈ ఓంకారముతోనే చేయబడుతున్నది. కారణం ఏమిటంటే ‘ఆది ప్రణవ నాదం’.

ఆదియందు ఏర్పడినటువంటి నాదం ఉద్భవించినటువంటి స్థానంలో ఈ ఓంకారం అనేటటువంటి నాదం ఉద్భవించింది. ఈ మధ్యకాలంలో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సోలార్ ఎనర్జీ [Solar Energy] ని అంటే సూర్యుడు నుండి వచ్చేటటువంటి శక్తిని పరిణామం చెందించి సోనోగ్రాఫ్ [Sonograph] అనేదాని మీద గనక మనం చూసినట్లయితే, అది ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తున్నట్లుగా గుర్తించారు. కాబట్టి ఇలాంటి పరిశోధనలు ఈ మధ్య కాలంలో చాలా వైజ్ఞానిక పరమైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

25 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 62  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 26 🌻

సూర్యుని నుంచే నవగ్రహాలకు శక్తి అందుతోంది కాబట్టి, నవగ్రహాలు సూర్యుడి చుట్టూతానే పరిభ్రమిస్తున్నాయి కాబట్టి, దేనియొక్క ప్రభావం చేత ఈ ఆకర్షణా బలం అంతా ఏర్పడింది, దేనియొక్క ప్రభావం చేత ఇవి సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అనే పరిశోధనలో భాగంగా సూర్య శక్తిని నాద శక్తిగా మార్చి మనం గమనించినట్లయితే అది ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తున్నట్లుగా గుర్తించారు. 

అంటే నాదము బిందువు కళ ఈ మూడింటియొక్క సంయుక్త బిందువే సూర్యుడు అనేటటువంటి లక్షణాన్ని మనం గుర్తించగలుగుతున్నాము. ఒకే బిందు స్థానం నుండి నాదము, కళ – ప్రకాశ వస్తువైనటువంటి ప్రకాశము, అలాగే నాదమూ – ఈ రెండూ కూడా ఒక స్థానమునించే ఉత్పన్నమవుతున్నాయి.

ఆ స్థానము పేరు బిందువు. ఆ బిందు స్థానమే సూర్యుడు. ఆ సూర్య బిందు స్థానమునుంచే సృష్టి అంతా ఉత్పన్నమవుతున్నది. ఆ నాదం పేరు ‘ప్రణవ నాదం’ అనేటటువంటి నిర్ణయాన్ని నేటి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకి వచ్చారనమాట. కాబట్టి ఇది ఏనాటిదో.

మనకి లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే భూమి ఏర్పడినప్పటినించీ మన ఋషులు వేదప్రోక్తమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి సృష్టి ప్రమాణమైనటువంటి విధానంతో ఈ ఓంకార తత్వము – సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం అనే భాగంగా ఈ ఓంకార తత్వ విచారణ అనేటటువంటి దానిని ప్రతియొక్క ఆధ్యాత్మవాదులు, ఆధ్యాత్మిక సాధకులు, ఆత్మ వస్తువును తెలుసుకోవలనే ప్రయత్నంచేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓంకార తత్వ విచారణని తప్పక చేయవలసిన అవసరం వున్నది. 

దీనియందు పూర్తి అవగాహనా కలిగి వుండాలి. పూర్తి అనుసంధానమూ కలిగివుండాలి. పూర్తి నిమగ్నమైనటువంటి చిత్త ఏకాగ్రత కూడా కలిగి వుండాలి. ఈ మూడూ ఒక్కచోట కలిసినప్పుడు మాత్రమే ఈ ఓంకార తత్వములో సాధకుడు ప్రవేశించగలుగుతున్నాడు.

జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టుం అధిగచ్చతి అనే నాలుగు విధములుగా తెలుసుకొనుట, దర్శించుట, ప్రవేశించుట, అధిగమించుట వంటి విధానములతో ప్రతి ఆధ్యాత్మిక స్థితిలోనూ అంతర్ముఖ ప్రయాణం చేసేటటువంటి ప్రతి సాధకుడూ కూడా ఆ యా ఆంతరిక పరిణామ స్థితులను ఈ నాలుగు పద్ధతులుగా చేరుకొని పరిణమించి దాటుతూ వుంటాడు. 

కాబట్టి ఈ ఓంకార తత్వము గురించి సమగ్రమైన అవగాహన దాని యొక్క విశేషణం, దాని యొక్క విశిష్టత, అది పరమాత్మ తత్వమునకు, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందటానికి సరాసరి అయినటువంటి రాచబాట. సరాసరి అయినటువంటి మార్గం. సూటిగా వెళ్ళేటటువంటి మార్గం. 

కానీ నిదానంగా పరిణామం వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ [All of sudden] గా ఈ రోజు పొద్దున ఓంకారం చెప్తే సాయంకాలానికల్లా ఈ పరబ్రహ్మ తత్వము తెలియబడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఈ ఓంకార తత్వము గురించి పూర్ణమైనటువంటి అవగాహన కలిగి వుండాలి. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

26 Sep 2020


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 63 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 27 🌻

కాబట్టి నచికేతునికి కూడా ప్రధమముగా యమధర్మరాజు ఈ ఓంకారతత్వము యొక్క విశిష్టతను తెలియజెబుతూ ఓంకార తత్వము యొక్క వివరణని అందిస్తున్నారు.

ఆది ఓంకార శబ్ద వాచ్యము. ఏ పదము నుచ్ఛరించుటచేత ఏ వస్తువు శ్రోతకు స్ఫురించుచున్నదో ఆ వస్తువు ఆ పదమునకు వాచ్యమగును. ఆ పదము వాచికము. రామకృష్ణాది నామములనుచ్ఛరించునపుడు రాముని, కృష్ణుని రూపములు మనకు స్ఫురించునట్లుగా ఓంకారము నుచ్ఛరించుటచేత నామరూప రహితమైన, సూక్ష్మమైన పరబ్రహ్మమే స్ఫురించును. ఓంకారము వాచికము, పరబ్రహ్మము వాచ్యము. నీవెరుగగోరిన తత్వమిదియే.

ఈ పరబ్రహ్మతత్వమే నాశములేనిది. అన్నిటికంటే గొప్పది. అతి సూక్ష్మమైనది. మహత్తుకన్న మహత్తైనది. అణువుకన్న అణువైనదియునగు, ఈ బ్రహ్మము నెరిగిన వారి కోరికలన్నియు సిద్ధించును.

ఓంకార శబ్దము యొక్క, ఓంకార తత్వము యొక్క లక్షణాలని ప్రాధమికంగా మొట్టమొదట మనకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనము ఎవరికైనా సరే ఏదైనా ఒక శబ్దాన్ని గ్రహించగానే మానవ మేధస్సు (బుద్ధి) ఆ శబ్ద గ్రాహ్యతను దృశ్యరూపంగా మారుస్తుంది.

అంటే ఉదాహరణ ఏనుగు అనగానే నీకు తెలిసినటువంటి ఏనుగు యొక్క రూపాన్ని అది నీ కళ్ళముందు ఉంచుతుంది. ఏ శబ్దాన్ని విన్నప్పటికీ కూడా ఆ యా శబ్దముల యొక్క దృశ్యరూపాన్ని నీ కళ్ళ ముందు వుంచుతుంది. 

సాకార పద్ధతిగా సాధనలతో చిన్నప్పటి నుండి సాధనలతో అలవాటు పడినటువంటి మానవ మేధస్సు ఆ యా నామరూపాలతో కూడుకున్నటువంటి అర్చామూర్తులను దృశ్య రూపంగా తన కళ్ళ ముందు వుంచుతూ వుంటుంది.

కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ప్రాధమికంగా మొట్టమొదట తమతమ ఇష్ట దేవతా అర్చామూర్తులను, తమ తమ ఇష్టదేవతా రూపమైన సద్గురు మూర్తులను సాకార పద్ధతిగా భావించి ఆశ్రయించేటటువంటి విధానం ధ్యానంలో మొట్టమొదట ఏర్పాటు చేయబడింది. 

అయితే ‘ఓం’ అనేటటువంటి శబ్దమును వినగానే నీలో నిరాకార తత్వమైనటువంటి ఆకాశమునకు అతీతమైనటువంటి దృశ్యము గోచరిస్తుంది. ఏ సాకార తత్వమూ ఈ ఓంకారతత్వము చేత నిరూపించబడటము లేదు.

ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే రామ అనగానే రాముని యొక్క ఆకారం మనకి స్ఫురిస్తుంది. కోదండ రాముడు, జానకి రాముడు, దశరధ రాముడు, పట్టాభి రాముడు అలా రకరకాలైనటువంటి రామనామంతోటి మనం అనుబంధపడివున్నాం కాబట్టి, ఎవరికి ఇష్టమైనటువంటి రామ రూపం ఆ కళ్ళ ముందు మెదలాడుతుంది. 

అట్లాగే కృష్ణ శబ్దం వినగానే బాల కృష్ణుడో, గోపికా కృష్ణుడో, రాధా కృష్ణుడో, ధ్యానముద్రాంకిత కృష్ణుడో, గోవర్ధన గిరినెత్తిన కృష్ణుడో, కాళీయ మర్ధన సంఘటనలోని కృష్ణుడో, వెన్నదొంగిలించే కృష్ణుడో, రకరకాల రూపములైనటువంటి గీతా బోధకుడైనటువంటి గీతాచార్యుడైనటువంటి శ్రీ కృష్ణ మూర్తియో, విశ్వరూపమును ప్రదర్శించినటువంటి, విరాట్ రూపమును ప్రదర్శించినటువంటి కృష్ణమూర్తియో, ఎవరికైతే ధ్యాన మూర్తుల యందు ఏ ఆసక్తి కలిగిన వారు వుంటారో అటువంటి కృష్ణ మూర్తి యొక్క సందర్శనం జరుగుతుంది.

ఈ రకంగా నామ రూపములు స్ఫురిస్తూ వుంటాయి శబ్ద గ్రాహ్యత చేత. కారణమేమిటీ అంటే వాచ్యము, వాచకము. శబ్దరూపముగా వున్నప్పుడు వాచ్యమని, అది దృశ్యరూపము ధరించినప్పుడు వాచికమని పిలవబడుతున్నది. వాచ్య వాచికములు. లక్ష్య లక్ష్యార్ధములు.

వాచ్య వాచ్యార్ధములు అని అంటారనమాట. వేదాంత పద్ధతిలో ప్రతి ఒక్కరూ తప్పక గ్రహించవలసినది ఏమిటంటే వాచ్యార్ధ లక్ష్యార్ధములను తప్పక గ్రహించాలి. ఏమి విడవాలి అంటే వాచ్యము వాచికములో వాచ్యమును విడవాలి, వాచికమును ఆశ్రయించాలి. 

అంటే వాచ్య వాచ్యార్ధములలో వాచ్యార్ధమనే లక్ష్యాన్ని, లక్ష్య లక్ష్యార్ధములలో లక్ష్యార్ధమనేటటువంటి దానిని ఆశ్రయించాలి. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

27 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 64   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 28 🌻

బుద్ధి సూక్ష్మతని ఈ విచారణా క్రమములో మానవులందరూ తప్పక సంపాదించాలి. కారణం ఏమిటంటే అత్యంత సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమైనటువంటి పరబ్రహ్మమును గోచరింపచేసుకొనుట – అంటే కళ్ళకు కనబడేట్టుగా చేసుకొనడమనేది చాలా కష్ట తరమైనటువంటి పని. అది సాధ్యమయ్యేపని కాదు. 

ఎందుకంటే అది నిరాకార నిర్గుణ నిరంజన నిరుపమాన స్వరూపం అది. మరి అన్ని నకార శబ్దములతో కూడుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మమును సరాసరిగా చూడగలగడం అనేది సాధ్యం కావడం లేదు. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకొనగోరేవారందరికీ కూడా ఒక మార్గముండాలి కదా. ఆ మార్గము పేరే ఓంకారము.

ఓంకారమనే శబ్దమును ఆశ్రయించి ఉపాసన చేసేటటువారందరూ ఈ ఓంకారమును వాచికముగా గ్రహించి పరబ్రహ్మను వాచ్యముగా గ్రహించగలుగుతారు. ‘నీవెరుగగోరిన తత్వము ఇదియే’ అని నిశ్చయముగా తెలియజేస్తున్నారు.

నాయనా! నీవు మరణానంతరం ఏముంది అన్న ప్రశ్నను అడిగావు గానీ, అసలు నువ్వు తెలుసుకోదలచుకున్నది ఏమిటయ్యా అంటే సర్వకాల సర్వావస్థలయందును మార్పుచెందక వుండేటటువంటి పరబ్రహ్మ తత్వమేదైతే వుందో అటువంటి పరబ్రహ్మ తత్వమును తెలుసుకొనగోరుతున్నావు కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను. 

అది నాశము లేనిది అనేటటువంటి మొదటి లక్షణం చెప్పాడు. నశించేటటువంటివన్నీ జగత్తులోనివే. నశించేవన్నీ సృష్టిలోనివే. ఆద్యంతములు కలిగినటువంటివన్నీ పిపీలికాది బ్రహ్మపర్యంతము వుండేటటువంటివే అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతూ ఇంకా రెండు ఉపమానాలని అందిస్తున్నాడు. అత్యంత సూక్ష్మమైనది. 

సూక్ష్మము అంటే ఎంత సూక్ష్మమండి. అణువుకంటే అణువు. మహత్తు కంటే మహత్తు. “అణోరణీయాన్ మహతో మహీయాన్” అనేటటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారనమాట. అయితే సూక్ష్మాతి సూక్ష్మం ఎంతండీ అంటే ఒక కణాన్ని బేధించుకుంటూ బేధించుకుంటూ బేధించుకుంటూ చిట్టచివరికి వెళ్ళిపోయాం. మైనస్ మైనస్ మైనస్ మైనస్ మిల్లీ మైక్రానులదాకా కూడా వెళ్ళిపోయాం. 

అప్పుడు ఏదైతే వున్నదో అది గానీ, లేదా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాం, విశ్వ వ్యాపకంగా పెంచుకుంటూ వెళ్ళాం. కాస్మోసిస్ ఎంత వుందో అంత మేరకు పెంచుకుంటూ వెళ్ళాం. పెంచుకుంటూ వెళితే ఎంతయితే వున్నదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి వున్నది ఏదైతే వున్నదో అదంతా కూడా బ్రహ్మము. దానవతల పరబ్రహ్మము.

కాబట్టి ముందు దేనిని తెలుసుకోవాలటా? ఈ అణోరణీయాన్ మహతో మహీయాన్ గా వున్నటువంటి బ్రహ్మమును ఎరిగి, దానవతల అనేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు. 

ఇంకేమిటటా నీకు ప్రయోజనం అంటే ఈ అణువు నుండి మహత్తు వరకూ వున్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వారికి కామ్య సిద్ధి కలుగుతుందట. 

ఇదేమిటండీ అసలు కోరికలు త్యజిస్తేనే ఆత్మ విచారణకి పనికొస్తావని అంతకుముందు చెప్పి ఇప్పుడు మరలా కోరికలన్నీ సిద్ధిస్తాయి అంటారేమిటీ అంటే ఎవరైతే బ్రహ్మమును ఎరుగగోరుచున్నారో వారియొక్క లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగోరడం. అది ఆ ఒక్క కామ్యమే మిగిలివున్నది. ఇంకే కామ్యములు వారియందు మిగిలి లేవు. మోక్ష కాంక్ష. ముక్తి కాంక్ష. ఒక్క కోరిక మాత్రమే మిగిలి వుంది. 

ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి అనేటటువంటి బలీయమైన ఆకాంక్ష ఒక్కటే తీవ్ర మోక్షేచ్చ ఒక్కటే మిగిలివున్నది కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ “కోరికలన్నియూ తీరును“ అనేటటువంటి రూపంలో తెలియజేస్తున్నారు. 

ఈ రకంగా నచికేతునికి ఓంకార తత్వముయొక్క విశేషం “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” అనేటటువంటి సూత్రమును ఆశ్రయించి బోధించడం ప్రారంభించారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

28 Sep 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 65   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 29 🌻

ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్ఠమైన సాధనము. ఈ సాధనము నెరిగినవారు బ్రహ్మలోకమున పూజింపబడుదురు. బ్రహ్మమున సుఖింతురు. బ్రహ్మను తెలిసికొనుటకు ప్రయత్నించువారికి బ్రహ్మానందమున నుభవింపగోరు వారికి చిత్తైకాగ్రత మిక్కిలి యవసరము. 

అట్టి చిత్తైకాగ్రతకు ఓంకారరూపజపమే మిక్కిలి శ్రేష్ఠమైనది. వాచికమైన ఈ ఓంకారము వాచ్యమైన పరబ్రహ్మమునే స్ఫురింపజేయును. మరియు ఓంకారము అకార ఉకార మకార అమాత్రలను నాల్గుమాత్రలు కలది. 

స్థూలసూక్ష్మ కారణ మహాకారణములను శరీరములను, జాగ్రత, స్వప్న, సుషుప్తి, తురీయములను నాలుగవస్థలు కలది. ఈ మాత్రలు శరీరములు, అవస్థలు, వాచికములు. వాచ్యమైన పరబ్రహ్మమే లక్షార్ధము. ఈ విధమైన ధ్యానము చేయుట చేత, పరబ్రహ్మమునే పొందింప జేయుట చేత, ఓంకారాలంబనమే అన్నిటికంటే శ్రేష్ఠమైనది.

రెండవ భాగాన్ని ఎత్తుకుంటున్నారు. ఈ ఓంకారానికి ప్రాప్తి – పరబ్రహ్మప్రాప్తి – ఇదిచాలా ముఖ్యమండి ఈ శబ్దం. పరబ్రహ్మను తమ ప్రాప్తిని కనగలదే గానీ సాధన తో కనుగొనడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇది ప్రతిఒక్కరూ గ్రహించాలి. 

ఏ సాధనతో కూడా ఎవ్వరూ కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలిసికొనజాలరు. ఏ కర్మ, భక్తి, యోగ మార్గమందలి, జ్ఞాన మార్గమందలి సాధనలు కూడా ఈ పరబ్రహ్మమును నిర్ణయముగా పొందుటకు తెలిసికొనజాలరు. కారణమేమిటీ అంటే సాధనలకెల్లా అవతలిది. పరమైనటువంటిది.

“ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు” అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే అవాఙ్మానస గోచరమైనటువంటి స్థితిని తెలిసికొనగలిగి అనుభూతి చెందగలిగేటటువంటి స్థితికి చేరగలుగుతున్నారో, ఆ నిర్ణయాత్మక స్థితికి చేరగలుగుతున్నారో వారు మాత్రమే పొందగలిగేటటువంటి నిర్ణయ విధానం ఈ పరబ్రహ్మం. కాబట్టి దాని ప్రాప్తిని కనవలయు – అన్నారు పెద్దలు. పెద్దలెప్పుడూ కూడా మాటకు మాట – నూటికి మాట ఒక్కటియే సరి అనేపద్ధతిగా సూచిస్తారనమాట.

కాబట్టి ఆ సూచించే విధానం ఏమిటీ అంటే దాని ప్రాప్తిని కనవలయు అన్నారు. అట్లాగే ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్ఠమైన సాధనము. 

అయితే ఏమిటటా? మరి ఆ స్థాయికి మనం చేరాలి అంటే ఏదో ఒక మార్గం వుండాలి కదా, ఏదో ఒక ఉపాసన వుండాలి కదా, ఏదో ఒక ఆధారం వుండాలి కదా, ఏదో ఒక ఆలంబనం వుందాలి కదా, ఏదో ఒక ఆశ్రయం వుండాలి కదా అనేటటువంటి ధ్యానంలో ఈ ఓంకార ఉపాసనని, ఓంకార తత్వము గురించి తెలియజేస్తున్నారు.

ఓంకార సాధన ఎవరైతే తెలుసుకున్నారో వారందరికీ ఒక విశిష్టత కలుగుతుంది. ఏమిటంటే ఎవరైతే ఆజీవనపర్యంతము ఓంకారోపాసన చేస్తారో వారు బ్రహ్మలోకమున పూజించబడతారు. ఎందుకనిటా? ఓంకారము స్వయముగా బ్రహ్మ స్వరూపమే అయివున్నది.

“ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” అక్షర స్వరూపమైనటువంటిది. నాశము లేనటువంటిది. బ్రహ్మస్వరూపమైనటువంటిది. కాబట్టి బ్రహ్మమునెరిగినవారందరూ బ్రహ్మమే అగుదురు. “బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి” అనేటటువంటి సూత్రముననుసరించి బ్రహ్మమునెరిగినవారందరూ అట్టి బ్రహ్మానంద సుఖమునే అనుభవింతురు.

బ్రహ్మమును తెలుసుకొన ప్రయత్నించేవారందరూ కూడా బ్రహ్మవిదుడు బ్రహ్మవిద్వరీయుడు బ్రహ్మవిద్వరిష్ఠుడు అనే త్రివిధ బేధములతో జీవన్ముక్తులందరూ వుంటారనమాట. జీవన్ముక్తులందు బ్రహ్మవిదుడు బ్రహ్మవిద్వరీయుడు బ్రహ్మవిద్వరిష్ఠుడు అనేటటువంటి మూడు విధములైనటువంటి బ్రహ్మవిదులు వుంటారనమాట. ఆ బ్రహ్మవిదులు బ్రహ్మమునే పొందుతున్నారు. అట్టి స్థితిలో బ్రహ్మానందానుభవమునే పొందుతున్నారు. 

అయితే ఈ బ్రహ్మానందానుభవములో ఏం జరుగుతోందీ అంటే మానవ పద్ధతిగా వున్నటువంటి చిత్తము సచ్చిదానందములో వున్నటువంటి చిత్ స్వరూపముగా మారిపోతున్నది. ఇది చాలా ముఖ్యం. దీన్నే చిత్తైకాగ్రత అంటారు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

30 Sep 2020


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 66 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 30 🌻

చిత్తము ఏకాగ్రము అవడము అంటే అర్ధము ఏమిటంటే మానవ ఉపాధియందు అంతఃకరణముగా వున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి నాలుగు పనిముట్లు దానియొక్క ఆధారమైనటువంటి జ్ఞాత స్థానములో లయించిపోయినవి. అట్టి జ్ఞాత పరిణామ రహితమైనటువంటి కూటస్థునియందు చేరిపోయింది. ఈ చెరిపోయేటటువంటి విధానాన్నే చిత్తైకాగ్రత అంటారు. 

ఏ కూటస్థ శబ్దమైతే నీకు బ్రహ్మముగా బోధించబడుతుందో, బ్రహ్మాండ పంచీకరణకు ఆద్యముగా ప్రధమస్థానమందున్న కూటస్థ పదము ఏదైతే వున్నదో, ఆ కూటస్థ పదము చాలా ముఖ్యమైనటువంటిది. అట్టి కూటస్థ స్థితికి చేరాలి అంటే జ్ఞాతకి కూటస్థుడికి బేధం లేదు అనేటటువంటి స్థితిని నువ్వు సాధించాలి. అంటే అర్ధమేమిటంటే ప్రత్యగాత్మ బ్రహ్మ ఈ రెండూ ఒక్కటే. 

జ్ఞాత ప్రత్యగాత్మ. కూటస్థుడు బ్రహ్మము. ఈ ప్రత్యగాత్మ బ్రహ్మ అభిన్నులు అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం వైపుకు నీ స్ఫురణ పనిచేయడం మొదలుపెడుతుంది.

ఎవరైతే నేను కూటస్థుడను, నేను బ్రహ్మమును, నేను పరిణామము లేనివాడను, నేను ఏ మార్పూ లేనివాడను, నేను స్థాణువును, నేను నిరహంకారిని, నేను నిర్గుణుడను, నేను నిరవయవుడును, నేను నిరంజనుడను, నేను నిర్మలుడను అనేటటువంటి నకార పూర్వక లక్షణాలన్నీ ఆ కూటస్థ స్థితిలో ప్రాప్తించడం ప్రారంభిస్తాయి. 

ఈ లక్షణముల ద్వారానే పరబ్రహ్మమును స్ఫురింపచేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆట్టి పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఓంకారమును నాలుగు పద్ధతులుగా ఆశ్రయించవచ్చు. అకార ఉకార మకారములనే త్రిమాత్రుకాయుత ప్రణవ ధ్యానం ద్వారా ఆశ్రయించవచ్చు.

అలా కాకుండా (త్రిమాతృకలు కాకుండా) ఒక్కొక్క మాత్రనీ పట్టుకుని ఆశ్రయించేటటువంటి బీజాక్షరములను పట్టుకుని ఉపాసించే విధానమూ కలదు. ఇది కాకుండా అమతృకాయుత పద్ధతిగా కేవల లయయోగ విధాన పద్ధతిగా ఆశ్రయించేటటువంటి పద్ధతిగా కూడా ఓంకారోపాసన చేయవచ్చును. 

కారణమేమిటంటే ఈ నాలుగు మాత్రలు కూడా నాలుగు అవస్థలను, నాలుగు శరీరాలను, నాలుగు మాత్రలను తెలియజేస్తూ వున్నవి. నాలుగు శరీరములు ఏమిటివీ – స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు. వీటి యొక్క వివరణ అంతా కూడా సాంఖ్య విచారణలో స్పష్టముగా బోధించబడుచున్నది. ఉత్తరత్తరా రాబోయేటటువంటి బోధలో అవి కూడా వివరించబడతాయి.

స్థూల శరీరము అంటే తనకు తా కదలనది ఏదియో అది స్థూల శరీరము. సూక్ష్మ శరీరము – చలించుచున్నట్లు కనబడుతున్నప్పటికి స్వయముగా చలింపజాలనిది ఏదియో అదియే సూక్ష్మ శరీరము. స్థూల సూక్ష్మ వ్యవహారము – తాత్కాలికముగా ఉడిగినటువంటి స్థితి ఏదైతే కలదో అది కారణ శరీరము. ఇది కూడా స్వయముగా చలింపజాలదు.

మహా కారణ శరీరము – స్థూల సూక్ష్మ కారణ శరీరములను చలింపజేయుచు తనకు తా స్వయముగా కదులుచున్నట్లు కనపడుచున్నది ఏదో అది మహాకారణ శరీరము. కాబట్టి క్రిందున్న మూడింటికి లయస్థానమూ అయివున్నది, తనకు తా కదలగలిగే శక్తి కలిగి వున్నది, ఇతరులను కలిగించగలిగే శక్తి కూడా కలిగినటువంటి మహాకారణ శరీరము ఏదైతే వున్నదో అది నాలుగవ శరీరము.

ఇవే మరల మనం నాలుగవస్థలుగా దర్శించవచ్చు. అంటే అర్ధమేమిటి? జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయములు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు తమకు తా పనిచేస్తున్నట్లుగా కనబడుతున్నవి గానీ స్వయముగా పనిచేయడం లేదు.

ప్రతిఒక్కరూ జాగ్రదావస్థలో తనకు తా అన్ని పనులను చేస్తున్నట్లుగా చలనములు పొందుతున్నట్లుగా, చలనశీలత కలిగి వున్నట్లుగా, సర్వకర్మలను ఆచరిస్తున్నట్లుగా, ఆచరణ శీలత కలిగివున్నట్లుగా తోచుచున్నప్పటికీ కర్మ వశాత్తూ వారి వారి యొక్క పుణ్య పాప ఫలములను స్వయంకృతములను అనుభవించుట చేత వారు కదులుతున్నట్లు కనబడుతున్నది గానీ స్వయముగా వారికి కదలగలిగే శక్తి లేదు.

అట్లే స్వప్నావస్థయందు ఇంద్రియములు ఏమియూ లేకున్నను చలనశీలమైనట్టి మనసనే ఇంద్రియము ద్వారా మనో బుద్ధి చిత్త అహంకారముల మధ్య ఏర్పడుతున్న మనో వ్యాపార వ్యవహారము చేత కదులుతున్నట్లు కనపడుతున్ననూ అది కూడా స్వయముగా కదలగలిగే శక్తి లేనటువంటిది.

సుషుప్త్యావస్థ యందు జాగ్రత్ స్వప్నములందు ఏర్పడుతున్న కదలికలన్నియు లేమితనమును పొంది సుప్తచేతనావస్థ తాత్కాలికముగా నిరోధించబడి నిగ్రహించబడినట్లు కనబడుచున్నను స్వయముగా కదలిక లేనటువంటి శక్తి లేనందువల్ల జడముగా పడియుండుట అనేటటువంటి స్థితియందు తాను సాక్షిగా నిలబడివున్నటువంటి ప్రజ్ఞా స్వరూపముగా సుషుప్త్యావస్థ జరుగబడుచున్నది. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

02 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 67   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 31 🌻

కాని తురీయ స్థానమందు జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థల యొక్క సమస్త కదలికలు, సమస్త చేతనములు, చరాచరములైనటువంటి స్థితులన్ని జడ చేతన భాగములన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి స్వయం చేతనావస్థ గలిగి చైతన్య స్థితి యందు అగోచరరూపమైనటువంటి నిరాకార పద్ధతిగా, కేవల ప్రకాశ పద్ధతిగా, స్వరూప సాక్షాత్కార పద్ధతిగా, నిర్వాణ పద్ధతిగా తురీయమందు ఆవిర్భవిస్తున్నాయి. 

కాబట్టి ఈ రకంగా అకారము, ఉకారము, మకారము, అమాతృక – ఈ నాలుగూ- నాలుగు శరీరములను, నాలుగు అవస్థలను సూచిస్తూ వున్నాయి. కాని ఈ మాత్రలు ఈ శరీరములు ఈ అవస్థలు ఇదంతా కూడా వాచికములే గానీ లక్ష్యము కాదు. కాని వీటిని తెలుసుకొనడం ద్వారా, వీటిని దర్శించడం ద్వారా, వీటిని అనుభవించడం ద్వారా వీటి యొక్క లక్ష్యార్ధమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయములోనికి ప్రవేశించాలి అంటే అమాతృకను, తురీయమును, మహాకారణమును లక్ష్యించాలి. 

తద్వారా నీవు పరబ్రహ్మమును స్ఫురింపజేసేటటువంటి వాచ్యమైనటువంటి పరబ్రహ్మ లక్ష్యార్ధములో నీవు ప్రవేశించగలుగుతావు. పరబ్రహ్మమును గురించినటువంటి ధ్యానస్థితియందు చిత్తైకాగ్రత పొందాలి అంటే మానవులందరూ తప్పక చేయవలసినది ఏమిటంటే మూడు అవస్థల యందు తురీయ స్థితిలో నిలబడి వుండుట. మూడు శరీరములందు నాలుగవ శరీరమైనటువంటి మహా కారణ దేహ స్థితితో నిలబడియుండుట. 

మూడు మాత్రల యందు అకార, ఉకార, మకార మాత్రలను వదలి వేసి అర్ధమాత్రుక లేక అమాత్రుకాయుత ప్రణవ ధ్యానంలో నిరంతరాయముగా మగ్నత చెందియుండుట. ఈ రకముగా ఎవరైతే వుంటారో వారు మాత్రమే పరబ్రహ్మము యొక్క స్ఫూర్తిని, స్ఫురణను వాళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు. 

ఇట్టి పరబ్రహ్మ స్ఫూర్తిని, స్ఫురణని పొందాలి అంటే ఈ ఓంకార మార్గము, ఓంకార ఉపాసన, ఓంకార తత్వము, ఓంకార ఆలంబన, ఓంకారమనే ఆశ్రయము ఉన్నతమైనటువంటిది. అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. అన్ని ఉపాసనలకంటే, అన్ని సాధనలకంటే శ్రేష్ఠమైనటువంటి ఉపాసన.

కాబట్టి నీలో జరుగుచున్నటువంటి శ్వాస/ప్రాణము కూడా ఈ ఓంకారానుసంధానము ద్వారానే జరుగుచున్నది. నీ అంతర ఇడా పింగళ నాడులలో జరిగేటటువంటి హంస తత్వము ఏదైతే వున్నదో ఆ హంసతత్వము కూడా ఈ ఓంకారానుసంధానము చేతనే జరుగుచూవున్నది. కాబట్టి సర్వ జీవులయందు ప్రాణచలనము ఈ ఓంకారము యొక్క నాదానుసంధానమునించే ఉద్భవిస్తూవున్నవి.

కాబట్టి ఇట్టి ఓంకార తత్వమును ఎరుగుట శ్రేష్ఠదాయకమైనటువంటిది. ఆధారభూతమైనటువంటిది. పరమాశ్రయమైనటువంటిది. కాబట్టి తప్పక సాధకులందరూ ఈ ఓంకార ఉపాసనని విధిగా, యధావిధిగా, లక్ష్యార్ధ పద్ధతిగా, వాచిక పద్దతిగా, వాచ్యార్ధ పద్ధతిగా తెలుసుకుని దాని లక్ష్యమునందు ప్రవేశించుటకు సంసిద్ధులై చిత్తైకాగ్రత కలిగివుండి చిత్ స్వరూపముగా చిత్ జడ గ్రంధి బేధనము జరిగి చిత్ గా నిలబడి వుండేటటువంటి స్థితిలో ఈ సాధనని కొనసాగించాలి అనే రూపంలో యమధర్మరాజు గారు నచికేతుడికి బోధిస్తూవున్నారు.

ఆత్మ శరీరముతోపాటు పుట్టునది కాదు. శరీరము నశించిన దానితో పాటు నశించునది కాదు. ఈ ఆత్మకు కారణభూతమైనదేదియు లేదు. శరీరమునకు శుక్ల శోణితములు కారణమైనట్లు ఆత్మకు ఏ కారణమును లేదు. 

ఇది దేనికి కార్యము కానందున నశించునది కాదు. ఈ ఆత్మ నుండి ఏదియు పుట్టుట లేదు. వికారములు, పరిణామములేక భూతభవిష్యద్వర్తమాన కాలంలో ఒకటిగానే యుండుట చేత నిత్యుడనబడును. వృద్ధిక్షయములు లేనిది కనుక శాశ్వతమనబడును. పురాణమనబడును. శరీరము ఖండించబడినను ఆత్మ ఖండించబడదు. 

శరీరమునకు గర్భములో నుండుట, పుట్టుట, పెరుగుట, పరిణామము చెందుట, క్షీణించుట, మరణించుటయను వికారములు కలిగియున్నది. ఆ ఆత్మకు ఏ వికారములు లేవు. శరీరములో నున్నప్పటికిని ఆత్మకు శరీరధర్మములంటవు. సామాన్య మానవులు శరీరమునే ఆత్మగానెంచి, శరీరముతో బాటు ఆత్మయును నశించునని తలంతురు.

కనుకనే వారు నేను చంపెదననియు, చంపబడుచున్నాననియు తలంతురు. ఆ విధముగా తలంచువారిరువురును ఆత్మయనగా నేమియు తెలియనివారే. ఆత్మ ఎవరిని చంపుట లేదు, చంపబడుటలేదు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

03 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 67   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 31 🌻

ఇంకా ఇప్పుడు శరీర ధర్మమంటే ఏమిటి, ఆత్మ ధర్మమంటే ఏమిటి అనే రెండింటిని స్పష్టముగా నిర్వచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.

నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

ఈ రకంగా భగవద్గీత ప్రమాణ వాక్యం – ఇది కూడా ఉపనిషద్ వాక్యమే. ఈ ఉపనిషత్తులోనుంచే స్వీకరించారు.

నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

ఆత్మని చంపబడటం ఎవరివల్లా కాదు. “నైనం చిందంతి” ఇది చాలా ముఖ్యమైనటువంటిది. నేనెప్పటికీ మరణించేవాడను కాదు. నేనెప్పటికీ పుట్టినవాడను కాదు. నేనెప్పటికీ శోషింపబడేటటువంటివాడను కాదు. నేననేది ఎప్పటికీ కూడా నిత్యమైనటువంటిదే గానీ మార్పుచెందనటువంటిది. ఎందువల్లా అంటే శరీరానికి ఆరురకములైనటువంటి వికారాలు వున్నాయి. జాయతే అస్తి వర్థతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. అర్థం అయినదా అండీ? 

అంటే పుట్టుట, పెరుగుట, పరిణామము చెందించుట, క్షీణించుట, మరణించుట. (పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది) ఈ రకమైనటువంటి ఆరు రకములైనటువంటి షడ్ వికార జయము కలగాలట. 

ఎవరికైతే ఆత్మవిద్య సాధ్యమైందో వారికి షడ్ వికార జయం కలుగుతుంది. ఆ షడ్ వికార జయంచేత నీవు వికార రహితుడివిగా మారతావ్. ఎప్పుడైతే వికారరహితుడిగా మారావో అప్పుడేమయిందీ – నిర్వికారిగా వుండేటటువంటి అవకాశం కలుగుతుంది. “ఊర్ద్వశ్చ నిరాకారో అధశ్చ నిర్వికారతః” అనేటటువంటి సూత్రం నీకు తెలుస్తూ వుంటుంది. చాలా ముఖ్యమైనటువంటిదనమాట ఇది. 

“ఊర్ద్వశ్చ నిరాకారో అధశ్చ నిర్వికారతః”

ఈ రెండు లక్షణములు కూడా ఆత్మ శబ్దానికి సంబంధించినటువంటివి. అర్ధమైందా అండి? ఈ నిర్వికారత అనేటటువంటి లక్షణం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఇది పుట్టదు, పెరగదు, పరిణామము చెందదు, క్షీణించదు, మరణించదు. 

ఎందుకనీ అంటే ఈ ఆరు వికారములు కలగాలి అంటే శరీరము ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకోవాలి. శుక్లశోణిత సంయోగముచేత శరీరము ఏర్పడుతోంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కాని అలా శుక్లశోణిత సంయోగముతో ఈ ఆత్మ ఏర్పడటం లేదు. దానికంటే ముందు నుంచే వున్నది.

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్మహత్ మహతో మహదహంకారః మహదహంకారో ఆకాశః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నియోర్ ఆపః ఆపయోర్ పృధ్విః పృధ్వియోర్ అన్నం అన్నంయోర్ ఓషధిః ఓషధియోర్ జీవః

ఈ రకంగా క్రమ సృష్టి కలిగినప్పటికీ ఈ సృష్టి అంతటికీ ముందున్నటువంటి స్వరూపం ఏదైతే వున్నదో అది బ్రహ్మము. అదే ఆత్మ. స ఆత్మ. కాబట్టి శరీరముతోపాటు ఆత్మ పుట్టుటలేదు.

కాబట్టి శరీరము నశించినచో దానితో పాటు నశించదు. కారణభూతమైనది ఏదియునూ లేదు. ఈ పంచభూతములలో ఏది కారణమైనది దీనికి. ఈ సృష్టికంతటికీ కారణస్వరూపము ఏమిటీ అంటే పంచభూతాలు అని అంటాం. ఎందుకనీ ఇది పంచభూతాత్మకమైనటువంటి సృష్టి. 

ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఆయా పంచభూతముల సంయోగ వియోగముల చేత, సంయోజన వియోజనముల చేత ఏర్పడుతూ వున్నది. 

అన్ని ఇంద్రియములు, ఇంద్రియ ధర్మములు, ఇంద్రియాధిష్టానములు, ఇంద్రియార్ధములు అయినటువంటివన్నీ కూడా ఆ పంచభూతాత్మక మైనటువంటి గుణముల సంయోజనము చేతనే ఏర్పడుతున్నవి. కాని ఆత్మకు ఈ పంచభూతములు కారణము కాదు. ఎందువల్లనంటే ఈ పంచభూతములకంటే ముందు వున్నది ఏదో అదే ఆత్మ. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

04 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 68   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 32 🌻

ఇంకేమిటటా? మనము జన్మతః జననమనే కార్యముతో మొదలుపెట్టి మరణమనే కార్యముతో ముగిస్తూ వున్నాము, శరీర యాత్రని. ఇదొక శరీర యాత్ర. కాని ఆత్మ ఎక్కడికీ ప్రయాణించదు, ఆత్మ ఏ కార్యమూ చెయ్యదు. అది అకార్యము. కార్యమునకు కాదు. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యకపోవడం చేత గానీ నీవు ఆత్మ వస్తువుని తెలుసుకొనజాలవు. 

ఇంకా ఏమిటటా? ఈ శరీరం ఒక కాలంలో వుంది. ఒక కాలంలో పరిణమించింది. ఒక కాలంలో పుట్టింది. ఒక కాలంలో పోతుంది. కాబట్టి మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు పరిణామము చెందుతూ వున్నది. కాని ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగనే వున్నది కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములనేవి లేవు. ఒక కాలమందు వున్నదని, ఒక కాలమందు లేనిదనీ చెప్పుటకు వీలు లేకుండా వున్నది.

ఇంకా ఏమిటటా? ఈ శరీరము పుట్టినప్పుడు చాలా చిన్న రూపముతో వున్నది. తరువాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తరువాత పరిణామం చెందటం ప్రారంభమయింది. వృద్ధి చెందింది, పరిణామం చెందింది తిరిగి ఏమయింది క్షయించబడుతోంది. క్షీణించబడుతోంది ఒక స్థాయికి వచ్చిన తరువాత. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అవస్థల ద్వారా వృద్ధి క్షయాలను పొందుతూ వున్నది. కాని ఆత్మకు ఈ వృద్ధి క్షయములు లేవు. దానికెట్టి రూప పరిణామములు లేవు. దానికి నామ రూపములు అంటవు.

ఇంకేమిటటా? పురాతనమైనటువంటిది. పురాతనమంటే ఈ సృష్టికి ముందున్నటువంటి స్థితి నుంచీ సృష్టి మరలా లయించబడి పోయినప్పటికీ మార్పు చెందకుండా వుండేటటువంటిది ఏదైతే వుందో అది ఆత్మ. 

కాబట్టి ఎప్పటినించీ వుందయ్యా? ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వున్నది. కాబట్టి పురాణము అనగా అర్ధమేమిటంటే పురాతనమును గురించి తెలియజెప్పునది ఏదో అది పురాణము. పునః ఆయతనః ఇతి పురాతనః. అర్ధమైందా అండి?

పురమునందు ఈ సృష్టి అనేటటువంటి పురమునందు ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై వున్నటువంటి బ్రహ్మము ఏదైతే వున్నదో ఈ శరీరము అనేటటువంటి పురము నందు ఆయతనం ఆశ్రయము అధిష్టానము ఏదైతే అయి వున్నదో అటువంటి ఆత్మ – అటువంటి బ్రహ్మ. 

ఇది తెలుసుకోవలసినటువంటి అంశం. ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుచున్నాయో వాటికి పురాణములని పేరు. కాబట్టి అష్టాదశ పురాణములకి కూడా లక్ష్యము ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే. పరమాత్మ తత్వ బోధకమే.

కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ విషయముగానే చెప్పబడినప్పటికీ, చెప్పబడిన కధా కధన రీతిలో బేధముండవచ్చునేమో గానీ వాటి యొక్క లక్ష్యార్ధం మాత్రం ఆత్మతత్వమును గ్రహించడం మాత్రమే. అట్లాగే, ఎవరికైతే ఈ శరీరములో వున్నప్పటికీ ఆత్మకు ఏ రకమైన వికారమూ అంటుట లేదు. 

ఎలా అంటే ఆకాశములో మేఘములు చలించుచున్నట్లు కనబడుచున్నవి. కాని ఆకాశమును ఏమైనా మేఘములు అంటినయ్యా అంటే అంటలేదు. ఆకాశములో వర్షము మేఘముల ద్వారా ఏర్పడినట్లు కనబడుచున్నది. 

కాని ఆ మేఘముల వల్ల ఏర్పడిన వర్షము చేత ఆకాశము తడుపబడుచున్నదా అంటే తడుపబడుట లేదు. అదే ఆకాశమందు అగ్ని స్వరూపము కూడా చలించుచున్నట్లు కనబడుచున్నది. కాని అట్టి ఆకాశము అగ్ని చేత దహించబడుతున్నదా అంటే దహించబడుట లేదు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

05 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 68   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 32 🌻

ఇంకేమిటటా? మనము జన్మతః జననమనే కార్యముతో మొదలుపెట్టి మరణమనే కార్యముతో ముగిస్తూ వున్నాము, శరీర యాత్రని. ఇదొక శరీర యాత్ర. కాని ఆత్మ ఎక్కడికీ ప్రయాణించదు, ఆత్మ ఏ కార్యమూ చెయ్యదు. అది అకార్యము. కార్యమునకు కాదు. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యకపోవడం చేత గానీ నీవు ఆత్మ వస్తువుని తెలుసుకొనజాలవు. 

ఇంకా ఏమిటటా? ఈ శరీరం ఒక కాలంలో వుంది. ఒక కాలంలో పరిణమించింది. ఒక కాలంలో పుట్టింది. ఒక కాలంలో పోతుంది. కాబట్టి మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు పరిణామము చెందుతూ వున్నది. కాని ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగనే వున్నది కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములనేవి లేవు. ఒక కాలమందు వున్నదని, ఒక కాలమందు లేనిదనీ చెప్పుటకు వీలు లేకుండా వున్నది.

ఇంకా ఏమిటటా? ఈ శరీరము పుట్టినప్పుడు చాలా చిన్న రూపముతో వున్నది. తరువాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తరువాత పరిణామం చెందటం ప్రారంభమయింది. వృద్ధి చెందింది, పరిణామం చెందింది తిరిగి ఏమయింది క్షయించబడుతోంది. క్షీణించబడుతోంది ఒక స్థాయికి వచ్చిన తరువాత. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అవస్థల ద్వారా వృద్ధి క్షయాలను పొందుతూ వున్నది. కాని ఆత్మకు ఈ వృద్ధి క్షయములు లేవు. దానికెట్టి రూప పరిణామములు లేవు. దానికి నామ రూపములు అంటవు.

ఇంకేమిటటా? పురాతనమైనటువంటిది. పురాతనమంటే ఈ సృష్టికి ముందున్నటువంటి స్థితి నుంచీ సృష్టి మరలా లయించబడి పోయినప్పటికీ మార్పు చెందకుండా వుండేటటువంటిది ఏదైతే వుందో అది ఆత్మ. 

కాబట్టి ఎప్పటినించీ వుందయ్యా? ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వున్నది. కాబట్టి పురాణము అనగా అర్ధమేమిటంటే పురాతనమును గురించి తెలియజెప్పునది ఏదో అది పురాణము. పునః ఆయతనః ఇతి పురాతనః. అర్ధమైందా అండి?

పురమునందు ఈ సృష్టి అనేటటువంటి పురమునందు ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై వున్నటువంటి బ్రహ్మము ఏదైతే వున్నదో ఈ శరీరము అనేటటువంటి పురము నందు ఆయతనం ఆశ్రయము అధిష్టానము ఏదైతే అయి వున్నదో అటువంటి ఆత్మ – అటువంటి బ్రహ్మ. 

ఇది తెలుసుకోవలసినటువంటి అంశం. ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుచున్నాయో వాటికి పురాణములని పేరు. కాబట్టి అష్టాదశ పురాణములకి కూడా లక్ష్యము ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే. పరమాత్మ తత్వ బోధకమే.

కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ విషయముగానే చెప్పబడినప్పటికీ, చెప్పబడిన కధా కధన రీతిలో బేధముండవచ్చునేమో గానీ వాటి యొక్క లక్ష్యార్ధం మాత్రం ఆత్మతత్వమును గ్రహించడం మాత్రమే. అట్లాగే, ఎవరికైతే ఈ శరీరములో వున్నప్పటికీ ఆత్మకు ఏ రకమైన వికారమూ అంటుట లేదు. 

ఎలా అంటే ఆకాశములో మేఘములు చలించుచున్నట్లు కనబడుచున్నవి. కాని ఆకాశమును ఏమైనా మేఘములు అంటినయ్యా అంటే అంటలేదు. ఆకాశములో వర్షము మేఘముల ద్వారా ఏర్పడినట్లు కనబడుచున్నది. 

కాని ఆ మేఘముల వల్ల ఏర్పడిన వర్షము చేత ఆకాశము తడుపబడుచున్నదా అంటే తడుపబడుట లేదు. అదే ఆకాశమందు అగ్ని స్వరూపము కూడా చలించుచున్నట్లు కనబడుచున్నది. కాని అట్టి ఆకాశము అగ్ని చేత దహించబడుతున్నదా అంటే దహించబడుట లేదు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 69   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 33 🌻

“ఆకాశస్య సంభూతాత్మా” అనవచ్చునా అంటే అనరాదు. అంటే అర్ధమేమిటి? నీ కళ్ళముందున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆకాశమే మిగిలిన నాలుగు భూతముల చేత ప్రభావితము కాకుండా వున్నట్టు కనబడుతున్నది కదా. 

అట్టి ఆకాశమునకంటే ముందుగా వున్నటువంటి ఆత్మ స్వరూపము, అధిష్టానముగా వున్న ఆత్మ స్వరూపము, ఆశ్రయముగా వున్న ఆత్మస్వరూపము తదుపరి ఏర్పడినటువంటి వాటి చేత ప్రభావితమగుట, బాధింపబడుట అసత్యము, సాధ్యము కాదు. ఇంకా, మరి ఆకాశమునకంటే ముందున్నటువంటి సూర్య ప్రకాశము ఆత్మ ప్రకాశము వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడనేటటువంటి అధిష్టాన ధర్మము కలిగినటువంటి ఆత్మ స్వరూపము, స్వరూప జ్ఞానమును ఎవరైనా ఒకరు చంపుతారని చంపెదనని చనిపోతుందని అనడం అసంబద్ధం కదా. 

కాబట్టి చంపుట గాని చంపబడుట గాని చనిపోవుటగాని శరీర గతమైన లక్షణములే గాని ఆత్మ లక్షణము కావు. ఇట్టి ఆత్మ లక్షణములను తప్పక మానవులందరూ పూర్తిగా శ్రవణ మనన నిధి ధ్యాస యుక్తముగా ఆత్మస్వరూప లక్షణములను చక్కగా అనుశీలించవలసిన అవసరము వున్నది. 

ఒకవేళ ఈ ఆత్మ లక్షణమునకు వ్యతిరేకముగా నీకెప్పుడైనా తోచినట్లయితే అపుడు శరీర గత ధర్మములను ఆశ్రయించావు అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందాలి. ఏ భావములోనైనా, ఏ ఆలోచనలో అయినా ఈ శరీర ధర్మమేమిటి ఆ ఆత్మ ధర్మమేమిటి అని చక్కగా విచారణ చేసి ఆత్మ ధర్మమును ఆశ్రయించి ఆత్మ భావమునందు స్థిరముగా నిలబడి వుండటమే సాధకులకు అత్యావశ్యకమైనది.

కాబట్టి ఆత్మ ఎవరినీ చంపుటా లేదు, చచ్చుటా లేదు. ఆత్మకు రెండు లక్షణములూ లేవు. ఏమిటవీ? చంపబడదు, చనిపోదు. కాబట్టి ఎవరైనా చనిపోయారు అంటే అర్ధమేమిటంటే వారి శరీరము మాత్రమే చనిపోయింది. వారు చనిపోయే అవకాశం లేదు. ఈ రకమైనటువంటి సత్యాన్ని తప్పక మానవులు నిర్ణయాత్మకంగా గ్రహించవలసినటువంటి అవసరం వున్నది. అర్ధమయిందా అండి? ఈ రకంగా నీవు ఈ అంశాలను గ్రహించుకోవాలి. 

ఇలా గ్రహించుకున్న తరువాత నీ నిజ జీవితంలో నువ్వు ఈ ఆత్మ భావనలో నిలకడ చెంది వుండటమనేది అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే అన్నీ ఇంద్రియములతో ఇంద్రియార్ధములతో విషయములతో కూడుకుని వున్నటువంటి భావనలు భావములే కలుగుతూ వుంటాయి.

అసంబద్ధమైనటువంటి శరీర ధర్మానుసారము వున్నటువంటి, మనో ధర్మానుసారము వున్నటువంటి, ఇంద్రియములతో కూడుకున్నటువంటి, గుణములతో కూడుకున్నటువంటి, వాసనలతో కూడుకున్నటువంటి, శరీరములతో కూడుకున్నటువంటి, అవస్థలతో కూడుకున్నటువంటి, కాలత్రయముతో కూడుకున్నటువంటి, కాలత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, దేహత్రయం, జననమరణాలతో కూడుకున్నటువంటి, జరామరణ మృత్యు స్వరూపమైనటువంటి, ఏదో ఒక కాలంలో నేను చనిపోతాను కదా అనేటటువంటి భావన చేత మానవుడు శరీర ధర్మాన్ని పొందుతున్నాడు.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 70   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి – 34 🌻

పుట్టాం కదా పోక తప్పదు కదా! అంటూ వుంటారు ప్రతి మానవుడూ కూడా. ఏది పుట్టింది ఏది పోతోంది అనే ప్రశ్న వేసుకొనజాలము. వృద్ధాప్యంలో వున్నటువంటి వాళ్ళని ఎవరిని మనం పలకరించినా కూడా ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది, వచ్చాం కదా ఏదో ఒక రోజుకి పోవాలి కదా అంటూంటారు. ఎప్పుడూ మరణము యొక్క సంగతిని మృత్యువు యొక్క సంగతిని స్మరిస్తూ వుంటారు. కారణం ఏమిటట?

అంటే శరీర త్యాగం చేస్తున్నాను, శరీరాన్ని ఉపయోగించుకున్నాను, శరీర మనే గృహాన్ని ఉపయోగించుకున్నాను, శరీరమనే ఆశ్రయాన్ని ఉపయోగించుకున్నాను, శరీరమనే వస్త్రాన్ని ధరించాను, శరీరమనేటటువంటి పనిముట్టును వాడుకున్నాను, దానితో ఔపాసన తీరింది కాబట్టి విసర్జిస్తున్నాను.

నేను సర్వకాల సర్వావస్థలయందును సర్వదా నేను ఎల్లకాలము వున్నవాడను. ఏ మార్పు లేనివాడను. అప్రమేయుడను. గంభీరుడను. భావనాతీతుడను. నిరుపమానుడను. నిశ్చలుడను. నిరంతరాయముగా నిర్గుణుడను. నిరహంకారిని. ఈ రకమైనటువంటి లక్షణాలతో నేను శరీరమును త్యజిస్తున్నాను అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే వుంటారో వారు ముక్తులు.

నేనే పుట్టాను నేనే పోతాను, ఎప్పటికైనా పోకతప్పదు కదా. నేను శరీరం కాబట్టి నేను ఎట్టైనా పోతాను అనేటటువంటి మరణ భయాన్ని, మృత్యుభయాన్ని ఏ రూపంలో పొందినప్పటికీ కూడా – చాలా మందికి చాలా రకాలైన భయాలు వుంటాయి- ఏ భయమనేటటువంటి స్పర్శ ఏ రూపంలో నీకు తగిలినప్పటికీ, ప్రభావితమైనప్పటికీ తప్పక నీకు మృత్యు భయము వుండక తప్పదు.

అన్ని భయములూ కూడా ఆ మృత్యు భయము ప్రాణ భీతి యొక్క ప్రతిబింబములే. కాబట్టి భయరహిత స్థితి, అభయం – వేదాంత తత్వ విచారణ యందు ప్రధమ ప్రయోజనం అభయం – భయ రహిత స్థితికి చేరుకుంటావు. ఎందుకని? చంపేవాడెవడు? చచ్చేవాడెవడు?

అశోచ్యా నవ్యసోచస్తవం ప్రజ్ఞావాదాంశ భాషసే |

గతాసూన గతాసూంచ్య నానుసోచ్యంతి పండితః ||

మన గురించే మొట్టమొదటే శ్రీకృష్ణుడు గీతాచార్యుడు “అశోచ్యానవ్యసోచస్తుం” శోకింప తగనివాటి గురించి శోకించుట తగదు అని మనందరికీని ఉద్దేశ్యించి అర్జునిని తాత్కాలికముగా ఉద్దేశించి చెప్పినట్లు చెప్పినప్పటికీ మనయొక్క మూఢమతిత్వాన్ని పోగొట్టడానికి ఈ పద ప్రయోగాన్ని చేశారనమాట.

కాబట్టి ప్రతిఒక్కరూ తప్పక ఈ విధానాలని ఈ ఆత్మ ధర్మాన్ని, ఈ శరీర ధర్మాన్ని, దీని యొక్క బేధమును, శరీర ధర్మ త్యాగమును, ఆత్మ భావ ఆశ్రయమును పొందేటట్లుగా మనయొక్క నిత్య జీవిత సాధనని మనం జాగ్రత్తగా చేసుకోవలసినటువంటి అవసరం వున్నదని నచికేతుడి ఆధారంగా యమధర్మరాజు మనకి బోధిస్తూ వున్నారు.

ప్రశ్న: ప్రతి ఒక్కరూ కూడా వారియొక్క లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకుని వుండాలని, లక్ష్యము పట్ల స్పష్టత లేకపోతే ప్రయాణము సరిగా సాగదు అని, వారు ఎక్కడికి చేరాలనుకుంటున్నారనే గమ్యము పట్ల తగిన అవగాహన కలిగి వుండాలని చెప్పారు.

అంటే అది స్వస్వరూప లక్షణమే కదా స్వామి. అంటే స్వరూప లక్షణం తెలిస్తే సరిపోతుందా?

సమాధానము: నీవు ఏ స్థితిలో వున్నా ప్రయాణము మొదలు పెట్టావన్న దగ్గరి నుండి మొదలు పెడితే ఈ క్రమానుగతిలో ఏ ఏ స్థితుల ద్వారా నువ్వు లక్ష్యాన్ని చేరతావు అనే ప్రగతిశీల మార్గమంతా నీకు బాగా తెలిసి వుండాలి.

దేని తరువాత ఏదవుతుంది, దేని తరువాత ఏమొస్తుంది, దేని తరువాత ఎలా జరుగుతుంది అనేటటువంటి క్రమమార్గమంతా నువ్వు తెలుసుకున్నవాడవై వుండాలి. ఆ ప్రయాణాన్ని సరిగా చేయడానికి కావలసినటువంటి సమర్ధతని సరియైనటువంటి గురువు ద్వారా ఆశ్రయాన్ని పొందినటువంటి వాడవై వుండాలి. ఆ రకంగా మాత్రమే ఈ ప్రయాణం పూర్తవుతుంది. – విద్యా సాగర్ స్వామి

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam#చైతన్యవిజ్ఞానం#PrasadBhardwaj#కఠోపనిషత్‌ #చలాచలభోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

08 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 71   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -01 🌻

ఇప్పుడు ఆత్మను తెలుసుకొను విధము చెప్పబడుచున్నది.

పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కలి సూక్ష్మమైనది. మహత్‌ పరిమాణము గల ఆకాశాదికము కంటే మిక్కిలి మహత్తరమైనది. సర్వవ్యాపకమగుట చేత పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి ఉన్నది.

అందుచేత అణువుకంటే అణువుగాను, మహత్తుకంటే మహత్తుగాను ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఈ ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసికొనటకు ఆ క్రతువు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడు కాంచుచున్నాడు. 

ఎందుచేత ననగా వేద విహిత కర్మలను ఫలాపేక్షలేక, ఆచరించువాని చిత్తము నిర్మలమగును. ఎప్పుడు ఇంద్రియములు, మనస్సు నిర్మలమగునో అప్పుడు వాని బుద్ధియూ ప్రసన్నముగా నుండును. బాహ్యవిషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలిసికొనును. ఇట్లు తెలుసుకొనిన వాని శోకము నశించును, ఆత్మానందము అనుభవించును.

ఆత్మ యొక్క విధానమును తెలుసుకోవటానికి, ఆత్మను తెలుసుకొనే విధానాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా. పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. ‘శ్యామాదికము’ – అనే ఉపమానము వేశారు ఇక్కడ. ‘శ్యామాకాశ్చమే’ – అని నమకం, చమకం అనే రుద్రంలో వస్తుంది. 

అంటే, అర్థం ఏమిటంటే జడ చేతన సృష్టిలో, జడ సృష్టి అయినటువంటి వృక్షములు ప్రథమ విత్తనము. దాని పేరు శ్యామకము అని పేరు, శ్యామాకాశ్చమే.. మరొక వాచ్యార్థంలో శ్యామకము అంటే ‘చామదుంపలు’ అని కూడా అర్థం. అంటే ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే ఉందో, ఏదైతే మరల మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో, ఆ విత్తనం కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. 

మర్రి విత్తనంలో మర్రిచెట్టు దాగి వుంది. మర్రి విత్తనం ఆవగింజ అంత వుంది. కానీ మర్రి చెట్టు మహావృక్షం. మరి ఈ ఆవగంజంత ఉన్నటువంటి విత్తనం లోపల, అంత పెద్ద మర్రి చెట్టు ప్రావిర్భవింప చేయగలిగేటటువంటి శక్తి ఆ విత్తనంలో ఇమడ్చబడివుంది.

కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మమైనది. శక్తి కంటే ఆధారభూతమైనటువంటి చైతన్యము సూక్ష్మము. చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మము. ఆత్మ కంటే పరమాత్మ మిక్కిలి సూక్ష్మమైనది.

కాబట్టి, ఈ రకంగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థాయీ భేదములతో… ఇది వివరించ పూన బడుతుంది. ఎంత సూక్ష్మ తరమైతే, అంత వ్యాపక ధర్మాన్ని కలిగి వుంటుంది. ఈ అంశాన్ని మనము వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాము.

ఉదాహరణ: ఎక్స్‌ రే కిరణాలు మన కంటికి కపపడవు. సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్లుగా తోస్తున్నది. కానీ ఎక్స్‌ రే కిరణాలు కనపడవు. అందువలననే మనిషి ద్వారా అవి ప్రసరింపబడి ఆ ఎక్స్‌ రే ఫిల్మ్‌ తయారౌతుంది. 

అంటే, కంటికి కనపడనటువంటి సూక్ష్మతర, సూక్ష్మతమ… ఆల్ఫా, బీటా, గామా ఇలా చాలా కిరణాలు వున్నాయి. చాలా వలయాలు కూడా వున్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా వున్నాయి. ఈ తరంగముల యొక్క, ఈ కిరణముల యొక్క పౌనఃపుణ్యము [frequency] వలన మనము ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మం కూడా వుంది. 

కాబట్టి ఎలక్ట్రో మేగ్నటిక్‌ ఫీల్డు ని గనక మనం అంటే విద్యుదైస్కాంత తరంగ దైర్ఘ్యములను కనుక మనం ఫ్రీక్వెన్సీ ని గనక మనం డీ-కోడ్‌ చేసినట్లయితే, ఈ సృష్టి యందంతటా వ్యాపకమైనటువంటిది ఆ విద్యుదయస్కాంత తరంగములే. కాబట్టి, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. 

ఎంతగా స్థూలమైతే, అంతగా పరిమితించబడిపోతున్నావు. ఎంతగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవుతూ ఉంటావో అంతగా వ్యాపకత్వాన్ని కలిగివుంటావు.

“తనను అన్నిటి యందునూ, అన్నిటిని యందునూ తనను దర్శించగలగినటువంటి ధీరుడు ఎవడో వాడు ఆత్మ నిష్ఠుడు” మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఇది వున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన. మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయస్థానము. అట్టి హృదయము నందు మరల ఆకాశ స్థానము వున్నది.

సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

09 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 72  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -02 🌻

అనాహత శబ్దము నీ యందు ఓంకార శబ్దము, ప్రణవ నాదము, నీ హృదయస్థానము నుంచి ఉత్పన్నమై, నీ శరీరమంతా వ్యాపించి 72 వేల నాడులను శక్తి వంతం చేస్తున్నది. ఏ చోటైతే నాదము యొక్క ఆద్య స్థానము ఉన్నదో, నాదము యొక్క పుట్టుక స్థానము ఉన్నదో అదే హృదయాకాశము. ఇట్టి హృదయాకాశమును ఎవరైతే కనుగొన గలుగుతారో సాధన పూర్వకంగా అనగా అర్థమేమిటి?

ప్రస్తుతము మనలో ఉన్నటు వంటి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి బహిర్ముఖముగా చైతన్యవంతమై చేతనవంతమై పనిచేస్తున్నవి. అంతరంగంలోనేమో చైతన్యం పరమాణు స్వరూపముగా ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములన్నిటినీ ఈ నాడులన్నిటినీ, ఈ అవయవములన్నిటినీ చేతనవంతముగా చేస్తుంది. 

ఇవి బహిర్ముఖముగా వ్యవహరిస్తువున్నాయి. ఈ బహిర్ముఖ వ్యవహారమునంతా విరమించగా విరమించగా… ఎక్కడికి విరమించాలట? తన లోపలికే విరమించాలట. తన లోపలికి అంటే ఎక్కడికి విరమించాలట?

అవి పుట్టేటటువంటి, అవి శక్తిని గ్రహిస్తున్నటువంటి ఆధారభూత స్థానం వైపుగా గనక నీవు చూపును మరలించినట్లయితే, నీ దృష్టిని మరలించినట్లయితే, కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే, ప్రాణమనోబుద్ధుల యొక్క పుట్టుక స్థానాన్ని నువ్వు తెలుసుకో గలిగినట్లయితే, అంటే అర్థం ఏమిటంటే? వీటి యొక్క కదలికలను తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా అవి హృదయస్థానము నుండి ఉద్భవిస్తున్నట్లుగా నీవు గుర్తించగలుగుతావు.

అటువంటి గుర్తింపును సాధించడము చాలా ముఖ్యము. దీని కొరకే సమస్త సాధనలు చెప్పబడ్డాయి. ఆటువంటి ఆత్మను హృదయాకాశంలో మాత్రమే సాక్షాత్కారము చేసుకొనుటకు ఒక యజ్ఞం చేస్తున్నావట అక్కడ నువ్వు. ఆ క్రతువు, ఇది ప్రతి రోజూ చేయవలసినటువంటి క్రతువు. మానవుడు చేయవలసినటువంటి నిత్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞము హృదయస్థానములో చేయాలి. 

తన ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటి విషయములను, తన శబ్దాది విషయములను అన్నిటినీ ఈ క్రతువు నందు హవిస్సులుగా సమర్పించాలి. అనగా అర్థమేమిటి? వాటిని లేకుండా చేయాలి. విరమించాలి. అవి అందులో వ్యవహరించకుండా చేయాలి. అట్లా వెనక్కి తీసుకునేటటువంటి యజ్ఞాన్ని, విరమించేటటువంటి యజ్ఞాన్ని ఎవరైతే హృదయస్థానంలో చేసి, హృదయాకాశ స్థితిని గ్రహించగలుగుతాడో అనుభూతం అవ్వాలట.

నీవు బాహ్యముగా ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో, నామరూపాత్మకమైనటువంటి ఏ నేనైతే వుందో ఆ నేను హృదయాకాశ స్థానము నందు లేదు. యథార్థ నేను ఒక్కటే ఉన్నది. అసత్యనేను లేదక్కడ. ఇట్టి యజ్ఞాన్ని ఎవరైతే ఏకాగ్రతతో ధ్యానంలో చేయగలుగుతారో, ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంగా చేయగలుగుతారో, ప్రవృత్తి నుండి నివృత్తి దశగా మార్చుకోగలుగుతారో, భయం దిశ నుంచీ, అభయం దిశగా మార్చుకోగలుగుతారో, బంధం నుంచీ మోక్షం దిశగా మార్చుకోగలుగుతారో, ఈ రకంగా ఒక్కొక్కదానిని విరమించుకుంటూ ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో, ఈ అంతఃక్రతువు, ఈ క్రతువు ఎటువంటిదంటే అంతః క్రతువు, ఇది చేయడం వలన ఫలితం ఏమటండీ? 

బాహ్యముగా ఏ ఫలితమూ రాదు. బహిర్ వ్యవహారమునందు ఏ ఫలితములు రావు. కాకపోతే ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన నైపుణ్యం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి గుణాతీత లక్షణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి సాక్షిత్వం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి అసంగత్వం ఏర్పడుతుంది. 

ఉత్తమమైనటువంటి నిర్విషయపద్ధతి ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి నిష్కామకర్మ పద్ధతి ఏర్పడుతుంది. ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఏర్పడుతాయి ఈ ఆంతరిక యజ్ఞం చేయడం ద్వారా. 

తద్వారా బహిరంగంలో కొద్దిగా నిర్వ్యాపార స్థితి ఏర్పడినట్లుగా అయినప్పటికినీ ఉత్తమమే. అంటే ఫుల్‌గా వైబ్రంట్‌ గా వుండడు అన్నమాట. విపరీతంగా వ్యవహార స్థితిలో మునిగి పోయిన స్థితిలో వుండడు వీడు. – విద్యా సాగర్ స్వామి

సశేషం…..
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

10 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 73   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -03 🌻

కొద్దిగా విరమించినటువంటి స్థితిలో ఉంటాడు. కానీ చేసి ఒకటి రెండు పనులు, మూడు నాలుగు పనులు సామాన్య ధర్మం మేరకు, తన కర్తవ్యం మేరకు, తన ధర్మం మేరకు, తాను నిర్వహించేటటువంటి ఏ పనినైనా నూటికి వెయిపాళ్ళు సమర్థవంతంగా చేస్తాడు, సక్రమంగా చేస్తాడు. నిష్కామ కర్మగా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం.

ఈ నిష్కామ కర్మకు సరిపోయేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు. మిగిలినటువంటి వాటిని ఆచరించడు. సకామ్య కర్మ ఏదైనా సరే, అది తన కర్తవ్యంలో లేనిదిగా భావిస్తాడు. తన కర్తవ్యంగా ఎప్పుడూ భావించడు.

తన కర్తవ్యం కేవలం నిష్కామ కర్మ మాత్రమే. దీనికి సరిపడితేనే ఆ కర్మను అనుమతిస్తాడు. ఆ క్రియను అనుసరిస్తాడు. ఆ ఇంద్రియములను వ్యవహరింపజేస్తాడు. ఆ విషయాలలో ప్రవర్తిస్తాడు.

తదనుభవ రూపమైనటువంటి ఫలితమను నిరసిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఫలితమును నిరసించగలిగేటటువంటి, విశేష లక్షణాన్ని నిరసించ గలిగేటటువంటి, సమర్థమైనటువంటి, తనదైనటువంటి, తానైనటువంటి స్థితియందు నిలకడ కలిగేటట్లుగా చేయటానికి, ఈ ఆంతరిక యజ్ఞంలో భాగంగా అయ్యేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు.

మిగిలినటువంటి వాటికి విరమణ, మౌనం వహిస్తాడు, చేయడు అన్నమాట ఇక. అప్పుడు ఏమైపోయినై అంటే, చేసేటటువంటి పనుల సంఖ్య పరిమితించబడుతుంది. తీవ్ర వ్యవహారములన్నీ పరిమితించబడిపోతాయి. 

రజోగుణ, తమోగుణ ధర్మాలన్నీ విరమించబడుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ విరమించబడుతాయో సాత్విక కర్మని కూడా నిష్కామ కర్మగా మాత్రమే చేస్తాడు. మిగిలిన వాటిని చేయడు. ఎందుకనంటే అవి వృధా. నిష్ప్రయోజనములు. 

ఎందుకనటా? ఆంతరిక యజ్ఞం చేయడానికి అవి ఉపయోగపడడం లేదు. ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిస్సులను అర్పించాలి అంతే కాని నీళ్ళు పోస్తారా? ఆ యజ్ఞం చల్లారి పోయేటట్లుగా చేయకూడదు.

ఇటువంటి ఆంతరిక యజ్ఞం మరింతగా ప్రజ్వలించి, ఎంతగా ప్రజ్వలించాలయ్యా అంగాటే, సర్వ వ్యాపకమైనటువంటి అనంత విశ్వమంతా తానే అయినటువంటి స్థితిని ప్రాప్తింపచేసేంతగా సూక్ష్మతరము, సూక్ష్మతమము చేసేటట్లుగా ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ఇట్లా వేద విహత కర్మ అంటే, ఈ ఆంతరిక యజ్ఞమే! నిజానికి సర్వ యజ్ఞముల యొక్క లక్ష్యము కూడా ఈ ఆంతరిక యజ్ఞమే. 

వేద విహితుడైనటువంటి బ్రాహ్మణుడు, నిత్యమూ చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే, నిత్యకర్మ జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటారు. జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటే అర్థం ఏమిటంటే, ఈ ఆంతరిక యజ్ఞాన్ని సదా చేయాలి, 24 గంటలూ చేయాలి, మూడు అవస్థలలోనూ చేయాలి. 

తురీయ స్థితిలో నిలబడేటంత వరకూ చేయాలి. తురీయస్థితిలో నిలబడటమే సత్యంగా, నిత్యంగా, లక్ష్యంగా ఎంచుకుని చేయాలి. కాబట్టి ఇట్టి ఆంతరిక యజ్ఞాన్ని, ఇదే జ్యోతిష్టోమాది కర్మ అంటే అర్థం.

అంతే కానీ, బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞములు, యాగములు, హోమములు అన్నింటికీ కూడా ఈ అంతరిక యజ్ఞమే లక్ష్యార్థమై ఉన్నది, వాచ్యార్థమై ఉన్నది, వాచకమై ఉన్నది. కాబట్టి, బహిరంగంలో చేయబడేటటువంటివన్నీ కూడా కర్మ ఉపాసనలో భాగంగా వున్నాయి. 

ఈ కర్మ ఉపాసన భాగంగా చేయబడుతున్నటువంటి సర్వ యజ్ఞములు, సర్వ కర్మలు, సర్వ యాగములు, హోమములు, ధ్యానములు, యోగములు, ఉపాసనలు, అర్చనలు, నవ విధ భక్తి మార్గములు అన్నీ కూడా ఆత్మనివేదన అనబడే ఆంతరిక యజ్ఞాన్ని ఆశ్రయించడం కొరకే. 

ఈ ఆత్మనివేదన చేయటానికి అర్హమైనటువంటి స్థితిని సంపాదించి పెట్టేటటువంటి ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో, వారిలో ఒక ఉత్తమ ఫలితం వస్తుంది. అది ఏమిటంటే, జ్ఞానాగ్ని లభిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణం – అన్ని కర్మలు అందులో దహించుకుపోతాయి. అన్ని కర్తృత్వ అభిమానము, భోక్తృత్త్వ అభిమానము పూర్ణాహుతి చేయబడుతాయి. 

ఇది ప్రతీ యజ్ఞంలోను, ప్రతీ యాగంలోను, ప్రతీ హోమంలోను చిట్టచివరికి వ్రేల్చబడేటటువంటి ఈ పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటంటే, కర్తృత్వాభిమానమును-భోక్తృత్వాభిమానమును సర్వకర్మలను.

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ|
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః||

సర్వకర్మ పరిత్యాగం జరిగిపోతుందన్నమాట. కర్మ పరిత్యాగం అంటే కర్మఫల పరిత్యాగం. ఫలం లేకపోతే కర్మ యొక్క ప్రయోజనం లేదు. 

అటువంటి ఫల పరిత్యాగ పద్ధతి అయినటువంటి, నిష్కామ కర్మ వేద విహిత కర్మలను, ఫలాపేక్ష లేక, ఆచరించువాని యొక్క చిత్తము నిర్మలమౌతుంది. ఇది చాలా ముఖ్యము.

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

11 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 74  🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -04 🌻

“అపేక్ష అనేదాని వలననే మాలిన్యం ఏర్పడుతుంది”. ఎవరైతే ఈ ఫలాపేక్షను ఆంతరిక యజ్ఞంలో, పూర్ణాహుతిగా సమర్పిస్తాడో, ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేసి, జ్ఞానాగ్నిగా మార్చుకుంటాడో, ఆ జ్ఞానాగ్నిలో తనను తానే దహింపచేసుకుంటాడో, వ్యవహారిక జీవభావములను పూర్తిగా హవిస్సులుగా సమర్పించి, ఆత్మభావములో నిలకడ చెంది, ఆత్మనిష్ఠుడై తనను తానే పోగొట్టుకుంటున్నాడో, నామరూపాది లక్షణములను పోగొట్టుకుంటున్నాడో, అటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు, అది నిర్మలత్వం. త్రిగుణ మాలిన్యమనేది వాడికిక అంటేటువంటి అవకాశం లేదు. సర్వకాలము వాడు గుణాతీతుడుగా వుంటాడు. అట్లా ఉన్నప్పుడు ఏమైందట? 

మనస్సు నిర్మలమైపోయింది. ఇంద్రియములు నిర్మలమైపోయాయి. బుద్ధి ప్రసన్నతను పొందింది. బాహ్యవిషయములనుండి బుద్ధికి ప్రవృత్తి నుండి నివృత్తికి మరలింది. ఇంకేమి తెలిసిందట?

బుద్ధికి ఒక శక్తి లభించింది.

‘బుద్ధిగ్రాహ్యమతీంద్రయం’ – అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మానుభూతిని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని గ్రహించగలిగేటటువంటి శక్తి, బుద్ధికి లభించింది.

సమర్థవంతమైనటు వంటి బుద్ధి లభించింది. అట్టి మహిమను తెలుసుకో గలుగుతాడు. మహిమ అంటే మహత్తు స్థితియందు ఏదైతే ఉన్నదో, మహిమ అంటే ప్రకృతిలో ఆచరించబడేటటు వంటివి, నీ కనుల ముందు నీవు ఊహించ గలిగేటటు వంటివి, జరిగేటటువంటివి కావు. 

బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రతీ ఒక్కరూ కూడా. అందరూ మహిమలు, మహిమలు అంటే, ఏమిటంటే ఏదైనా కొత్తవి సృష్టించడం కానీ, ఉన్నవి పోయేటట్లు చేయడం కానీ, లేదా నీకు తెలియనటువంటి వాటిని చెప్పడం గాని, ఇలాంటి ప్రకృతి ధర్మాలకు లోబడనటువంటి, జగద్ధర్మాలకు లోబడనటువంటి వాటిని ఏవైనా చేస్తే, వాటిని మహిమలు అని అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ, నిజానికి ఇవేవీ మహిమలు కావు. ఒకే ఒక మహిమ ఉన్నది – అది ఏమిటంటే, మహత్తు స్థితిని ప్రాప్తింప చేయటమే అది మహిమ.

“ఆత్మానుభూతి కలుగజేసేటటు వంటిది ఏదైతే ఉన్నదో, దాని పేరు మహిమ”- అటువంటి మహిమలు తెలుసుకున్నటు వంటి వాళ్ళు మాత్రమే, అటువంటి ఆత్మానుభూతిని పొందినటు వంటివాళ్ళు మాత్రమే, పరమాత్మస్థితిని తెలుసుకోవడానికి అధికారులు అవుతున్నారు. ఆత్మానుభూతే లేనటువంటివాడు, పరమాత్మ స్థితిని ఎట్లా తెలుసుకుంటాడు? కాబట్టి దీని వల్ల ఒక గొప్ప పరిణామం లభించిందట, శాశ్వత పరిణామం లభించింది.

ఏమిటయ్యా అంటే, శోకము నశించింది. దుఃఖం అవ్యాప్తి. వ్యాప్తి అంటే దుఃఖమే జీవితమంతా ఉంది. అంటే అర్థమేమిటంటే, ప్రసవ వేదనతో ప్రారంభమైనటువంటి జీవితం, మరణవేదనతో ముగించబడుతున్నది. జీవితకాలమంతా వేదనలే వున్నాయి. ఈ వేదనంతా శోకరూపంలో వున్నది.

శోక ప్రవాహమే జీవనము, వేరే ఇంకేమీ లేదు. మరి అటువంటి శోక ప్రవాహమేమైపోయిందట ఇప్పుడు? ఈ ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, ఈ నిష్కామ కర్మ ప్రభావం చేత, ఈ హృదయాకాశ స్థితి యందు చేయబడుతున్నటువంటి, ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, జ్ఞానాగ్ని ప్రభావం చేత, సర్వకర్మలను ఫలత్యాగ రహితంగా చేయడం వలన, ఫలత్యాగ పద్ధతిగా చేయడం ద్వారా, ఫలరహిత పద్ధతిగా చేయడం ద్వారా, సర్వకర్మలను హవిస్సులుగా ఆ ఆంతరిక యజ్ఞంలో అర్పించడం ద్వారా, సర్వస్యశరణాగతిని పొందడం ద్వారా, ఆత్మానుభూతిని ఆశ్రయించడం ద్వారా ఆ పరమాత్మస్థితిని తెలుసుకోగలిగేటటువంటి సమర్థత నీకు కలుగుతున్నది. తద్వారా ఒక గొప్పఫలం లభించింది. ఏమిటంటే శోక రహిత స్థితి. 

వాడు ఎప్పటికీ దేని గురించీ శోకించడు. శోకము లేకపోవడమే కదా ఆనందం అంటే. ఆనందం అంటే అర్థం ఏమిటంటే శాశ్వతంగా శోకమునకు దూరమైపోయిన వాడు ఎవడైతే వున్నాడో వాడు ఆనంద స్థితుడు. ఆనంద స్థితుడు అంటే అర్థం అది. 

వాడికి ఆనంద చాలామందికి మీరు పేర్లు వింటూ వుంటారు, తేజోమయానందా, తత్త్వమయానందా, నిజానంద ఈ రకంగా పేర్లు ఉంటాయన్నమాట! చిన్మయానంద, పరమార్దానంద ఈ రకంగా పేర్లుంటాయన్నమాట! ఇవన్నీ సన్యాస నామాలు. – విద్యా సాగర్ స్వామి

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

12 Oct 2020


🌹.   కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 75   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -05 🌻

ఈ సన్యాసనామం ఇచ్చేటప్పుడు ముఖ్యంగా సన్యాసమంటేనే ఈ ‘ఆంతరిక యజ్ఞం’. ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేస్తారో, వారు అత్యాశ్రమి. వారు నాలుగు ఆశ్రమధర్మాలను దాటినటువంటి వారౌతారు. 

ఈ నాలుగు ఆశ్రమధర్మాలను దాటినటువంటి అత్యాశ్రమి ఈ ఆంతరిక యజ్ఞంలో సమర్థుడై, ఆత్మానుభూతిని పొంది, ఆనందస్థితుడవ్వగానే, శోకరహితుడవ్వగానే అతనికి ఆ పేరు ఇవ్వబడుతుంది. అప్పటి వరకూ చైతన్య అనే పేరుతో వుంటాడు. అంటే ఉద్ధవ చైతన్య, ఉద్ధవ చైతన్యానంద, సర్వేశానంద గా మారిపోయాడు ఆయన. అట్లాగే సుందర రాజన్‌, సుందర చైతన్య, సుందర చైతన్యానంద అయ్యాడు. 

ఈ రకంగా ఈ ఆనంద నామము సన్యాసనామము ఎప్పుడు జోడించబడుతుంది అంటే, ఎప్పుడైతే ఈ ఆంతరిక యజ్ఞం ద్వారా ఫలాపేక్ష రహితంగా, ఫలత్యాగ పద్ధతిగా, నిష్కామకర్మగా, ఈ హృదయాకాశము నందు, బుద్ధి గుహ యందు ఉన్నటువంటి ఆత్మానుభూతిని, తాను తెలుసుకొన్నటువంటివాడై, నామరూపాత్మకమైనటువంటి నేనును పోగొట్టుకున్నటువంటి ఆత్మనిష్ఠుడై, ఆనంద స్థితుడై, శోక రహితుడై ఉన్నాడో, అప్పడు ఈ ఆనంద నామం స్థిరమైపోతుంది.

అటువంటి స్థితిని మానవుడు తప్పక పొందాలి. ఈ ఆనందము పేరు ఆత్మానందము. ఆత్మానందమును అనుభవించును. వీడికి ఇంకే పని ఉండదు. వీడి జన్మ మొత్తం మీద వీడికేమైనా పనులున్నాయా అంటే ఇక ఒక్కటే ఒక కర్తవ్యం మిగులుతుంది. ఏమిటంటే, సదా ఆత్మానందుడై వుండుట. ఉండుట. చేయుట లేదు 

ఇక వీడికి. కర్మ యొక్క ప్రభావం లేదు. కాబట్టి చేయడం అనే ప్రసక్తే లేదు. కాబట్టి ఏమిటి అంటే ఆత్మానందము నందు వుండుట అనేది ప్రారంభమైనది. ఇక నుంచి వీడు చేసే అన్ని కర్మలు, సర్వ కర్మలు కూడా ఈ ఆంతరిక యజ్ఞంలో దగ్ధం అయిపోతాయి. 

‘మాం ఏకం శరణం వ్రజా’- పరమాత్మకు సర్వస్య శరణాగతి అయిపోయాడు కాబట్టి, ఇంక వేరే అన్యము లేదు కాబట్టి, అంతటా తానే ఉన్నాడు కాబట్టి, అన్యమును తెలుసుకొనగోరు ఇచ్ఛ లేదు కాబట్టి, అన్యము లేదు కాబట్టి, అనేకత్వము లేదు కాబట్టి, సహస్రదా సర్వదా సర్వకాలము నందు ఉన్న ఏక తత్వమైనటువంటి ఆత్మ తత్వమునందే రమించుచున్నాడు కాబట్టి. ఈ రకంగా ఆత్మానందమును అనుభవించుచున్నాడు. ఇట్టి స్థితిని మానవుడు తప్పక సాధించాలి.

ఆత్మ సర్వవ్యాపకమగుటచేత ఆత్మలేని తావులేదు. పరిచ్ఛిన్నత్వమున్న వాటికే గదా కదలుటకవకాశమున్నది. అపరిచ్చిన్నుడు, అచలుడు అయిన ఆత్మ దూరము పోవునట్లగపడుచున్నాడు. 

ఆనందము మరియు ఆనంద రహితమునై యున్న ఈ ఆత్మను నాకంటే వేరైనవాడెవడు తెలిసికొనగలడు. అంతర్ముఖులు, ఇంద్రియ నిగ్రహపరులైన జ్ఞానులు దప్ప విషయాదులతో కూడి యుండు సామాన్యులు ఆత్మను తెలియలేదు.

ఇక్కడేమి చెపుతున్నారు? ఆ ఆత్మానందం యొక్క విశేషాన్ని తెలియచెప్పి నీ ఆత్మ యొక్క మరిన్ని లక్షణాలను తెలియజేస్తున్నారు. ఆత్మ లేని తావు లేదు. మైక్రోమిల్లీ మీటర్‌లో ఉన్నటువంటి, ఆర్‌ ఎన్‌ ఏ [R.N.A], డీ ఎన్ ఏ [D.N.A] దగ్గర నుంచి మొదలుపెడితే పరమాణవైనటువంటి ఎలిమెంట్స్‌ [elements], బేసిక్‌ ఎలిమెంట్స్‌ [Basic elements] ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టియందు హీలియం అనుకో, ఉదజని అనుకో, ఆక్సిజన్‌ అనుకో, హైడ్రోజన్‌ అనుకో ఏ పేర్లైనా పెట్టుకో, 

అత్యంత చిన్నదైనటువంటి పరమాణువు, ఆటమ్‌ [atom] దగ్గర నుంచీ మొదలుపెడితే, అనంతముగా వ్యాపించి వున్నటువంటి విశ్వము వరకూ, బ్రహ్మము వరకూ సర్వత్రా ఉన్నది ఏదైతే ఉన్నదో, ఉండుట మాత్రమే లక్షణముగా కలది ఏదైతే ఉన్నదో, అది ఆత్మ. 

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam#PrasadBhardwaj#చైతన్యవిజ్ఞానం#కఠోపనిషత్#చలాచలబోధ

13 Oct 2020


🌹. కఠోపనిషత్‌ వివరణ – చలాచలభోధ – 76 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -06 🌻

‘స ఆత్మ’ – ‘ఆత్మా అపరిచ్ఛిన్నః’ – అపరిచ్ఛిన్నః – ఏకముగా ఉన్నది. ఇదంతా అనేకముగా నీకు కనబడుతు వున్నదే తప్ప, వాస్తవమునకు తాత్వికముగా ఏకముగానే ఉన్నది. ఇంత మంది లేరు. ఇంత సృష్టి లేదు. ఇన్ని నక్షత్రాలు లేవు. ఇన్ని గెలాక్సీలు లేవు. ఇంత విశ్వకుటుంబం లేదు. ఇదంతా కలిపి ఒకే ఒక ఆత్మ. స ఆత్మ. మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మకు, కదలడానికి అవకాశం ఉందా? అంటే లేదట. అంతటా ఉన్నది అన్నప్పుడు ఇక కదలడానికి ఎట్లా ఉంటుంది?
మీ ఇంటి యందు అంతటా గాలి ఉన్నదా? లేదా? ఉన్నది. మరి గాలి కదలడానికి అవకాశమున్నదా? గాలి ఆల్రెడీ కదులుతూనే ఉందిగా అంటావు, కానీ ఆ గాలి ఆకాశమనే ప్రదేశములో కదులుతుంది. మరి ఆకాశం కదలటానికి ఉందా అంటే, ఆకాశానికి కదిలే అవకాశం లేదు. ఎందుకని? 
అంతటా ఉన్నది కాబట్టి అనేటటుంటి సాదృశ్యంగా చెబుతున్నారే కానీ, ఆకాశమును ‘ఆత్మ’ అనుటకు వీలులేదు. కారణం ఏమిటంటే, వాతావరణం ఎంత మేరకు భూమి చుట్టూతా వ్యాపించి ఉన్నదో, అంతమేరకే ఆకాశం అంటున్నాం మనం. దాని అవతల ఉన్నదానిని అంతరిక్షం అంటున్నారు. మరి అదంతా కూడా విశ్వవ్యాపకంగా ఉన్నదిగా! కాబట్టి, ఆకాశమును ‘ఆత్మ’ అనరాదు.
కానీ ‘తద్దూరే గతి, తన్నైజతి’ – ఎంత దూరం వెళ్ళగలదయ్యా అంటే, అనంత విశ్వం వ్యాపకం ఎంత దూరం అయితే ఉందో, అన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరం వరకూ కూడా వ్యాపించి ఉన్నది. ‘తన్నైజతి’ – ఎక్కడికి కదలదయ్యా! ఎంతగా కదలదయ్యా అంటే, కదలడానికి అవకాశమే లేనంతగా, లేనటువంటి స్థాణువుగా ఉన్నది. ఈ రెండు లక్షణాలు ఒకచోటే ఉన్నయట. అది ఆత్మను వివరించేటటువంటి విధానము. అది అపరిచ్ఛిన్నము, అచలము. కదులుటకు అవకాశం వున్నది, కదలనిది. ఆత్మ దూరము పోతున్నట్లుగా కనబడుతున్నది. 
అత్యంత దూరముగా, విశాలంగా, ఎంతో దూరంగా ఉన్నట్లు కనబడుతోంది కానీ, అసలే కదలనిది కూడా అదే! ఈ రకంగా ఆత్మ ఆనందము, ఏక కాలంలో ఆనంద రహిత్యము కూడా అయివున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటిడి. ఆనంద అభావము, ఆనంద భావము. ఆనంద అభావము కూడా అయివున్నది. ఏకకాలంలో భావాభావ వివర్జితమై ఉన్నది. ఏకకాలంలో భావ అభావ వివర్జితమై ఉన్నది. ఈ రకమైనటువంటి స్థితి భేదములతో ఆత్మలక్షణాలను వివరించడం జరుగుతున్నది.
ఏమండీ, ఇట్లా మాటగా చెప్తే తెలిసిపోతుందా? తెలియదు. నీవు ఈ స్థితులన్నీ అనుభూతి పూర్వకంగా నిర్ణయింప చేసుకోవాలి. ‘ఆనంద భావం’ – అంటే ఏమిటో తెలియాలి. ‘ఆనంద అభావం’ – అంటే ఏమిటో తెలియాలి. ‘భావ అభావ వర్జితం’ – అంటే ఏమిటో తెలియాలి. ఈ రకంగా ఆత్మ నాకంటే వేరైనవాడెవడు తెలుసుకొనగలడు. అంటే, అంతటా ఉన్నది, నీ లోపల కూడా ఉన్నది కదా, నీ బయటకూడా ఉన్నది కదా!
కాబట్టి, అన్ని జీవుల కంటే, బుద్ధి వికాసము కలిగిన మానవుడు తప్ప, ఈ ఆత్మను మరొకరు గ్రహించలేరు. బుద్ధి వికాసము లేనటువంటి జీవులు, అసలే తెలుసుకోలేవు. బుద్ధి వికాసము కలిగిన మానవుడు ఒక్కడు మాత్రమే బుద్ధి యొక్క గుహయందు, హృదయాకాశ స్థితుడై, ఆనంద స్థితుడై, ఫలాపేక్ష రహితుడై నిష్కామకర్మ సహితుడై, ఆంతరిక యజ్ఞాన్ని చేసేవాడై, ఈ ఆనంద భావమును, ఈ ఆత్మానంద స్థితిని తెలుసుకొన గలుగుతున్నాడు. కాబట్టి, దీనిని ఏమన్నారు? అంతర్ముఖుడు. 
సదా అంతర్ముఖుడు, తన లోపలికి తాను తిరిగి ఉన్నవాడు. అందుకుని, తాబేలు ముడుచుకున్నప్పుడు, ఎట్లా అయితే డిప్పమాత్రమే కనబడి, తాబేలు కనబడదో, అట్లాంటివాడన్నమాట ‘అంతర్ముఖుడు’ అంటే! – విద్యా సాగర్ స్వామి 

సశేషం….
🌹 🌹 🌹 🌹 🌹

16 Oct 2020


Leave a comment