Upanishad

ముండకోపనిషత్తు-1

ముండకోపనిషత్తు-1నాందీ ప్రార్ధనఓం. ఓ భగవంతుడా, మంగళకప్రదమైనవే మేము వినెదము గాక, ఓ పూజ్యమైన దేవతలారా, మంచినే చూచెదముగాక, మా సమస్తాంగములు, దేహము శక్తిమంతమై యుండుగాక, సృష్టికర్తయైన బ్రహ్మ యిచ్చిన జీవితాన్ని ఆనందిస్తూ, నీ కీర్తనలే గానము చేతుముగాక!!!ఓం శాంతి! శాంతి! శాంతి!ప్రథమ ముండకము1. ఓం. సృష్టికర్త మరియు రక్షకుడైన బ్రహ్మ దేవతలలో మొదటివాడు. అతడు జ్ఞానమునకు మూలమైన బ్రహ్మము గూర్చి అతని ప్రథమ పుత్రుడైన అథర్వునికి వివరించెను.2. అథర్వునికి బ్రహ్మ చెప్పిన బ్రహ్మ జ్ఞానము, ఆనాడే అథర్వుడు… Continue reading ముండకోపనిషత్తు-1

Upanishad

ముండకోపనిషత్తు-2

ముండకోపనిషత్తు-23. శౌనకుడు ఆంగీరసునితో ఇట్లనెను: మహాశయా, ఇదంతా తెలుసుకోవడానికి ఏమి తెలిసియుండవలెను?4. ఆంగీరసుడు అతనితో ఇట్లనెను: బ్రహ్మమును గూర్చి తెలియాలంటే రెండు విధములైన జ్ఞానమార్గమును తెలుసుకోవలెను. అవి ఉన్నతము మరియు అత్యల్ప జ్ఞానమార్గములు.5. వాటిలో ఉన్నతమైనది జ్ఞాన మార్గము ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అథర్వణ వేదము, శిక్ష (స్వర శాస్త్రము), కల్ప(ఆగమములు), వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము; మరియు ఉన్నత జ్ఞానము శాశ్వతమైన బ్రహ్మము పొందవలెను. 6. దేనినైతే చూడలేమో లేదా చిక్కించుకోలేమో, దేనికైతే మూలము… Continue reading ముండకోపనిషత్తు-2

Upanishad

ముండకోపనిషత్తు – 3

ముండకోపనిషత్తు - 37. ఒక సాలెపురుగు తన దారంతోనే గూడు అల్లినట్లు, తలపై కేశములు పెరిగినట్లుగా మరియు మానవ దేహం కూడా  అనశ్వరము నుండి లభించే బ్రహ్మజ్ఞానముతో జ్ఞానవికాసాన్ని ఏర్పరుస్తుంది.8. బ్రహ్మమనేది కాఠిన్యత నుండి విస్తరిస్తుంది. అందుండి ప్రధానమైన జ్ఞాన వికాసము వెలువడుతుంది, ఆపైన ప్రాణ, ఆందుండి మనసు, మనసు నుండి పంచభూతములు, పంచభూతముల నుండి లోకములు అక్కడినుండి కర్మలు, కర్మల నుండి శాశ్వత జ్ఞాన ఫలములు వెలువడడం జరుగుతుంది.9. అంతయు తెలిసియుండి, అంతయు అర్ధం చేసుకున్న… Continue reading ముండకోపనిషత్తు – 3

Upanishad

ముండకోపనిషత్తు – 4

ముండకోపనిషత్తు - 4తానాచరించే అగ్నికార్యము దర్శ (అమావాస్య అగ్నిహోత్రము) మరియు పౌర్ణమాసి (పౌర్ణమి నాటి అగ్నిహోత్రము) అగ్నిహోత్రములు, చాతుర్మాస్య మరియు శరత్కాల అగ్నికార్యములతో కూడియుండకుండినను, అలాగే అతిథి సత్కారము, అలాగే సరైన సమయాన అర్పించని నివేదనలు, వైశ్వదేవం లేని లేదా సరిగా ఆచరించని క్రతువులు తనయొక్క సప్తలోకములను నాశనము చేయును.4. కాళి (నలుపు), కరాళి (భయంకరము), మనోజవము (మనోవేగము), సులోహితము (ముదురు ఎరుపు), సుధూమ్రవర్ణము (ముదురు  ధూమ్రవర్ణము), స్ప్లులింగిని (మిరిమిట్లుగొలిపే కాంతులు), దేదీప్యమాన కాంతులు ఈ ఏడునూ… Continue reading ముండకోపనిషత్తు – 4