భగవద్దర్శిని - అవతార్ మెహర్

భగవద్దర్శిని – అవతార్ మెహర్ – 119

🌹. భగవద్దర్శిని – అవతార్ మెహర్ – 119 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. సర్వశూన్య స్థితి యందు ఎరుక – 4 🌻

495. నిజమైన సుషుప్తియగు ‘నిర్వాణ అవస్థ’ యైన ‘ ఫనా’ లో పూర్తి విశుద్ధ చైతన్యము ఉండును.

496. నిజమైన ఫనాకును తదితర ఫనాలకును అనంత తారతమ్యత గలదు.

497. ప్రతి భూమికకు’ఫనా’ ‘బకా’ లుండును. కానీ భూమికలలో నున్న ‘ఫనా’ ఏడవ భూమికలో నున్న ఫనా- కాదు. అట్లే భూమికలలో నున్న ‘బకా’ సద్గురు స్థితిలో నున్న ‘బకా’ కాదు.

498. ఫనా = నాశనము, అస్థిరమైన స్థితి.

499. బకా = స్థిరత్వము, ఎల్లకాలము ఉండు స్థితి.

ఫనా× బకా = అస్థిరము×స్థిరము.

సశేషం…

🌹 🌹 🌹 🌹 🌹

10 Dec 2020