శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - Sri Lalitha Chaitanya Vijnanam

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 543 – 1 / Sri Lalitha Chaitanya Vijnanam – 543 – 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము – 543 – 1 / Sri Lalitha Chaitanya Vijnanam – 543 – 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 543. ‘పుణ్యలభ్య’’ – 1 🌻

పుణ్యముల వలన లభ్యమగునది శ్రీమాత అని అర్ధము. పుణ్య కార్యములను శ్రద్ధా భక్తులతో దీర్ఘకాలము నిర్వర్తించు వారిని శ్రీమాత క్రమముగ అనుగ్రహించు చుండును. సాన్నిధ్యము క్రమముగ నిచ్చును. సాలోక్యము కలిగించును. అనగా అడపా దడపా దర్శనము లిచ్చుచుండును. ప్రోత్సహించు చుండును. దాని వలన ఆరాధనల యందు, పుణ్యకార్యముల యందు, ఇనుమడించిన స్ఫూర్తితో భక్తులు నిమగ్ను లగుదురు. అందువలన మరింత సాన్నిధ్య, సాలోక్యములు పెరిగి సామీప్యమును చేరుదురు.

సశేషం…

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam – 543 – 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 543. ‘Punyalabhya’ – 1 🌻

It means Srimata is the one who is attained due to virtues. Sri Mata blesses those who perform pious activities with dedication and devotion for a long time. Proximity gradually builds up. Elevates to spiritual realms. That is to say, comes in visions once in a while. Gives encouragement. Due to this, the devotees are engaged in worship and pious activities with a fervent spirit. Thus one resides in the same realm as Devi, resides very close to Devi and gradually the closeness increases

Continues…

🌹 🌹 🌹 🌹 🌹