Siva Maha Purana

శ్రీ శివ మహా పురాణము – 879 / Sri Siva Maha Purana – 879

🌹 . శ్రీ శివ మహా పురాణము – 879 / Sri Siva Maha Purana – 879 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః – అధ్యాయము – 38 🌴

🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము – 3 🌻

భయంకరురాలగు ఆమె శంఖచూడుని భక్షించుటకై వేగముగా పరుగెత్తెను. ఆ దానవుడు దివ్యమైన రౌద్రాస్త్రముతో ఆమెను ఆపి వేసెను (20). అపుడు దానవవీరుడు కోపించి, గ్రీష్మకాలము నందలి సూర్యుని బోలిన పదునైన మిక్కిలి భయంకరమగు ఖడ్గమును వేగముగా ప్రయోగించెను (21).

ఆ కాళి నిప్పులు చెరుగుతూ తన మీదకు వచ్చుచున్న ఆ కత్తిని గాంచి కోపముతోనోటిని తెరిచి, శంఖచూడుడు చూచుచుండగా, నమిలి వేసెను (22). దానవవవీరుడగు ఆతడు ఇతరములగు దివ్యాస్త్రములను ప్రయోగించెను. కాని ఆమె వాటిని తనను చేరుటకు ముందే ముక్కముక్కలుగా చేసెను (23). తరువాత ఆ మహాదేవి ఆతనిని భక్షించుటకై వేగముగా మీదకు వెళ్లెను. కాని శోభాయుక్తుడు, సిద్ధులందరిలో గొప్ప వాడునగు ఆ శంఖచూడుడు అంతర్ధానమును చెందెను (24). ఆ శంఖచూడుని గాన రాక, కాళి వేగముగా తన పిడికిలితో వాని రథమును విరుగగొట్టి సారథిని సంహరించెను (25). తరువాత మాయావి యగు శంఖచూడుడు వేగముగా మరలి వచ్చి భద్రకాళిపై ప్రలయకాలాగ్ని జ్వాలలను బోలియున్న చక్రమును వేగముగా ప్రయోగించెను (26). అపుడు దేవి ఆ చక్రమును ఎడమచేతితో అవలీలగా పట్టుకొని కోపముతో వెంటనే నోటిలో వేసుకొని భక్షించెను (27). ఆ దేవి మిక్కిలి కోపముతో వేగముగా వానిని పిడికిలితో కొట్టగా, ఆ దానవవీరుడు గిరగిర తిరిగి క్షణకాలము మూర్ఛిల్లెను (28).

సశేషం….

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA – 879 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa – CHAPTER 38 🌴

🌻 Kālī fights – 3 🌻

20. The terrible goddess rushed at Śaṅkhacūḍa to devour him. The Dānava prevented her by means of the divine missile of Rudra.

21. Then the infuriated leader of the Dānavas hurled a sword, as fierce as the summer sun, with sharp and terrific edge.

22. On seeing the blazing sword approaching, Kālī furiously opened her mouth and swallowed it even as Śaṅkhacūḍa stood watching.

23. The lord of Dānavas hurled many divine missiles but before they reached her she broke them into hundreds of pieces.

24. Again the great goddess rushed at him in order to devour him. But that glorious Dānava, leader of all Siddhas vanished from sight.

25. Thus unable to see him, Kālī who rushed with great velocity crushed his chariot and killed the charioteer with her fist.

26. Then Śaṅkhacūḍa, an expert in using deception returned quickly and forcefully hurled the wheel blazing like the flame of fire of dissolution, at Bhadrakāli.

27. The goddess sportively caught hold of the wheel with her left hand and immediately swallowed it.

28. The goddess then hit him with her fist forcefully and angrily. The king of Dānavas whirled round and fainted for a short while.

Continues….

🌹🌹🌹🌹🌹