Siddeshwarayanam

సిద్దేశ్వరయానం – 48 Siddeshwarayanam – 48

🌹 సిద్దేశ్వరయానం – 48 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵

సిద్ధేశ్వరుడు కుంగామో చెప్పినటులే చేస్తున్నాడు. ఎంతసేపు గడిచిందో! భావసమాధి దశ. కన్నుల ముందు మహత్తర కాంతి పుంజం. ఆ వెలుగులో వజ్రేశ్వరి. ఆమె ముఖం కుంగామోముఖం ఒకటే. లోచనములు తెరచుకున్నవి. ఎదురుగా విప్పారిన కన్నులతో కుంగామో తనను చూస్తున్నది. అతడు నిలుచున్నాడు. ఆమె చేయి చాచింది. చేతిలోకి ఒక గ్లాసు వచ్చింది.

ఇదిగో! ఈ పాత్రలో ఒక ఓషధీ రసమున్నది. నీకు దప్పికగా ఉన్నది. దీనిని త్రాగు అని ఇచ్చింది. ఆమె చెప్పినది చేయటమే. ఏమిటి? ఎందుకు? అనే ప్రశ్నలేదు. ఆ పాత్ర తీసుకొని ఆ రసం తాగాడు. శరీరంలోకి మహాబలం ప్రవేశించినటులైంది. తానొక టేనుగు అనిపిస్తున్నది.

యువతి : సిద్ధేశ్వరా ! ఈ రోజు పున్నమి. కృష్ణాతీర శ్రీకాకుళంలో ఉత్సవం జరుగుతుంది. నీ చేత జపం చేయించి నీలోకి భైరవుని ఆకర్షించాను. నీవిప్పుడు భైరవుడవు.

పూజాసామ్రగి పుష్పములు – ధూపదీపములు నైవేద్యము అన్నీ సిద్ధంగా ఉన్నవి. ముందు పూజ చేయి. తెల్లవారు జాము కల్లా నీకు సిద్ధత్వం వస్తుంది. పూర్వస్ఫురణ అంతా వస్తుంది. తెల్లవారకముందే ఇద్దరమూ ఆకాశమార్గాన హిమాలయాలకు వెళ్ళాలి. అక్కడ సిద్ధాశ్రమ గురువుల సమక్షంలో తదనంతరం కార్యక్రమం నిర్ణయించ బడుతుంది!

( సశేషం )

🌹🌹🌹🌹🌹