Bhagavad Gita - శ్రీమద్భగవద్గీత

శ్రీమద్భగవద్గీత – 521: 13వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita – 521: Chap. 13, Ver. 32

🌹. శ్రీమద్భగవద్గీత – 521 / Bhagavad-Gita – 521 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 13వ అధ్యాయము – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం – ప్రకృతి, పురుషుడు, చైతన్యము – 32 🌴

32. అనాదిత్వాన్నిర్గుణత్వాత్ పరమాత్మా యమవ్యయ: |
శరీరస్థోపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ||

🌷. తాత్పర్యం : నిత్యదృష్టి కలిగినవారు అవ్యయమైన ఆత్మను దివ్యమైనదిగను, నిత్యమైనదిగను, త్రిగుణాతీతమైనదిగను దర్శింతురు. ఓ అర్జునా! అట్టి ఆత్మ దేహముతో సంపర్కము కలిగియున్నను కర్మనొనరింపదు మరియు బద్ధము కాదు.

🌷. భాష్యము : దేహము జన్మించుచున్నందున జీవుడును జన్మించినట్లు గోచరించుచుండును. కాని వాస్తవమునకు జీవుడు నిత్యమైనవాడు మరియు జన్మలేనటువంటివాడు. దేహమునందు నిలిచియున్నను అతడు దివ్యుడు మరియు నిత్యుడు. కనుక అతడ నశింపులేనివాడు. స్వభావరీత్యా అతడు ఆనందపూర్ణుడు. భౌతికకర్మల యందు అతడు నిమగ్నుడు కానందున దేహసంపర్కముచే ఒనరింపబడు కర్మలు అతనిని బంధింపవు.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is – 521 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 13 – Kshetra Kshtrajna Vibhaga Yoga – Nature, the Enjoyer and Consciousness – 32 🌴

32. anāditvān nirguṇatvāt paramātmāyam avyayaḥ
śarīra-stho ’pi kaunteya na karoti na lipyate

🌷 Translation : Those with the vision of eternity can see that the imperishable soul is transcendental, eternal, and beyond the modes of nature. Despite contact with the material body, O Arjuna, the soul neither does anything nor is entangled.

🌹 Purport : A living entity appears to be born because of the birth of the material body, but actually the living entity is eternal; he is not born, and in spite of his being situated in a material body, he is transcendental and eternal. Thus he cannot be destroyed. By nature he is full of bliss. He does not engage himself in any material activities; therefore the activities performed due to his contact with material bodies do not entangle him.

🌹 🌹 🌹 🌹 🌹